Andhra Pradesh: పందెం కోడి ఫుడ్ మెనూ చూస్తే మతిపోతుంది..! ఆ పుంజులకి రాజభోగమే..!

సంక్రాంతి కోడి పందేలకు సిద్ధమవుతున్న పందెం రాాయుళ్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్రాంతి (Sankranthi) సందడే నెలకొంది. సంక్రాంతి సంబరాన్ని మరింత రక్తికట్టించేందుకు కోడి పందేల రాయుళ్లు కూడా సిద్ధమవుతున్నారు.

 • Share this:
  ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసినా సంక్రాంతి సందడే నెలకొంది. ఏడాదికి ఒక్కసారి వచ్చే పెద్దపండుగ కోసం ప్రతి ఒక్కరూ ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాలు, వ్యాపారాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు ఇప్పుడిప్పుడే స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే సంక్రాంతి సంబరాన్ని మరింత రక్తికట్టించేందుకు కోడి పందేల రాయుళ్లు సిద్ధమవుతున్నారు. కోర్టు ఆంక్షలు, పోలీసుల దాడులు, కరోనా భయమున్నా పందెం రాయుళ్లు మాత్రం బరులను సిద్ధం చేస్తున్నారు. కోళ్లు కూడా సంక్రాంతి సమరానికి రెడీగా ఉఆన్నాయి. గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వెయ్యి నుంచి రెండువేల బరులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మాదిరిగానే చివరి నిముషంలో పర్మిషన్ వస్తుందని పందెం రాయుళ్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా పందెం పంజులపైనే చర్చ జరుగుతోంది. ఏడాదిగా పుంజులను సిద్ధం చేస్తున్న పెంపకందారాలు వాటిని లక్షల్లో విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో పుంజు ఖరీదు రూ.25వేల నుంచి రూ.లక్షన్నర వరకు ఉంటుంది. ఒక్కో పందెం కోళ్ల ఫామ్ లో 10 నుంచి 50 పుంజుల వరకు అమ్ముడవుతున్నాయి. పందెం పుంజు ఖరీదు అంతుంటుందా అని కొందరు నోరెళ్లబెట్టవచ్చు. కానీ వాటి పెంపకం, తినే తిండి గురించి తెలిస్తే షాక్ అవుతారు.

  Owners providing Healthy diet for roosters which are getting ready for Sankrathi Fight Andhra Pradesh
  పందెం కోళ్లు


  ఖరీదైన ఆహారం
  పందాల కోసం పెంచే పుంజులను ఎంత జాగ్రత్తగా పెంచుతారో అంతే ఖరీదైన ఆహారం కూడా పెడతారు. పందెం కోళ్లు తినే ఆహారం చూస్తే మనకు రాజ భోగమే అనిపిస్తుంది. ఉదయం ఎనిమిది, తొమ్మిది గంటల మధ్య ప్రతి కోడికి రెండు నుండి 15 వరకు నానబెట్టిన బాదం పిక్కలను పెడతారు. దీనితో పాటు ఉడకబెట్టిన గుడ్లను ఆహారంగా అందిస్తారు. ముఖ్యంగా కాళ్ళు బలంగా ఉండటానికి, గుండెలపై కత్తి వేటు పడినా రక్తం వెంటనే రాకుండా ఉండటానికి, శరీరం గట్టిగా తయారు అవడం కోసం ఒక్కో కోడికి 50 గ్రాముల మటన్ కీమా పెడతారు. కీమాతో పాటు జీడిపప్పును కూడా అందిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నానపెట్టిన గంట్లు, చోళ్ళు పెడతారు. ఇలాంటి ఆహారం పెట్టడం వల్ల పందెం కోళ్లలో కొవ్వు శాతం పెరగకుండా బలంగా తయారు అవుతాయి. ఈ ఆహారంతో పాటు కోళ్లు వేగంగా పైకి ఎగరడానికి కొన్ని రకాల డ్రగ్స్ కూడా ఎక్కిస్తారు.

  Sankranthi, Andhra Pradesh, Roosters, Cock Fights, Festivals, సంక్రాంతి పండుగ, ఆంధ్రప్రదేశ్, కోడి పందేలు, కోడి పుంజులు, పండుగలు

  పందెం కోసం స్పెషల్
  ఇలా ఒకటి నుండి రెండేళ్లు పెంచిన పందెం పుంజు 3 నుండి 5 కేజీల బరువు వరకు పెరుగుతుంది. ఇలా సిద్ధం అయిన కోళ్లకు కత్తులు కట్టే కాళ్లకు ఉండే ఒక వేలును ముందుగానే కట్ చేస్తారు. ఇలా కట్ చేసిని వేలును కాటా అంటారు. ఆ వేలు ఉండటం వల్ల కాలికి కత్తి కట్టడం వీలు పడదు. అందుకే పందాలకు నెల రోజుల ముందే ఈ కాటాలను కట్ చేస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ఒక్కో పందెం కోడిని తయారు చేస్తారు...ముఖ్యంగా కోళ్లకు ఎక్కువుగా వ్యాధులు వస్తుంటాయి. సీజనల్ వ్యాధులతో పాటు కోళ్లకు వచ్చే వ్యాధులకు వైద్యులతో ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు వేయిస్తారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా చూస్తారు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుని ట్రైనింగ్ ఇస్తున్న కోళ్లకు ఎంత మంచి ధర వస్తుందో ఒక్కో పందెం కోడికి ఖర్చు కూడా అదే స్థాయిలో అవుతుంది... ఒకటి నుండి మూడు సంవత్సరాలు పెంచే ఒక్కో కోడికి 5వేల నుండి 30వేల వరకు ఖర్చు అవుతుంది.
  Published by:Purna Chandra
  First published: