PAWAN KALYAN AND NARA CHANDRABABU NAIDU PAYS TRIBUTE TO SWAMY VIVEKANANDA ON HIS 158TH BIRTH ANNIVERSARY
Swamy Vivekananda Birth Anniversary: పవన్ కల్యాణ్ పై ప్రభావం చూపిన ఆ ఐదు అంశాలు ఇవే..!
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)
స్వామి వివేకానంద 158వ జయంతి (Swamy Vivekananda Birth Anniversary) సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయన బోధనలను స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలో జనసేన (Janasena party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan kalyan) ట్విట్టర్ (Twitter) ద్వారా నివాళులర్పించారు.
స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు శుభాకాంక్షలు చెప్తున్నారు. భారత దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దశదిశలా చాటిన వ్యక్తి స్వామి వివేకానంద. పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ వేదాంతం, ఆధ్యాత్మికత, యోగా, తత్వాలను పరిచయం చేయడంలో కీలకపాత్ర పోషించిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఆయన చేసిన ప్రసంగాలు, రచనలు చాలా మందిలో స్ఫూర్తి నింపాయి. జాతీయ యువజన దినోత్సవం నాడు యువశక్తిపై,విద్యపై, దేశంపై, హిందుయిజంపై, వ్యక్తిత్వంపై ఆయన చేసిన బోధనలను స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ ద్వారా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ట్వీట్లు చేసిన పవన్ కల్యాణ్.., తన తండ్రి.., శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, శ్రీ లాహిరిమహాశయ మరియు స్వామి యోగానందలకు పరమ భక్తుడు అని. చిన్నతనంలో వారి బోధనలు వింటూ పెరిగానని పవన్ పేర్కొన్నారు. స్వామి వివేకానంద మాటలు నా మనస్సులో లోతుగా నాటుకుపోయాయని పేర్కొన్నారు. ఆయన జయంతి నాడు గౌరవంతో స్వామీజీకి నమస్కరిస్తున్నాను అని పేర్కొన్నారు.
My father being an ardent devotee of Sri Ramakrishna Paramahamsa ,Swami Vivekananda ,Sri Lahirimahasaya & Swami Yogananada. I grew up with their teachings. Swami Vivekananda’s words have deeply embedded into my conscience. On his Jayanthi I bow to swamiji with utmost reverence. pic.twitter.com/hAPMhs81k7
ఈ సందర్భంగా తనపై ప్రభావం చూపిన వివేకానందుడి ఐదు బోధనలను పవన్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా దేశంలో యువత, వారి శక్తియుక్తులపై, మనిషి వ్యక్తిత్వంపై విద్య చూపే ప్రభావంపై, అలాగే చికాగో ప్రసంగంలో హిందూ మతం యొక్క ఔన్నత్యంపై వివేకానంద చేసిన వ్యాఖ్యలు, భారతదేశం ఎందుకు పుణ్యభూమిగా పిలవబడుతుందో వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు, మనిషి పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సాధించడానికి దోహదపడే అంశాలపై చేసిన బోధనలను పవన్ ట్వీట్లు చేశారు.
వివేకానంద జయంతి సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో నివాళులర్పించారు. “జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటోన్న యువతకు శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారతదేశ సొంతం. అపారమైన మేథస్సు, శక్తి సామర్థ్యాలు కలిగిన మన యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నైపుణ్యాల అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చాం” అని చంద్రబాబు పేర్కొన్నారు.
వివేకానంద జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవం జరుపుకుంటోన్న యువతకు శుభాకాంక్షలు. ప్రపంచంలో ఏ దేశానికి లేని యువశక్తి భారతదేశ సొంతం. అపారమైన మేథస్సు, శక్తి సామర్థ్యాలు కలిగిన మన యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నైపుణ్యాల అభివృద్దికి ప్రాధాన్యత ఇచ్చాం.(1/5)#NationalYouthDay
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) January 12, 2021
రాష్ట్రాన్ని చక్కదిద్దే బాధ్యతను యువత తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. “వివేకానందుడి మార్గదర్శకంలో హింసా విధ్వంసాలు, కక్ష సాధింపు చర్యలు లేని సమాజాన్ని ఆవిష్కరించాల్సింది యువతరమే. ‘‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం’’ ఉన్న యువతగా మీరంతా రూపొందాలి. అన్ని రంగాల్లో మన దేశాన్ని, రాష్ట్రాన్ని ముందంజ వేయించాలి” అని పిలుపునిచ్చారు.