PAPER LEAKAGE TENSION IN AP SSC EXAMS 2022 AS HINDI QUESTION PAPER LEAKED IN SRIKAKULAM FULL DETAILS HERE PRN
AP SSC Exams-2022: వాట్సాప్ లో టెన్త్ ప్రశ్నాపత్రాలు.. ఎందుకిలా జరుగుతోంది..? విద్యార్థుల్లో టెన్షన్..
ఏపీ టెన్త్ పరీక్షల్లో హిందీ పేపర్ లీక్..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పరీక్షల (AP SSC Exams-2022) సందర్భంగా పేపర్ లీక్ వార్తలు కలకలం రేపుతున్నాయి. పరీక్షల తొలిరోజు చిత్తూరు జిల్లా (Chittoor District) లో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు పేపర్ వాట్సాప్ లో ప్రత్యక్షమైనట్లు వార్తలు వైరల్ అయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదో తరగతి పరీక్షల (AP SSC Exams-2022) సందర్భంగా పేపర్ లీక్ వార్తలు కలకలం రేపుతున్నాయి. పరీక్షల తొలిరోజు చిత్తూరు జిల్లా (Chittoor District) లో పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే తెలుగు పేపర్ వాట్సాప్ లో ప్రత్యక్షమైనట్లు వార్తలు వైరల్ అయ్యాయి. ఐతే ఆ వార్తలు అవాస్తవమని అధికారులు తేల్చారు. ఐతే పరీక్షల రెండో రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. హిందీ పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) సరబుజ్జిలి మండలం రొట్టవలస పరీక్షా కేంద్రంలో హిందీ పేపర్ లీక్ అయినట్లు వదంతులు వస్తున్నాయి. పరీక్ష ప్రారమైన కాసేపటి తర్వాత ప్రశ్నాపత్రం వాట్సాప్ గ్రూపుల్లో కనిపిచినట్లు తెలియడంతో అధికారులు విచారణ ప్రారంభించారు.
ఇదిలా ఉంటే పరీక్షల తొలిరోజు నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఆంకిరెడ్డి పల్లె జడ్పీ జడ్పీహెచ్ హైస్కూల్ లో తెలుగు ప్రశ్న పేపర్ లీక్ అయింది. ఎగ్జామ్ పేపర్ సోషల్ మీడియాలో కనిపించడంతో కలకలం రేగింది. బుధవారం ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభంకాగా.. 11గంటలకు క్వశ్చన్ పేపర్ వాట్సాప్ లో ప్రత్యక్షమైంది. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు వెంటనే స్కూల్ కు చేరుకొని విచారణ చేపట్టారు. నంద్యాల డీఈఓ సత్యనారాయణ మూర్తి, ఆళ్లగడ్డ డీఎస్పీ రాజేంద్ర అంకిరెడ్డిపల్లెకి వెళ్లి వివరాలు సేకరించారు.
ముగ్గురు ఉపాధ్యయులు, ఓ సీఆర్పీ కారణంగా పేపర్ లీకైనట్లు గుర్తించిన అధికారులు వారిని విచారించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గుర్నీ సస్పెండ్ చేస్తున్నట్లు నంద్యాల డిఈఓ సత్యనారాయణ మూర్తి మీడియాకు తెలిపారు. విచారణ అనంతరం కలెక్టకర్ కు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రస్తుతం ముగ్గురు ఉపాధ్యాయులు ఒక సిఆర్పీని అదుపులోకి తీసుకొన్న పోలీసుసు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
ఏపీలో ఈనెల 27 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,776 సెంటర్లలో మొత్తం 6,22,537 మంది విద్యార్తులు పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 3,776 సెంటర్లలో నిర్వహిస్తున్నారు. రెండేళ్ల తర్వాత టెన్త్ పరీక్షలు నిర్వహిస్తుండటంతో పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. ఐతే స్మార్ట్ ఫోన్ల కారణంగా పరీక్షా పత్రాలు లీకవుతుండటం అధికారులను, విద్యార్థులను కలవర పరుస్తోంది. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పరీక్షల్లో సిబ్బంది నిర్లక్ష్యం స్టూడెంట్స్ ను టెన్షన్ పెడుతోంది. పరీక్షా కేంద్రాల్లో స్మార్ట్ ఫోన్లను అనుమతించరాదనే నిబంధన ఉన్నా.. ఇలా ఫోటోలు తీసి వైరల్ చేయడం తీవ్ర వివాదాస్పదమవుతోంది.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.