ఏపీ (Andhra Pradesh)లో టెన్షన్ వాతవరణం నెలకొంది. శ్రీ సత్యసాయి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunita), పరిటాల శ్రీరామ్ (ParitalaSriram), మాజీ ఎమ్మెల్యే బికె పార్ధసారధి (Bk Pardhasaradhi), టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. టీడీపీ నేత జగ్గును విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడకు భారీగా టీడీపీ శ్రేణులు తరలివస్తున్నారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఈ రచ్చకు ఆ వ్యాఖ్యలే కారణం..
అయితే పరిటాల కుటుంబం పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగడం వెనక కారణం లేకపోలేదు. ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి పరిటాల సునీత కుటుంబంపై, టీడీపీ (Telugu Desam Party)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని, టీడీపీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు , లోకేష్ లను చంపేస్తామని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించిన బత్తలపల్లికి చెందిన టీడీపీ (Telugu Desam Party) నేత జగ్గు కౌంటర్ ఇచ్చారు. దీనితో జగ్గును శనివారం రాత్రు పోలీసులు తీసుకెళ్లారని టీడీపీ (Telugu Desam Party) నేతలు ఆరోపించారు. జగ్గు కోసం కొత్తపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చిన తమ నాయకులపై వైసిపి నేతలు దాడికి దిగారని మాజీ మంత్రి పరిటాల సునీత (Paritala Sunita) ఆరోపించారు.
టీడీపీ నేత జగ్గును వెంటనే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ ఉదయం నుండి చెన్నె కోఆపల్లి పోలీస్ స్టేషన్ ముందు టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. వైసిపి నేతలకు సహకరించిన పోలీసులను సస్పెండ్ చేయాలనీ మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు. పరిటాల కుటుంబాన్ని భూస్థాపితం చేస్తామని, టీడీపీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు, లోకేష్ లను చంపేస్తామని వ్యాఖ్యానించిన చంద్రశేకర్ రెడ్డిపై కేసులు నమోదు చేయాలనీ పరిటాల సునీత డిమాండ్ చేశారు. బత్తలపల్లికి మండలానికి చెందిన టీడీపీ నేత జగ్గును విడిచిపెట్టె వరకు ఆందోళన విరమించబోమని టీడీపీ నేతలు స్పష్టం చేశారు.
అలాగే టీడీపీ నేతలపై అనుచిహ వ్యాఖ్యలు చేసిన వైసిపి నేతలపై కేసులు నమోదు చేయలని మాజీ మంత్రి పరిటాల సునీత డిమాండ్ చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP News, Paritala sriram, TDP, Ycp