• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • PARTS OF NORTH COASTAL AND SOUTH COASTAL ANDHRA LIKELY TO WITNESS HEAVY RAINS BA

AP Rains: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక, ఈ జిల్లాల్లో ప్రజలు జాగ్రత్త

AP Rains: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక, ఈ జిల్లాల్లో ప్రజలు జాగ్రత్త

ప్రతీకాత్మక చిత్రం

AP Rains Alert: ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

  • Share this:
    AP Weather Update: కర్ణాటక తీరానికి దగ్గరలో తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో 1.5 కి.మీ నుంచి 5.8 కి.మీ ఎత్తు మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తూర్పు-పశ్చిమ shear zone 13°N Latitude వెంబడి పెనిన్సులర్ ఇండియా మీదుగా 3.1 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కి.మీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరలో పశ్చిమమధ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 13న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

    ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    ap rains, telangana rains, heavy rain, weather update, climate news, rainfall, rain news, weather, climate, red alert, rain alert, భారీ వర్షాలు, వాతావరణ వార్తలు, ఏపీలో వర్షాలు, తెలంగాణలో వర్షాలు,
    ప్రతీకాత్మక చిత్రం


    దక్షిణ కోస్తా ఆంధ్ర :
    ఈ రోజు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి దక్షిణకోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    YSR Agri Labs, Andhra Pradesh, YSR Agri labs, ap labs, ఆంధ్రప్రదేశ్ రైతులు, వైఎస్ఆర్ అగ్రి ల్యాబ్స్, ఏపీ రైతులు,
    ప్రతీకాత్మక చిత్రం


    రాయలసీమ :
    ఈరోజు, రేపు, ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

    ప్రతీకాత్మక చిత్రం


    ప్రకాశం జిల్లాకు పిడుగు హెచ్చరిక
    ప్రకాశం జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. కనిగిరి, కొనకనమిట్ల, మర్రిపూడి, హనుమంతునిపాడు మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉంది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని విపత్తుల నిర్వహణ శాఖ కమీషనర్ కె.కన్నబాబు సూచించారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు