అ.. ఆ.. ఇ.. ఈ.. అమ్మ భాషకు అనంత కోటి వందనాలు..

International Mother Language Day : అ.. ఆ.. ఇ.. ఈ.. అమ్మ ప్రేమకు ప్రతిబింబం ఈ అక్షరాలు. అమ్మ కురిపించే ప్రేమ ఎంత మధురమో.. అమ్మ భాష అందించే ప్రేమ కూడా అంతే మధురం.

news18-telugu
Updated: February 21, 2020, 12:53 PM IST
అ.. ఆ.. ఇ.. ఈ.. అమ్మ భాషకు అనంత కోటి వందనాలు..
తెలుగు వర్ణమాల
  • Share this:
International Mother Language Day : అ.. ఆ.. ఇ.. ఈ.. అమ్మ ప్రేమకు ప్రతిబింబం ఈ అక్షరాలు. అమ్మ కురిపించే ప్రేమ ఎంత మధురమో.. అమ్మ భాష అందించే ప్రేమ కూడా అంతే మధురం. ప్రపంచంతో పోటీపడేందుకు ఎన్ని భాషలు నేర్చినా అమ్మ భాష వినిపిస్తే చాలు, మాట్లాడేవాళ్లు కనిపిస్తే చాలు మనోళ్లు అనే భావన పుడుతుంది మన మదిలో. అందుకే మాతృ భాషను కాపాడుకోవడం ఎంతైనా అవసరం. ఆ అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి ప్రతి ఏటా ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకోవాలని పిలుపునిచ్చింది. బహుభాషాతనాన్ని, భాషా-సాంస్కృతిక భిన్నత్వాన్ని గుర్తించేందుకు, అవగాహన పొందేందుకు ఈ రోజు చాలా ముఖ్యమని ప్రతిపాదించింది.

అందుకే.. మన వరకు వచ్చే సరికి మన మాతృభాష తెలుగు. అందుకే మాతృభాషను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తూ ‘న్యూస్18తెలుగు’ పాఠకుల కోసం తెలుగు వర్ణమాలను మీ ముందుకు తెస్తున్నాం.
తెలుగు వర్ణమాల

అచ్చులు
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఌ ౡ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:


హల్లులు:
క ఖ గ ఘ ఙ చ ఛ జ ఝ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ శ ష స హ ళ క్ష ఱఉభయాక్షరాలు:
ఁ ం ః
తెలుగు అంకెలు:
0 1 2 3 4 5 6 7 8 9
౦ ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯
First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు