• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • PANCHAYAT ELECTIONS BRING NEW TENSION FOR BJP JANASENA ALLIANCE IN ANDHRA PRADESH AK

BJP-Janasena: బీజేపీ, జనసేన కూటమికి కొత్త టెన్షన్.. అనుకోని విధంగా..

BJP-Janasena: బీజేపీ, జనసేన కూటమికి కొత్త టెన్షన్.. అనుకోని విధంగా..

జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

BJP-Janasena: పంచాయతీ ఎన్నికల విషయంలో బీజేపీ, జనసేన ఏ రకమైన విధానంతో ముందుకు సాగుతాయన్నది ఇంకా తేలలేదు. ఇంకా చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ చేసిన ఈ రెండు పార్టీలకు.. అకస్మాత్తుగా వచ్చినట్టు ఈ పంచాయతీ ఎన్నికలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.

  • Share this:
    ఏపీలో ప్రస్తుతం మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ,జనసేన పార్టీలు.. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారా ? లేక జనసేన అభ్యర్థి పోటీ చేస్తారా ? అన్న అంశం తేలకపోయినప్పటికీ.. ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా సత్తా చాటాలని ఇరు పార్టీలు ఉమ్మడిగా నిర్ణయించాయి. తిరుపతి ఉప ఎన్నికల్లో బలం చాటితేనే.. ఆంధ్రప్రదేశ్‌లో తాము బలపడతామనే సంకేతాలు ప్రజలకు ఇవ్వొచ్చని బీజేపీ నమ్ముతోంది. అలా జరగని పక్షంలో ఏపీలో రాజకీయ శక్తిగా ఎదగాలన్న తమ కోరిక తీరడం మరింత కష్టమవుతుందని ఆ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. వారి ఆలోచనలు ఈ రకంగా ఉంటే.. ఏపీలో జరగనున్న పంచాయతీ ఎన్నికలు ఈ బీజేపీ జనసేన కూటమికి పెద్ద పరీక్షగా మారబోతున్నాయని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

    పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతాయని పైకి చెప్పినా.. అక్కడ పోటీ చేసే అభ్యర్థులు, గెలిచే అభ్యర్థుల్లో 90 శాతానికి పైగా రాజకీయ పార్టీలకు చెందిన వాళ్లే ఉంటారన్నది ఎవరూ కాదనలేని విషయం. పార్టీలు సైతం తమ పార్టీకి చెందిన నాయకులను బరిలో నిలుపుతుంటాయి. ఏపీలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ, టీడీపీ.. పంచాయతీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకునేందుకు అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఆ పార్టీలకు ఉన్న క్యాడర్ వాటిని అదనపు బలం.

    పంచాయతీ ఎన్నికల విషయంలో బీజేపీ, జనసేన ఏ రకమైన విధానంతో ముందుకు సాగుతాయన్నది ఇంకా తేలలేదు. ఇంకా చెప్పాలంటే తిరుపతి ఉప ఎన్నికపై ఫోకస్ చేసిన ఈ రెండు పార్టీలకు.. అకస్మాత్తుగా వచ్చినట్టు ఈ పంచాయతీ ఎన్నికలు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టాయనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు తమ పార్టీకి క్యాడర్, బలం ఉందని భావిస్తున్న పలు ప్రాంతాల్లో ఇప్పటికే జనసేన నేతలు, కార్యకర్తలు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. బీజేపీతో సంబంధం లేకుండానే కొన్ని చోట్ల జనసేన నేతలు సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

    అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ, జనసేన అభ్యర్థులు ఏ మేరకు ఫలితాలు సాధిస్తారనే అంశం.. తిరుపతి ఉప ఎన్నికల్లో తమపై ప్రభావం పడుతుందేమో అనే టెన్షన్ బీజేపీ, జనసేనలో ఉందనే ప్రచారం సాగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ఎక్కువగా అనుకూల ఫలితాలు వస్తాయని.. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవద్దని ఇరు పార్టీలకు చెందిన నేతలు భావిస్తున్నారు. మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించి టీడీపీని రెండో స్థానం నుంచి మూడో స్థానానికి దించాలని భావిస్తున్న బీజేపీ, జనసేన కూటమి.. పంచాయతీ ఎన్నికల్లోనూ అలాంటి వ్యూహాలు రచిస్తుందా అన్నది చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published:

    అగ్ర కథనాలు