Home /News /andhra-pradesh /

OUTSIDE SAREE SHOP BUT INSIDE BROTHAL HOUSE GUNTUR POLICE ARRESTED WOMAN FOR ILLEGAL BUSINESS SRD

Andhra Pradesh : బయటికి చీరల బిజినెస్..లోపల చీకటి వ్యాపారం..గుంటూరులో కి"లేడి" లీలలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Andhra Pradesh : విలాసాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలనకున్నారు. కానీ, చివరికి అడ్డంగా బుక్కైయ్యారు. వ్యభిచారం దందాను ఎంత అరికట్టాలని ప్రభుత్వాలు ,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా దేశంలో ఎక్కడ చూసినా సెక్స్ రాకెట్ లు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నాయి .

ఇంకా చదవండి ...
    విలాసాలకు అలవాటు పడ్డారు. సులువుగా డబ్బు సంపాదించాలనకున్నారు. కానీ, చివరికి అడ్డంగా బుక్కైయ్యారు. వ్యభిచారం దందాను ఎంత అరికట్టాలని ప్రభుత్వాలు ,పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నా దేశంలో ఎక్కడ చూసినా సెక్స్ రాకెట్ లు తమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తూనే ఉన్నాయి . అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆన్లైన్ ద్వారా విటులకు ఎర వేస్తున్న వారు కొందరైతే , చిన్న చిన్న వ్యాపారాల ముసుగులో చీకటి దందా కొనసాగిస్తున్న వారు మరికొందరు. అలాంటి ఘటనే గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. చీరల వ్యాపారం ముసుగులో చీకటి వ్యాపారం చేస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్‌ చేశారు. గుంటూరు జిల్లా కేంద్రంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. వ్యభిచార నిర్వాహకురాలితో పాటు, ముగ్గురు మహిళలు, ముగ్గురు విటులను అరెస్ట్‌ చేశారు. గుంటూరు ఏటీ అగ్రహారం జీరో లైనులో నివాసం ఉండే షేక్‌ లాల్‌బీ అలియాస్‌ శ్రీలక్ష్మి, ఇంట్లోనే శ్రీలక్ష్మి మ్యాచింగ్‌ సెంటర్‌ పేరుతో చిన్నపాటి వస్త్ర దుకాణం నడుపుతోంది. పదేళ్ల కిందట ప్రైవేట్‌ ట్రావెల్స్‌లో పనిచేసే శ్రీనివాసరావును వివాహం చేసుకుంది. అప్పటికే విలాసాలకు అలవాటు పడిన శ్రీలక్ష్మి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాచలోనతో మ్యాచింగ్‌ సెంటర్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తోంది.

    ఇదే క్రమంలో షాపునకు వచ్చే వారిని బుట్టలో వేసుకుని మాయ మాటలతో వ్యభిచార రొంపిలోకి దింపినట్లు పోలీసులు గుర్తించారు. చిన్న కుటుంబాలకు చెందిన మహిళలు, భర్తను కోల్పోయినవారు, కుటుంబ పరిస్థితులు సరిగా లేనివారు, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఉంటున్న యువతులను మభ్యపెట్టి వారిని చీకటి కూపంలోకి దింపి వ్యభిచారం చేయిస్తోంది.

    పక్కా సమాచారం అందుకున్న నగరంపాలెం పోలీసులు ఈ నెల 17వ తేదీ రాత్రి ఏటీ అగ్రహారంలోని ఆమె నివాసంపై దాడి చేసి నిర్వాహకురాలు శ్రీలక్ష్మీతో పాటు మరో ముగ్గురు యువతులు, ముగ్గులు విటులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.5 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వీరందరినీ గుంటూరు కోర్టులో హాజరుపర్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Andhra Pradesh, Crime, Guntur, Prostitution

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు