హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రెవెన్యూ ఉద్యోగుల్లో వణుకు పుట్టించింది.తమ భద్రతపై ప్రభుత్వం భరోసా కల్పించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన ఓ తహశీల్దార్ ముందు జాగ్రత్తగా తీసుకున్న ఓ చర్య ఆసక్తిని రేకెత్తిస్తోంది. కర్నూలు జిల్లా పత్తికొండ తహశీల్దార్ ఉమా మహేశ్వరి తన చాంబర్ ఎంట్రన్స్‌లో అడ్డుగా ఓ తాడును కట్టించారు. దరఖాస్తులు,ఇతరత్రా ఆర్జీలతో వచ్చేవారు.. తాడు బయటే నిలబడి ఇవ్వాలని.. ఎవరినీ లోపలికి అనుమతించవద్దని సిబ్బందిని ఆదేశించారు. తహశీల్దార్ హడావుడితో సిబ్బందితో పాటు అక్కడికి వచ్చిన జనం ఆశ్చర్యపోయారు. దీనిపై తహశీల్దార్ మాట్లాడుతూ.. తమ భద్రత గురించి తామే జాగ్రత్తగా ఉండాలి కదా అని చెప్పినట్టు సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool