హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Prabhas: పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. ఏపీకి ఎంత విరాళం ఇచ్చారంటే?

Prabhas: పెద్ద మనసు చాటుకున్న ప్రభాస్.. ఏపీకి ఎంత విరాళం ఇచ్చారంటే?

ప్రభాస్

ప్రభాస్

Darling Prabhas: పాన్ ఇండియా హీరో ప్రభాస్ నిజంగానే డార్లింగ్ అనిపించుకున్నారు. బాహుబళి లాంటి పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్న ఆయన.. సాయం చేయడంలోనూ అంతే పెద్ద మనసు చూపిస్తున్నారు. తాజాగా ఏపీలో వరద బాధితుల కోసం ఆయన భారీ విరాళం ప్రకటించారు.. ఎంతో తెలుసా.?

ఇంకా చదవండి ...

Great Human star hero Prabhas:  యంగ్  రెబల్ స్టార్ ప్రభాస్ (Young rebel star prabash) ను అభిమానులు ముద్దుగా డార్లింగ్ (Darling) అనిపిలుచుకుంటారు. అయితే ఆయన రియల్ లైఫ్ లోనూ అందరితో డార్లింగ్ అనిపించుకుంటున్నారు. బాహుమళి, సాహో, రాధేశ్యామ్ (Radhe Shayam) లాంటి పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాలతో  జాతీయ స్థాయిలో స్టామినా చూపిస్తూ..  భారీ బడ్జెట్ మూవీలకు కేరాఫ్ అయ్యారు. అయితే సాయం చేయడంలోనూ అదే పెద్ద మనసు చాటుకుంటున్నారు. తాను చేసే సినిమాకు భారీగా  రెమ్యునిరేషన్ తీసుకునే ప్రభాస్ సాయం చేయడలోనూ తనది పెద్ద చేయే అని నిరూపించుకుంటున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని వరద బాధితుల (Andhra Pradesh flood victims) కోసం. సీఎం రిలీప్ పండ్ కు ప్రభాస్ కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఇటీవల కరోనా లాక్ డౌన్ సమయంలోనూ రెండు తెలుగు రాష్ట్రాలు, కేంద్రానికి కలిపి ఆయన నాలుగు కోట్ల విరాళం ప్రకటించారు. ఇప్పుడు మరోసారి పెద్ద మనసు చూపిస్తే ఏకంగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు..

టాలీవుడ్ నుంచి మొట్టమొదటగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) 25 లక్షల రూపాయల విరాళమిచ్చారు. ఆ వెంటనే మిగితా టాలీవుడ్ హీరోలు కూడా పోటీ పడి విరాళాలు ఇచ్చారు. చిరంజీవి (Chiranjeevi), మహేష్ బాబు (Maheshbabu), రామ్ చరణ్ (Ramcharan) ఇలా ఒకళ్ళ తర్వాత మరొకరు పోటీ పడి విరాళాలు చదివించారు. అయితే ఈ హీరోలు అంతా పెళ్లికి 116 రూపాయలు చదివించే రీతిలో 25 లక్షలను టార్గెట్ గా విరాళాలు ప్రకటించేశారు. ఆ తరువాత గీతా ఆర్ట్స్ కూడా ముందుకు వచ్చింది. ఇలా ఇప్పుడు ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు. అయితే వారందరి కంటే.. ప్రభాస్ గొప్ప మనసు చాటుకున్నారు. ఏకం కోటి రూపాయలు విరాళం ప్రకటించారు.

ఇదీ చదవండి : క్షమాపణ సరిపోదు.. వారం రోజుల పాటు ఆ పని చేయండి. ఖర్చులూ భరించాలి.. అధికారికి హైకోర్టు వింత శిక్ష

గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్ వరదలతో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అయ్యింది. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలను భారీ వానలు ముంచెత్తాయి. ఆకాశానికి చిల్లు పడిందేమో అనే రీతిలో వర్షాలు కురాసాయి. దానికి తోడు ఎగువ నుంచి వచ్చిన వరదలతో ఇళ్లు నీట మునిగాయి. పంట పొలాలు దెబ్బ తిన్నాయి. చెరువు కట్టలు తెగిపడ్డాయి. ఇప్పటికీ ఆ వరద నుంచి చాలా గ్రామాలు తేరుకోలేదు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పదుల సంఖ్యలో గ్రామలు నీళ్లలో మునిగిపోయాయి. మళ్లీ ఇప్పుడు వరదలు ముంచెత్తున్నాయి. దశాబ్దాల వ్యవధిలో ఎన్నడూ జరగనంత నష్టం ఇప్పుడు వాటిల్లింది. ప్రజలు అల్లాడిపోతుంటే టాలీవుడ్ నుంచి కనీస స్పందన కూడా లేదని వైసీపీ నేతలు విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరోలు పోటీ పడి మరి విరాళాలు అందిస్తున్నారు.

ఇదీ చదవండి : అఖంఢ సినిమాకు వెళ్లారని టీచర్ల మందలింపు.. విద్యార్థులు ఏం చేశారో తెలుసా..? ఆందోళనలో తల్లిదండ్రలు

టాలీవుడ్ విరాళాలపైనా విమర్శలు ఉన్నాయి. కొంత సమయం వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరు ఇలా విరాళాలు ప్రకటించడం చూస్తే ఇది ముందే అనుకుని ఒక ప్రణాళిక ప్రకారం చేస్తున్నట్టు గా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో టికెట్ల రేట్లను నిర్దేశిస్తూ ప్రభుత్వం జీవో రిలీజ్ చేసిన కాసేపటికే హీరోలు ఇలా విరాళాలు ప్రకటించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వరద బాధితులకు సాయం ప్రకటించి టికెట్ రేట్లు విషయంలో జగన్ మనసు మార్చడానికి వారు ఈ ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Andhra Pradesh, AP Floods, AP News, Rebel star prabhas, Tollywood, Young rebel star prabhas

ఉత్తమ కథలు