1400 మంది కార్మికుల పొట్టకొట్టకండి... పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి

1400 మంది కార్మికుల పొట్ట కొట్టొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు విజ్ఞప్తి చేశారు.

news18-telugu
Updated: May 2, 2020, 8:00 PM IST
1400 మంది కార్మికుల పొట్టకొట్టకండి... పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి
పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
  • Share this:
1400 మంది కార్మికుల పొట్ట కొట్టొద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ ప్రభుత్వానికి, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ కారణంగా దేశంలోని అల్పాదాయ వర్గాల వారు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో టీటీడీలో పనిచేస్తున్న 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించడం తీవ్రమైన అన్యాయం అని అన్నారు. దేశంలో ఏ ఒక్క కార్మికుడినీ ఉద్యోగాల నుంచి తొలగించరాదని, వారికి క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిస్తే, టీటీడీ పెద్దలు ఒక్క కలం పోటుతో 1400 మంది కార్మికులను విధుల నుంచి తొలగించడం సహేతుకం కాదన్నారు. తొలగింపునకు గురైన వారంతా సుమారు 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, తక్కువ వేతనాలు పొందుతున్న వారేనని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీటీడీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని వారందరినీ కొనసాగించాలని బోర్డుకి, ఈవోకి పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు.
First published: May 2, 2020, 7:59 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading