Home /News /andhra-pradesh /

OVER 3 LAKHS PILGRIMS CAME TO TIRUMALA ON THE EVE OF VAIKUNTA EKADASHI AS TTD APPRECIATES ITS STAFF FULL DETAILS HERE PRN TPT

Tirumala Temple: వైకుంఠ ఏకాదశికి రికార్డుస్థాయిలో శ్రీవారి దర్శనం...

తిరుమల శ్రీవారి రథోత్సవం (ఫైల్)

తిరుమల శ్రీవారి రథోత్సవం (ఫైల్)

వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని (Tirumala Temple) దర్శించుకున్నారు. ఉత్తరద్వార దర్శనానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని టీటీడీ (TTD) సామాన్య భక్తులకు పెద్దపీట వేసింది.

    వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారిని (Tirumala Temple) దర్శించుకున్నారు. ఉత్తరద్వార దర్శనానికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని టీటీడీ (TTD) సామాన్య భక్తులకు పెద్దపీట వేసింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) తో పాటు తెలంగాణ (Telangana), తమిళనాడు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన భక్తులు శ్రీవారిని దర్శించుకొని తరించారు. 10రోజుల పాటు కల్పించిన ఉత్తరద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారని ఈ సందర్భంగా టీటీడీలోని అన్ని విభాగాలు సమర్ధవంతంగా పనిచేసి భక్తులకు సేవలందించాయని పేర్కొంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వరకు 10 రోజుల‌ పాటు కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ 3.79 ల‌క్ష‌ల మంది భక్తుల‌కు స్వామివారి దర్శనం మరియు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించినట్లు టీటీడీ ప్రకటించింది.

    ఎస్సీ, ఎస్టీ, బీసీ, మత్స్యకార ప్రాంతాల నుంచి ఈ పదిరోజుల్లో 6,949 మందికి ఉచితంగా వైకుంఠ ద్వార దర్శనం, రవాణా, వసతి,ఆహారం కల్పించినట్లు టీటీడీ తెలిపింది. అలిపిరి నడక మార్గం నుండి 26,420 మంది, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం-1.66 ల‌క్ష‌ల మంది, సర్వదర్శనం టైం స్లాట్ ద్వారా 83 వేల మంది, శ్రీవాణి ట్రస్టు ద్వారా 15,465 మంది, 7,917 మంది దాత‌లు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం చేసుకున్నట్లు వెల్లడించింది. అలాగే వర్చువల్ సేవ‌లు టికెట్లు అనగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, ఊంజల్‌ సేవ ద్వారా 43,250 మంది స్వామివారి దర్శనం చేసుకున్నారు.

    ఇది చదవండి: ఫ్లైట్ లో తిరుపతికి వెళ్తున్నారా..? అయితే ఈ గుడ్ న్యూస్ మీకే..! శ్రమలేకుండానే శ్రీవారి దర్శనం..


    మొత్తం 15.14 ల‌క్ష‌లు లడ్డూలను టీటీడీ భక్తులకు అందించింది. అలాగే ఈ 10 రోజుల్లో స్వామివారి హుండీ ఆదాయం రూ. 26.61 కోట్లుగా ఉందని టీటీడీ తెలిపింది. వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా 500 మంది శ్రీవారి సేవకులు, 1000 మంది విజిలెన్స్‌ మరియు సెక్యూరిటీ సిబ్బంది భక్తుల‌కు సేవందించారు. తిరుమలోని కౌంటర్లలో 2.05 ల‌క్ష‌ల‌ మంది భక్తుల ల‌గేజిని భద్రపరిచినట్లు టీటీడీ వివరించింది. .69,117 వాహనాల్లో భక్తులు తిరుమల‌కు వచ్చినట్లు వెల్లడించింది.

    ఇది చదవండి: శ్రీవారి ఆలయం గురించి ఈ విశేషాలు తెలుసా..? అడుగడుగునా గోవిందుడి ప్రతిరూపాలే..!


    10 రోజుల‌కు కలిపి 42,809 గదుల‌ను భక్తులకు కేటాయించగా.. వాటిపై రూ.4.68 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపింది. 1.23 ల‌క్ష‌ల మంది భక్తులు తలనీలాలు సమర్పించగా.. 263 మంది మహిళా క్షురకులు, 851 మంది పురుష క్షురకుల‌తో కలిపి మొత్తం 1,114 మంది క్షురకులు 10 కల్యాణకట్టల్లో భక్తుల‌కు ఉచితంగా తల‌నీలాలు తీసినట్లు వివరించింది. ఇక మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కలిపి 4.58 ల‌క్షల‌ భోజనాలు, అల్పాహారం అందించినట్లు వెల్లడించింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala news, Tirumala tirupati devasthanam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు