వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోండి...పవన్ వినతి

కరోనా నేపథ్యంలో సురక్షిత ప్రాంతాలకు తరలింపు, పునరావాసంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వానికి సూచించారు.

news18-telugu
Updated: August 16, 2020, 10:23 PM IST
వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఆదుకోండి...పవన్ వినతి
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి
  • Share this:
గోదావరి నదికి వరద ఉధృతి ప్రమాదకర స్థాయిలో ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం పూర్తి సన్నద్ధతతో ఉండాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసేటప్పటికే గోదావరి జిల్లాల్లోని లంక భూములు, కొన్ని గ్రామాలు నీట మునిగిపోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఉభయ గోదావరి జిల్లాల రైతాంగం ఆందోళనలో ఉన్న విషయం తన దృష్టికి వచ్చిందన్నారు. మరో వైపు ఎగువన ఉన్న భద్రాచలంలో ఇప్పటికే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినందున ప్రభుత్వం యంత్రాంగం అప్రమత్తతతో తగిన పునరావాస చర్యలు చేపట్టాలని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించడంతోపాటు వారికి తగిన వైద్య, ఆరోగ్య, వసతులు కల్పించాలన్నారు. ఇప్పుడు వస్తున్న వరదలను ప్రత్యేక దృష్టితో చూసి అత్యంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

Independence day, Independence day 2020, Happy independence day, 74th independence day, Independence day speech, 15th august independence day, India Independence day, Independence day wishes, Independence day quotes, independence day posters, independence day status, independence day posts, Why Do We Celebrate Independence Day In India, Independence Day Celebration, Freedom Fighters, Independence Day Songs, Independence Day Theme, 2020 Independence Of India, Red Fort, Swatantrata Diwas, Independence Day History, Independence Day Significance, Speech on independence day, freedom fighters of india, independence day speech for kids, independence day speech in English, poster on independence day, indian flag, patriotic songs, స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్ట్ 15 శుభాకాంక్షలు, ఇండిపెండెంట్స్ డే,
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్


కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని..తూర్పుగోదావరి జిల్లాలో కరోనా పొజిటివ్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఈ తరుణంలో వరద ప్రభావిత ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. భౌతిక దూరానికి ఆస్కారం ఉండేలా లాంచీలు, మర బోట్లను ఎక్కువ సంఖ్యలో సిద్ధపరచుకోవడంపై అధికార యంత్రాంగం దృష్టి పెట్టాలని కోరారు. పునరావాస కేంద్రాల సంఖ్యను పెంచి అక్కడ కూడా కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. కరోనా వైరస్ విస్తృతికి ఆస్కారం లేకుండా తగిన చర్యలు తీసుకోవడం తప్పనిసరిగా పేర్కొన్నారు.

అలాగే పంటలు నష్టపోతున్న రైతులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం ఆ నష్టాన్ని భర్తీ చేస్తామని ప్రకటించాలని పవన్ కోరారు.
Published by: Janardhan V
First published: August 16, 2020, 10:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading