రిపోర్టర్: ఆనంద్ మోహన్
లొకేషన్: విశాఖపట్టణం
ఏపీలో విద్యుత్ వినియోగదారులకు ఏపీఈర్సీసీ శుభవార్త చెప్పింది. ఈసారి విద్యుత్ చార్జీలను పెంచలేదని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఈఆర్సీ) చైర్మన్ జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి వెల్లడించారు. ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో శనివారం ఏపిఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి సభ్యులు ఠాకుర్ రామ్ సింగ్, ఏ. రాజగోపాల్ రెడ్డిలతో కలిసి విద్యుత్తు చార్జీల ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏపిఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సి.వి. నాగార్జున రెడ్డి మాట్లాడుతూ... ఎలక్ట్రిసిటీ యాక్ట్-2003లోని సెక్షన్ 65 ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపిఈఆర్సీ నిర్ణయించిన మొత్తం ఆదాయ అంతరం మొత్తం రూ. 10,135 కోట్లను డిస్కమ్ లకు సబ్సిడీ రూపంలో ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో.. కేవలం ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ లకు మినహా మిగిలిన ఏ కేటగిరికీ విద్యుత్ చార్జీలను పెంచలేదని స్పష్టం చేశారు. రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు, ఎస్సీ, ఎస్టీ, ఎంబిసి, ఆక్వా రైతులు వంటి వివిధ తరగతుల వినియోగదారులకు ప్రభుత్వం రాయితీ ఇస్తోందన్నారు. అదేవిధంగా గృహ వినియోగదారులకు టారిఫ్‌ను క్రమబద్ధం చేయడానికి వీలుగా ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్ గృహ వినియోగదారులకు సబ్సిడీని ఇచ్చిందని చెప్పారు.
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థలు రూ. 52,590.7 కోట్ల మొత్తంతో ఆదాయ అవసరాల (ఎఆర్ఆర్)ను ఏపిఈఆర్సీకి సమర్పించాయని, అందులో రూ.49,267.36 కోట్ల మొత్తానికి ఏపిఈఆర్సీ ఆమోదం తెలిపిందన్నారు ఏపీఈఆర్సీ ఛైర్మన్. విద్యుత్ అమ్మకాలు, విద్యుత్ కొనుగోలు అవసరాలు, విద్యుత్ కొనుగోలు ఖర్చులు తదితరాలు విద్యుత్ పంపిణీ సంస్థల అంచనాలకంటే తక్కువగా వుండడంతో ఏపిఈఆర్సీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపిఈఆర్సీ మొదటి సారిగా విద్యుత్ కొరత, మిగులును వాస్తవికంగా అంచనా వేసేందుకు వీలుగా టిఓడి వారీగా డిమాండ్, లభ్యతను అంచనా వేసిందని తెలిపారు. సాధారణ పరిస్థితుల ఆధారంగా ఉత్పత్తి, లభ్యతను పరిగణనలోకి తీసుకోవడం వల్ల డిస్కమ్ ల మార్కెట్ కొనుగోళ్ళకు సంబంధించి వాస్తవికత ఉండడం లేదన్నారు. డిస్కమ్‌ల స్వల్పకాలిక విద్యుత్ కొనుగోళ్ళను నియంత్రించడంలో ఏపిఈఆర్సీ 2022 నిబంధన 1ని ఖచ్చితంగా అమలు చేస్తోందని వివరించారు నాగార్జున రెడ్డి.
చేనేత కార్మిక వర్గాలు, పిండి మిల్లుల విద్యుత్ వినియోగదారుల అభ్యర్థనలకు అనుగుణంగా 10 హెచ్ పి వరకు కెవిఏహెచ్ బిల్లింగ్ ను మినహాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే గతంలో యేడాదికి ఒక్కసారే వున్న ఆఫ్-సీజన్ ఎంపికను యేడాదికి రెండు సార్లుగా మార్చడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఎనర్జీ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ లో హెచ్ టి ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ డిమాండ్ చార్జీలను వసూలు చేయడం లేదని, ఇక నుంచి కవిఏకు రూ. 475 చొప్పున చెల్లించాల్సి వుంటుందన్నారు. సోలార్ పంపుసెట్లను వాడుతున్న రైతులకు సోలార్ విద్యుత్తుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే, ప్రభుత్వ విధానం ప్రకారం విద్యుత్ పంపిణీ సంస్థలు వారికి ఉచిత విద్యుత్తును పంపిణీ చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి 25.05.2019 న ఏపిఈఆర్సీ ఆమోదించిన సోలార్ రూఫ్ టాప్ నెట్ మీటరింగ్ మార్గదర్శకాలను డిస్కమ్ లు ఖచ్చితంగా పాటించాలని సూచించారు.
మీరెప్పుడైనా కటోరా తాగారా?..ఈ హెల్త్ బెనిఫిట్స్ తెలిస్తే అస్సలు వదలరు!
విద్యుత్ బిల్లుల్లో వివరాల అలైన్మెంట్, విజిబిలిటీ తదితర అంశాలపై 30 రోజుల్లోగా పూర్తి స్థాయి నివేదికను సమర్పించాల్సిందిగా విద్యుత్ పంపిణీ సంస్థలను ఆదేశించినట్లు తెలియజేశారు. విద్యుత్ ఆదా అంశానికి సంబంధించి గృహ వినియోగదారులకు ఎల్ఇడి ట్యూబ్ లైట్లు, బిఎల్డీసీ సీలింగ్ ఫ్యాన్లు, సూపర్ ఎఫిషియెంట్ ఎయిర్ కండిషనర్లు వంటి ఇంధన సమర్థవంతమైన ఉపకరణాల విక్రయానికి సంబంధించి పైలట్ ప్రాజెక్టును 09.11.2022 నాటి ప్రొసీడింగ్స్ ద్వారా ఏపిఈఆర్సీ ఆమోదించినట్లు తెలిపారు. ఈ అంశాలపై వినియోగదారుల స్పందన ఆధారంగా తదుపరి చర్యలను కమిషన్ నిర్దేశిస్తుందని వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేసేందుకు వీలుగా నిర్దేశాలతో కూడిన ఉత్తర్వులను 23.03.2021న ఏపిఈఆర్సీ జారీ చేసినట్లు తెలిపారు. ఈ అంశాలను వెబ్సైట్లో కూడా పొందుపరచడం జరిగిందన్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా వ్యవసాయ విద్యుత్ సర్వీసులను విడుదల చేయనట్లయితే సంబంధిత అధికారులపై తగిన చర్యలు తీసుకునేందుకు వీలుగా ఈ అంశాన్ని వినియోగదారులు కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని సూచించారు.
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తు సరఫరాకు సంబంధించి విద్యుత్ చట్టం-2003లోని సెక్షన్ 166 (5) ప్రకారం విద్యుత్ సరఫరా నాణ్యత, వినియోగదారులు సంతృప్తిని సమీక్షించేందుకు వీలుగా ఏర్పాటు చేసిన జిల్లా కమిటీల నివేదికలు, మినిట్స్ ను విద్యుత్ పంపిణీ సంస్థలు తమ వెబ్సైట్లో పొందుపరచడంతో పాటు వివరాలను ఏపిఈఆర్సీకి సమర్పించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.

తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: APERC, ELectricity, Local News, Visakhapatnam