Pawan Kalyan: ఆడబిడ్డకు న్యాయం దక్కని కర్నూలులో... జ్యుడీషియల్ కేపిటల్ పెట్టి ఏం లాభం?

విద్యార్థినికి న్యాయం జరగకపోతే.. కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ పెట్టి ఏం లాభం? అని జగన్ ప్రభుత్వాన్ని అడిగారు. రాయలసీమలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు మాట్లాడరని నిలదీశారు.

news18-telugu
Updated: February 12, 2020, 5:41 PM IST
Pawan Kalyan: ఆడబిడ్డకు న్యాయం దక్కని కర్నూలులో... జ్యుడీషియల్ కేపిటల్ పెట్టి ఏం లాభం?
కర్నూలు పర్యటనలో పవన్ కళ్యాణ్
  • Share this:
జనసేనాని పవన్ కళ్యాణ్ కర్నూలు పర్యటనలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దిశ కేసు తరహాలోనే కర్నూలు అమ్మాయి సుగాలి ప్రీతిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. తాను నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని తానేమి డిమాండ్ చేయడం లేదని, అయితే ప్రీతి హత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలంటూ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. అయితే ఈ ఘటనపై రాష్ట్రప్రభుత్వం స్పందన కరువు అవ్వడంతోనే తాను రోడ్డెక్కాల్సి వచ్చిందని పవన్ అన్నారు. అంతేకాదు సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించకుంటే.. మానవ హక్కుల సంఘం తలుపు తడతానని పవన్ హెచ్చరించారు. దిశ అత్యాచారం, హత్య కేసు గురించి అసెంబ్లీలో ప్రసంగాలు చేసిన సీఎం జగన్.. కర్నూలులో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఎందుకు స్పందించడం లేదని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కనీసం ఒక ఆడబిడ్డకు న్యాయం జరగకపోతే.. కర్నూలులో జ్యుడీషియల్ కేపిటల్ పెట్టి ఏం లాభం? అని జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాయలసీమలో ఆడబిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. విద్యార్థిని హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని పవన్ డిమాండ్ చేశారు.

First published: February 12, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు