పాపికొండల్లో విహారానికి పచ్చజెండా

Shiva Kumar Addula | news18india
Updated: May 30, 2018, 7:20 AM IST
పాపికొండల్లో విహారానికి పచ్చజెండా
  • Share this:


పాపికొండల్లో మళ్లీ పడవలు, లాంచీలు విహరించనున్నాయి. తనిఖీల అనంతరం బోటు ప్రయాణాలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  వరుస పడవ ప్రమాదాల నేపథ్యంలో.. బోట్ జర్నీకి కొన్ని రోజులు బ్రేకులు పడ్డాయి. పాపికొండల విహారయాత్రకు రెండు వారాలు విరామం ఇచ్చారు.  ఆ గ్యాప్ లో ఉభయ గోదావరి జిల్లాల్లోని లాంచీలు, బోట్లను అధికారుల ముమ్మరంగా తనిఖీలు చేశారు. అనంతరం ఫిట్ గా ఉన్న వాటికి అనుమతులిచ్చారు.

ఈ నెల 15న గోదావరి నదిలో జరిగిన లాంచీ ప్రమాదంలో 19 మంది చనిపోయారు. దీంతో అప్రమత్తమైన అధికారులు లాంచీలు, పడవలను తనిఖీలు చేశారు. మొత్తం 73 లాంచీలు, ఆరు పంట్లను పరిశీలించారు. సింగనపల్లి రేవులో 18 బోట్లు, ఆరు లాంచీలను తనిఖీ చేయగా అనేక లోపాలు బయటపడ్డాయి. కాలితో తన్నితే లాంచీ రేకులు విరిగిపోయేలా అధ్వాన్నంగా ఉన్నాయి. మరో 16 బోట్లలో లైఫ్ జాకెట్లు లేవు.

గోదావరి జిల్లాలోని 73 బోట్లను పోర్టు,మత్స్యశాఖ, అగ్నిమాపకశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. దాంతో పాపికొండలతో పాటు దేవీపట్నం-సింగనపల్లి, పురుషోత్తపట్నం-పోలవరం, గూటాల-వంగలపూడి రూట్లలో ఫెర్రీలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు  ఇబ్బందులు పడ్డారు. ఐతే ఎట్టకేలకు ఫిట్ గా ఉన్న లాంచీలు, బోట్లకు అధికారులు అనుమతులిచ్చారు. పాపికొండల యాత్రకు వెళ్లే 6 బోట్లకు పచ్చజెండా ఊపారు.
Published by: Shiva Kumar Addula
First published: May 30, 2018, 7:20 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading