HOME »NEWS »ANDHRA PRADESH »parents appeal for ill daughter mercy killing in chittoor madanapalle su

Mercy Killing Appeal: నా కూతురిని చంపేయండి.. మదనపల్లె కోర్టులో ఓ కన్నతల్లి ఆవేదన

Mercy Killing Appeal: నా కూతురిని చంపేయండి.. మదనపల్లె కోర్టులో ఓ కన్నతల్లి ఆవేదన
ప్రతీకాత్మక చిత్రం

తన చిన్నారి కూతురిని చంపేయాలని కోరింది ఓ కన్నతల్లి. అయితే ఇది కర్కశత్వంతో చేసిన పని కాదు.. అనారోగ్యంతో బాధపడుతున్న కూతురి భాద చూడలేక ఆ నిర్ణయం తీసుకుంది.

  • Share this:
    తన చిన్నారి కూతురిని చంపేయాలని కోరింది ఓ కన్నతల్లి. అయితే ఇది కర్కశత్వంతో చేసిన పని కాదు.. అనారోగ్యంతో బాధపడుతున్న కూతురి భాద చూడలేక ఆ నిర్ణయం తీసుకుంది. తన బిడ్డ కారుణ్య మరణానికి అనుమతించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లెలో చోటుచేసుకుంది. వివరాలు..  మదనపల్లి పట్టణానికి చెందిన రామకృష్ణ, గీతాంజలి దంపతులకు పదేళ్ల క్రితం పెళ్లైంది. రామకృష్ణ కన్‌స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు ఏడేళ్ల క్రితం నాగలక్ష్మి పాప జన్మించింది. అయితే పాప పుట్టే సమయంలో తల్లి కడుపులోని ఉమ్మనీరు తాగడంతో పరిస్థితి విషమించింది. దీంతో వారు అప్పుడు తిరుతితో ఆపరేషన్ చేయించి పాపను కాపాడుకోగలిగారు. అయితే బిడ్డ జన్మించినప్పటి నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. చిన్నారిలో మానసిక ఎదుగదల నిలిచిపోయింది. దీంతో చిన్నారి సరదాగా ఆడుకోవాల్సిన వయసులోనే ఎన్నో ఇబ్బందులు పడుతుంది. ఇక, చిన్నారి కష్టం చూడలేక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమకు తెలిసిన ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. ఎంతో మంది వైద్యుల్ని కలిశారు. అయితే చాలా మంది వైద్యులు చిన్నారికి చికిత్స చేయాలంటే చాలా డబ్బు ఖర్చవుతుందని తెలిపారు.

    అయితే అందుకు రామకృష్ణ-గీతాంజలి దంపతుల ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. దీంతో ఏం చేయలేని స్థితిలో ఉండిపోయారు. చిన్నారిని అలా చూస్తూ తట్టుకోలేకపోతున్నారు. ఆమెను బతికించాలంటే నెలకు 10వేల రూపాయల మందులు కావాలని.. కానీ తమ వద్ద డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు కష్టపడి సంపాదించిన డబ్బుతోపాటుగా అప్పులు తెచ్చి చికిత్స చేయించామని.. ఇప్పుడు తమ పరిస్థితి దయనీయంగా మారిందని చెప్పారు.



    చిన్నారి నాగలక్ష్మి కారుణ్య మరణానికి అనుమతించాలని ఆమె తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు మదనపల్లి న్యాయమూర్తికి వినతిపత్రం అందజేశారు. చిన్నారికి వైద్యం చేయించేందుకు సరిపడ డబ్బులు లేవని.. బిడ్డ ఆ స్థితిలో ఇబ్బందులు పడటం తాము చూడలేకపోతున్నామని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. వారి ఆవేదనను విన్న న్యాయమూర్తి.. పాప వైద్యానికి ఖర్చు చేసిన బిల్లులు తీసుకుని తనవద్దకు రావాలని సూచించారు.
    Published by:Sumanth Kanukula
    First published:December 09, 2020, 08:31 IST