Andhra Pradesh: అప్పుడు లోకేష్.. ఇప్పుడు జ‌గ‌న్...! త‌ల‌లు ప‌ట్టుకుంటున్న వైసీపీ నేత‌లు..!!

గతంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేశ్ స్పీచ్ లలో దొర్లిన తప్పులను ఆసరాగా తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. తాజాగా తమ నాయకుడూ అదే బాటలో వెళ్తున్నాడా..? అని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

news18
Updated: October 22, 2020, 3:12 PM IST
Andhra Pradesh: అప్పుడు లోకేష్.. ఇప్పుడు జ‌గ‌న్...! త‌ల‌లు ప‌ట్టుకుంటున్న వైసీపీ నేత‌లు..!!
నారా లోకేష్, వైఎస్ జగన్(ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: October 22, 2020, 3:12 PM IST
  • Share this:
2019 ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ ను ఏ అస్త్రంతోనైతే టార్గెట్ చేశారో.. ఇప్పుడు అదే అస్త్రం వైసీపీ నేత‌ల‌ను కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. అప్ప‌ట్లో సోష‌ల్ మీడియా ను ఉప‌యోగించుకొని నారా లోకేష్ కు సంబంధించిన ఒక మైన‌స్ ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లిన వైసీపీ, ఇప్పుడు త‌మ పార్టీ అధినేత అదే స‌మ‌స్య‌తో సోష‌ల్ మీడియాలో టార్గెట్ కావ‌డం జీర్ణించుకోలేక‌పోతుంది. గ‌తంలో నారా లోకేశ్ త‌న స్పీచ్ లో త‌ప్పులు మాట్లాడుతూ ఏ స్థాయిలో వైర‌ల్ అయ్యారో ఇప్పుడు ఏపీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహాన్ రెడ్డి ని కూడా సోష‌ల్ మీడియాలో అదే స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే దీనికి కారణం కూడా లేక‌పోలేదు. గ‌త కొద్ది రోజులుగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహాన్ రెడ్డి ఇస్తున్న ప్రసంగాలలో త‌ప్పులు దొర్ల‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కారణం.

జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో.. స్పీచ్ కాపీ చూసి చుదువుతున్న‌ప్ప‌టికి తెలుగు ప‌దాలు స‌రిగ్గా ఉచ్ఛ‌రించ‌లేక‌పోవ‌డం, ప‌దాల‌ను త‌ప్పుగా ప‌ల‌క‌డం ఇప్పుడు ప్ర‌తిప‌క్ష‌పార్టీ సో్ష‌ల్ మీడియా గ్యాంగ్స్ కు వ‌రంగా మారింది. ప్ర‌తిసారి త‌మ అధినేత ఇలా అడ్డంగా బుక్ అవ్వ‌డం పార్టీలో నేత‌లు కూడా జీర్ణించుకోలేక‌పోతున్నారు. దీంతోపాటు పాద‌యాత్ర స‌మ‌యంలో త‌న మాట‌ల‌ను స్ప‌ష్టంగా ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకెళ్లిపోయేలా మాట్లాడిన త‌మ అధినేత‌కు ఇప్పుడేమైంది అని త‌ల‌లు ప‌ట్టుకున్నారు వైసీపీ నేత‌లు.

దీంతోపాటు ఇప్ప‌టికే జ‌గ‌న్ ఇంగ్లీష్ మీడియం నిర్ణ‌యాన్ని తొలుత నుంచి వ్య‌తిరేకిస్తోన్న ప్ర‌తిప‌క్ష‌పార్టీ నాయకులు.. ఇప్పుడు జ‌గ‌న్ తెలుగులో చేస్తోన్న త‌ప్పుల‌ను ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లుతున్నారు. ఇది ముఖ్య‌మంత్రికి తెలుగుపై ఉన్న నిబ‌ద్ద‌త అని ప్ర‌చారం చేస్తోన్నారు తెలుగు త‌ముళ్లు.

తాజాగా.. బుధవారం పోలీసు అమ‌ర‌వీరుల సంస్మ‌ర‌ణ దినోత్స‌వంలో పాల్గోన్న ముఖ్య‌మంత్రి జగన్ మోహన్ రెడ్డి.. త‌న స్పీచ్ దాదాపు 8 సార్లు త‌డ‌బ‌డ్డ‌ారు. ఏకంగా ఏపీ డిజీపీ పేరును కూడా త‌ప్పుగా ఉచ్ఛ‌రించ‌డంతో ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తోన్నారు చంద్ర‌బాబు అండ్ కో. డిజిపీ గౌత‌మ్ స‌వాంగ్ పేరును గౌత‌మ్ స‌వాంగ అని ఉచ్ఛ‌రించ‌డం, సంస్మ‌ర‌ణ దినొత్సవాన్ని స‌రిగ్గా ప‌ల‌క‌లేక‌పోవ‌డం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేస్తోన్నారు.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో లోకేష్ ను ఇదే పాయింట్ తో ఎటాక్ చేసిన జ‌గ‌న్ అండ్ కో.. ఇప్పుడు అదే స‌మ‌స్య‌తో త‌మ అధినేత బాధ‌ప‌డుతుండం చూసి త‌ట్టుకోలేక‌పోతున్నారు. ఎన్నిక‌ల ముందు స్పీచ్ ల్లో అనర్గళంగా.. తడబాటు లేకుండా మాట్లాడిని తమ అధినేతకు ఇప్పుడేమైంద‌ని వాపోతున్నాయి పార్టీ శ్రేణులు. ఈ క్రమంలోనే ఎలాగైనా తెలుగు త‌మ్ముళ్లు చేస్తోన్న ప్ర‌చారాన్ని తిప్పికొట్ట‌డానికి వ్యూహాలు సిద్దం చేస్తున్నారు.
Published by: Srinivas Munigala
First published: October 22, 2020, 3:09 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading