పాకిస్తాన్ చెర నుంచి విముక్తి.. భారత్ చేరుకున్న ఏపీ మత్స్యకారులు

భారత్‌కు చేరుకున్న తెలుగు మత్స్యకారులు

పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న ఆంధ్రా మత్స్యకారులకు విముక్తి లభించింది. ఏపీకి చెందిన 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు వారిని అప్పగించారు.

  • Share this:
    పాకిస్తాన్ జైల్లో మగ్గుతున్న ఆంధ్రా మత్స్యకారులకు విముక్తి లభించింది. ఏపీకి చెందిన 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది. వాఘా సరిహద్దు వద్ద BSF అధికారులకు వారిని అప్పగించారు. వారికి ఏపీ మంత్రి మోపిదేవి స్వాగతం పలికారు. 14 నెలల తర్వాత భారత గడ్డపై తెలుగు జాలర్లు అడుగుపెట్టారు. అక్కడి నుంచి అమృత్‌సర్ చేరుకున్నారు. ఈ రాత్రికి అక్కడే ఉండి.. మంగళవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరుతారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి ఏపీకి రానున్నారు. తమ వారు క్షేమంగా భారత్‌కు చేరుకున్నారని తెలిసి మత్య్సకారుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఎప్పుడెప్పుడు ఇంటికి చేరుకుంటారా..అని ఎదురు చూస్తున్నారు.

    శ్రీకాకుళం, విజయనగరానికి చెందిన వేలాది మంది మత్స్యకారులు గుజరాత్‌లోని వీర్‌వాల్‌లోని చేపల వ్యాపారుల వద్ద పనిచేస్తుంటారు. ఈ క్రమంలో 2018 నవంబరులో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి ప్రవేశించడంతో పాకిస్తాన్ నౌకాదళం వారిని అదుపులోకి తీసుకుంది. ఐతే 2008 ఒప్పందం ప్రకారం ప్రతి ఏటా జనవరి 1, జులై 1న ఇరుదేశాలు ఖైదీలను విడుదల చేస్తాయి. ఈ నేపథ్యంలో సోమవారం భారత్.. 267 మంది ఖైదీలు, 99 మంది మత్స్యకారులను విడుదల చేసింది. ఇక పాకిస్తాన్... 55 ఖైదీలు, 227 మంది మత్స్యకారులను విడుదల చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published: