ఉద్దానం కిడ్ని రోగుల కోసం పవన్ దీక్ష..

Sunil Kumar Jammula | news18
Updated: June 6, 2018, 6:29 PM IST
ఉద్దానం కిడ్ని రోగుల కోసం పవన్ దీక్ష..
  • News18
  • Last Updated: June 6, 2018, 6:29 PM IST
  • Share this:
పవన్ కళ్యాణ్ ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారానికి 48 గంటల డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే. పవన్ విధించిన డెడ్ లైన్ శుక్రవారం  ఉదయం 11 గంటలగు ముగిసింది. ఇప్పటి వరకు పవన్  అల్టిమేటాన్ని టిడిపి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని, ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాలేదంటున్నారు జనసేన వర్గాలు.

దీనితో ఈ రోజు సాయంత్రం  5 గంటలు నుండి నుంచి రేపు  ఉదయం 9  గంటల వరకు రిసార్టులో నిరాహార దీక్ష చేస్తారు. రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకాకుళం పట్టణంలో ప్రజల మధ్య దీక్షను కొనసాగిస్తారు.

మరోవైపు, పంచాయితీ, వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. పవన్ ఆరోపణల్లో నిజం లేదని తెలిపారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఇప్పటి వరకు ఉద్దానం కిడ్నీ సమస్యలపై చేపట్టిన కార్యక్రమాలని వివరించారు.

మరి  కాసేపట్లో పవన్  దీక్ష ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం ముందు జనసేన పలు డిమాండ్లు ఉంచింది.

First published: May 25, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...