TTD: తిరుమల శ్రీవారి సొమ్ముపై కొత్త వివాదం... పాలకమండలి తీర్మానంపై భగ్గుమంటున్న విపక్షాలు

Tirumala News: తిరుమల శ్రీవారి సొమ్మును... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి మళ్లించాలని టీటీడీ పాలక మండలి చేసిన తీర్మానం వివాదాస్పదమైంది. అసలెందుకీ తీర్మానం చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం.

news18-telugu
Updated: October 17, 2020, 2:23 PM IST
TTD: తిరుమల శ్రీవారి సొమ్ముపై కొత్త వివాదం... పాలకమండలి తీర్మానంపై భగ్గుమంటున్న విపక్షాలు
TTD: తిరుమల శ్రీవారి సొమ్ముపై కొత్త వివాదం... పాలకమండలి తీర్మానంపై భగ్గుమంటున్న విపక్షాలు
  • Share this:
Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో... శ్రీవారి సొమ్మును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీల్లోకి మళ్లించాలనే అంశం ఇప్పుడు ఏపీలో కాకరేపుతోంది. టీటీడీ చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి... టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా... శ్రీవారి సొమ్ములను రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అయ్యింది. టీటీడీ అధ్వర్యంలో నడిచే సేవా ట్రస్టులకు చెల్లించే విరాళాలను... ‘వడ్డీ కోసం’ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని టీటీడీ పాలకమండలి తీర్మానించింది. ఆగస్టు 28న జరిగిన బోర్డు సమావేశంలో ఈ తీర్మానం చేసింది. డిసెంబరులో ఇది అమల్లోకి రానుంది. ఐతే... ఏపీ ప్రభుత్వం అప్పుల్లో ఉన్నప్పుడు... సొమ్ములు ఇచ్చి ప్రభుత్వ సెక్యూరిటీలు ఎలా పొందుతారన్న ప్రశ్న ఏపీ రాజకీయాల్లో తలెత్తుతోంది.

ఇప్పటివరకూ టీటీడీ నిధులను షెడ్యూల్డు బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్‌ చేస్తున్నారు. ఎక్కువ వడ్డీ ఇచ్చే జాతీయ బ్యాంకుల్లో దాస్తున్నారు. అలాంటిది టీటీడీ మొదటిసారిగా ‘ప్రభుత్వ సెక్యూరిటీ’లలో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించుకుంది. ‘‘జాతీయ బ్యాంకులేవీ ఎక్కువ వడ్డీ ఇచ్చేందుకు సిద్ధంగా లేవు. ప్రస్తుతం అత్యధికంగా 5.5 శాతం వడ్డీ మాత్రమే వస్తోంది. అదే, కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడిగా పెడితే, గరిష్ఠంగా 7 శాతం వడ్డీ వస్తుంది’’ అని టీటీడీ అకౌంట్స్‌ విభాగం ఓ ప్రకటన సిద్ధం చేసింది. దీనిపై టీటీడీ ఫైనాన్స్‌ కమిటీ ఆగస్టు 13న తీర్మానం చేసింది. ‘‘అధిక వడ్డీ లభించేలా టీటీడీ నిధులను కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టాలి. ఈ ఏడాది డిసెంబరులో భారీ ఎత్తున డిపాజిట్ల కాల పరిమితి ముగుస్తుంది. అక్టోబరు లేదా నవంబరులో జరిగే బోర్డు సమావేశంలో... సొమ్ములను ఎందులో పెట్టుబడి పెట్టాలో నిర్ణయం తీసుకోవాలి’’ అని ఫైనాన్స్ కమిటీ సూచించింది.

టీటీడీ పాలక మండలి తీర్మానం


టీటీడీ పాలక మండలి తీర్మానం


టీటీడీ పాలక మండలి తీర్మానం


పాలక మండలి మాత్రం కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో కాకుండా... రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఆగస్ట్ 28న చేసిన తీర్మానంలో... ‘కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీల్లో లేదా రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో’ అని స్టేట్‌మెంట్‌లో రాశారు. ఇదే వివాదానికి కారణమైంది.

‘‘టీటీడీ అన్నదాన ట్రస్టు, బర్డ్‌ ట్రస్టు, గోసంరక్షణ ట్రస్టు... ఈ మూడు ట్రస్టుల రోజువారీ కార్యకలాపాలు వడ్డీ సొమ్ములతోనే నడుస్తున్నాయి. అందువల్ల, అధిక వడ్డీ కోసం సెక్యూరిటీలలో సొమ్ము డిపాజిట్‌ చేయాలి’’ అని తీర్మానం చేయడంపై దుమారం రేగుతోంది. ప్రభుత్వానికి మేలు చేసేందుకే... టీటీడీ పాలక మండలి పెద్దలు ఈ తరహా తీర్మానం చేశారని విపక్షాలు మండిపడుతున్నాయి. ఈ నిర్ణయంపై ఫైర్ అవుతూ... ప్రతిపక్ష జనసేన నేతలు... తిరుపతిలో ధర్నా చేశారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే... ఎలాంటి పోరాటానికైనా దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీవారి సొమ్ములను వడ్డీ వ్యాపారం కోసం వాడుకోవాలను కోవడం సరైన నిర్ణయం కాదని మండిపడుతున్నారు. దీనిపై వెనక్కి తగ్గకపోతే... హైకోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ నేత కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
Published by: Krishna Kumar N
First published: October 17, 2020, 1:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading