Home /News /andhra-pradesh /

PARROT GROUPS COME TOGETHER IN A VILLAGES AND STAY THERE NGS VSP

Parrot Village: వరి కుప్పలే పచ్చని చిలుకల నేస్తాలు.. ఈ చిలకల గ్రామం ఎక్కడుందో తెలుసా..?

వరి కుప్పలు పచ్చని చిలుకల ఆవాసం

వరి కుప్పలు పచ్చని చిలుకల ఆవాసం

ఈ రోజుల్లో పచ్చని చిలుకలు ఒకటి రెండు కనిపించడమే చాలా అరుదు.. చిలుక జోష్యం అంటూ పంజరం పట్టుకు తిరిగే వారి దగ్గర తప్ప ఎక్కడా కనిపించవు.. కానీ ఒక గ్రామంలో వందల సంఖ్యలో చిలుకలు వచ్చి వాలుతూ ఉంటాయి.. ఇంతకీ ఆ గ్రామం ఎక్కడో తెలుసా..?

    పచ్చ రంగులో ఉండే రామ చిలుక అందమే వేరు. ఆ చిలుకను ఎన్ని సార్లు చూసినా చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. గతంలో పల్లెటూర్లలో ఎక్కువగా ఈ చిలుకలు దర్శనమిచ్చేవి.. కానీ ఇప్పుడు వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. కేవలం ఇంటి గుమ్మంలో పంజరాలకో.. జ్యోతిష్యం చెబుతామంటూ పంజారాలు పట్టుకు తిరిగి చిలుక జోష్యుల దగ్గర మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చిలక పలుకలంటే చాలామందికి ఇష్టం.. తనదైనా భాషలో ఎన్నో ఊసులు చెబుతూ ఉంటుంది చిలుక.. అయితే ఒకటి రెండు చిలకలు చూస్తూనే తెగ సంబరపడిపోతాం.. అలా చూస్తూ ఉండిపోతాం.. కానీ ఒక గ్రామంలో ఎక్కడ చూసినా చిలుకలే దర్శనమిస్తున్నాయి. అయితే అది జనవాసాల మధ్య కాదు.. రైతుల పొలాల్లో వేసిన వరి పచ్చని వరి చేలపై.. ఆ పచ్చని చిలుకలు గుంపులు గుంపులుగా వాలి సందడి చేస్తాయి.. అందుకే ఆ గ్రామాన్ని చాలామందది చిలకల గ్రామమని సరదగా పిలుస్తూ ఉంటూరు.. ఇంతకీ అది ఎక్కడ ఉంది అనుకుంటున్నారా...

    తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మండలం గోకివాడ పంటపోలాల్లో చిలుకల సందడి కను విందు చేస్తున్నాయి. పంట పోలల్లో ఉన్న వరి కుప్పలపై రామచిలుకల గుంపు ఆహారం కోసం వచ్చి వరికంకులు తింటు కనువిందు చేస్తూన్నాయి. అటుగా ఉదయాన్నే రోడ్డున వేళ్ళే వాకర్స్ అగి వాటిని చూసి అలాగే ఆగిపోతారు.. పావురాలను చాలా మంది గుంపులుగా చూస్తారు.. తప్పా ఎక్కడా ఇలా చిలుకలు గుంపు చూడలేదంటున్నారు. సరిగ్గా ఉదయం 6 గంటల నుండి 7గంటల వరకు.. ఆ ఒక్క గంట మాత్రమే అవి కనిపిస్తూ కనువిందు చేస్తాయి.

    సాధారణంగా రామ చిలుకలు రెండు లేదా తక్కువ సంఖ్యలో తోటల్లో చెట్లపైన దర్శనమిస్తాయి. కాని గుంపులు గుంపులుగా ఒకేసారి వచ్చి వరికుప్పలపై వాలి చిలకపలుకు మాటలతో ధాన్యాన్ని తింటూన్నాయి. ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో తెగ అల్లరి చేస్తూన్నాయి. కాని వర్షాలు మొదలవ్వటంతో రైతులకు మళ్ళి వ్యవసాయం మొదలు పెట్టెందుకు వరి కుప్పలు తీసి నూర్పు చెస్తే ఆ చిలుకలు మాయమైపోతాయి అంటున్నారు.. మళ్లీ వరి కుప్పలు వేసే వరకు అటువైపు రావంటున్నారు.

    ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో సెల్ టవర్లు విస్తరించడం.. విద్యుత్ స్తంభాల ఏర్పాటు కారణంగా చాలా వరకు పక్షులు అంతరించిపోతున్నాయి. కానీ ీ పల్లెలో మాత్రం గుంపులు గుంపులుగా చిలుకలు దర్శనమివ్వడంపై ఆ గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సూర్యోదయం వేళ శుభోదయం అంటూ పకృతి పలకరించినట్టు చాలా సంతోషంగా ఉంటుంది అంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist

    తదుపరి వార్తలు