Opinion : గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంపై కీలక సూచనలు

డిసెంబర్ 26న గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయబోతున్నారు. గోదావరి వరద జలాలను రోజుకు కనీసం 4 టీఎంసీల చొప్పున కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాలకు తరలించి మూడు నదుల అనుసంధానం చేపట్టబోతున్నారు.

news18-telugu
Updated: October 23, 2019, 3:51 PM IST
Opinion : గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానంపై కీలక సూచనలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
( టి.లక్ష్మీనారాయణ - రాజకీయ విశ్లేషకుడు)

గోదావరి వరద జలాలను సద్వినియోగం చేసుకుని కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాల దాహార్తిని తీర్చేందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నుదుల అనుసంధాన ప్రక్రియను చేపట్టబోతున్నారు.ఈ మేరకు డిసెంబర్ 26న గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధానానికి శంకుస్థాపన చేయబోతున్నారు.
గోదావరి వరద జలాలను రోజుకు కనీసం 4 టీఎంసీల చొప్పున కృష్ణా, పెన్నా పరీవాహక ప్రాంతాలకు తరలించి మూడు నదుల అనుసంధానం చేపట్టబోతున్నారు. అక్టోబర్ నెలాఖరు నాటికి వ్యాప్కోస్ దీనిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) అందించనుంది. డిసెంబర్ 15 నాటికి టెండర్లు పిలిచి దీనికి సంబంధించిన పనులను కాంట్రాక్టర్లకు అప్పగించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సామాజిక,రాజకీయ విశ్లేషకులు టి. లక్ష్మినారాయణ నదుల అనుసంధానంపై తన అభిప్రాయాన్ని న్యూస్18తో పంచుకున్నారు.

1. ఈ రోజు సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తను చదివాను. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆలోచనలకు ఆ వార్త నిజంగా ప్రతిబింబమైతే మంచిదే.2. గోదావరి-కృష్ణా-పెన్నా నదుల అనుసంధాన పథకాన్ని ఆంధ్రప్రదేశ్ భూభాగంపైనే నిర్మించాలన్న ప్రతిపాదనకు రాష్ట్ర ప్రజల సంపూర్ణ మద్ధతు ఉంటుంది.

3. ఈ ప్రతిపాదిత పథకంపై ఇంజనీరింగ్ నిపుణులతో త్వరిత గతిన సమగ్ర అధ్యయనం చేయించి, ప్రజల ముందుంచి, నిర్మాణాత్మకమైన సూచనలు ఏమైనా వస్తే పరిగణలోకి తీసుకొని, అమలుకు సత్వర చర్యలు చేపట్టాలి.

4. పోలవరం కుడి కాలువకు సమాంతరంగా మరొక కాలువను నిర్మించి, గోదావరి నదీ జలాలను కృష్ణా నదిని పులిచింతల జలాశయానికి దిగువ భాగంలో దాటించి, నాగార్జునసాగర్ కుడి కాలువ ద్వారా గుంటూరు జిల్లాలో నిర్మించ తలపెట్టిన బొల్లాపల్లి రిజర్వాయరుకు చేర్చి, అటుపై సాగర్ కుడి కాలువకు సమాంతరంగా మరొక కాలువను నిర్మించి వెలుగొండ, అటుపై కర్నూలు జిల్లాలో నిర్మించబడి ఉన్న బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దకు నీటిని చేర్చి, రాయలసీమ ప్రాజెక్టులకు, సోమశిల మరియు కండలేరు రిజర్వాయర్లకు గోదావరి నీటిని అందించే విధంగా పథకాన్ని రూపొందించబోతున్నట్లు ఆ వార్త సారాంశం. సమగ్ర అధ్యయనం చేసి, నివేదికను సమర్పించాలని వ్యాప్కోస్ సంస్థకు బాధ్యత అప్పగించినట్లు అందులో పేర్కొన్నారు.5. పోలవరం కుడి కాలువను విస్తరించి గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీ, అటుపై వైకుంఠాపురం వద్ద కృష్ణా నదిపై ఒక బ్యారేజీని నిర్మించి, అక్కడ నుంచి ఎత్తిపోతల ద్వారా నీటిని నాగార్జునసాగర్ కుడి కాలువ, బొల్లాపల్లి రిజర్వాయరుకు చేర్చి, అక్కడ నుండి వెలుగొండ ఆయకట్టు ప్రాంతం మీదుగా సోమశిల, కండలేరు వరకు తరలించే ఆలోచనతో పథకాన్ని రూపొందించామని చెప్పారు. ఆ మేరకు రు.6,000 కోట్లు అంచనా వ్యయంతో ఎత్తిపోతల పథకానికి ఎన్నికలకు ముందు శంకుస్థాపన కూడా చేశారు.

6. పోలవరం కుడి కాలువను విస్తరించడం కంటే సమాంతరంగా మరొక కాలువను నిర్మించి గోదావరి జలాల తరలింపు ప్రయోజనకరంగా ఉండవచ్చన్న చర్చ గతంలో కూడా జరిగింది.

7. అలాగే వీలైతే పోలవరం జలాశయానికి దగ్గరలో పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ, లేదా కృష్ణా జిల్లాలో కానీ 50, 100 టీయంసిల సామర్థ్యంతో ఒక రిజర్వాయరును నిర్మించి, గోదావరి వరద సమయంలో నీటిని నిల్వ చేసుకొని, అటుపై పోలవరం కుడి కాలువకు సమాంతరంగా ఒక కాలువ నిర్మించి నీటిని వినియోగించుకోవచ్చన్న ప్రతిపాదన కూడా ఉన్నది. దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని అధ్యయనం చేస్తే మరింత మెరుగైన పథకం రూపకల్పనకు దోహదపడుతుంది.

ఇది కూడా చదవండి : #Opinion: బ్రహ్మంగారి మఠం రిజర్వాయరుకు కృష్ణా జలాలను ఎందుకు తరలించలేక పోయారు?
First published: October 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>