Dussehra 2020: బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లాలంటే ఇవి తప్పనిసరి

కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుంచి రావాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తామని తేల్చి చెప్పారు.

news18-telugu
Updated: October 16, 2020, 10:31 PM IST
Dussehra 2020: బెజవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్లాలంటే ఇవి తప్పనిసరి
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవం... (File)
  • Share this:
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది. శనివారం నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొత్తం పది అలంకారాల్లో దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. దసరా రోజున ఎంతమంది భక్తులను అనుమతించాలన్నదానిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. కరోనా వైరస్ కారణంగా భక్తుల సంఖ్య కుదించేందుకు ఆంక్షలను కఠినతరం చేయనున్నారు. నవరాత్రుల సందర్భంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని దుర్గ గుడి పాలకమండలి చైర్మన్ పైలా సోమినాయుడు చెప్పారు. ‘నవరాత్రులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం. దర్శనానికి వచ్చే వాళ్ళు కచ్చితంగా కరోనా నిబంధనలు పాటించాలి. మాస్క్ తప్పని సరి. ఏడాది నుంచి నిర్మాణంలో ఉన్న శివాలయం కూడా పూర్తయింది. రేపటి నుంచి (శనివారం) శివాలయంలో దర్శనాలకు అనుమతి కల్పిస్తున్నాం. దసరాకి 74 వేల టికెట్స్ ఇప్పటికే ఆన్‌లైన్ లో బుక్ అయ్యాయి. ఇంకా కేవలం1500 టికెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిని కూడా భక్తులు వినియోగించుకోవాలి.’ అని స్వామినాయుడు సూచించారు.

ఇక ఈఓ సురేష్ బాబు నవరాత్రుల ఏర్పాట్లపై మాట్లాడారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చే భక్తులు సామాజిక దూరం పాటిస్తూ వినాయక గుడి నుంచి రావాలని స్పష్టం చేశారు. ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఐడీ కార్డు ఉంటేనే అనుమతిస్తామని తేల్చి చెప్పారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూల నక్షత్రం రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు చీరను సమర్పిస్తారు. ఆన్‌లైన్ టికెట్ సమస్యలు ఉన్న వాళ్ళకి పున్నమి ఘాట్, మాడపాటి సత్రం వద్ద టికెట్ కౌంటర్స్ ఉన్నాయి. ఈ సారి సామూహిక పూజలు లేవు. పరోక్ష పూజలు అందుబాటులో ఉంటాయి. ఘాట్ రోడ్ లో ప్రత్యేక జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్టు ఈవో తెలిపారు. వీఐపీలకు ఉదయం 7 నుంచి 9 వరకు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటలు వరకే అనుమతి ఉంటుందని ఈవో సురేష్ బాబు చెప్పారు. వీఐపీలు కూడా ఆన్‌లైన్ లో టికెట్స్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు. టైం స్లాట్ ప్రకారమే రావాలని తేల్చి చెప్పారు.

మరోవైపు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈనెల 17వ తేదీ నుంచి ఈనెల 25వ తేదీ వరకు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సిటీలోకి అనుమతి లేదని సీపీ బత్తిన శ్రీనివాసులు ప్రకటించారు. నగర ప్రజలకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్ళింపులు, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖపట్నం - హైదరాబాద్ మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్ నూజివీడు-మైలవరం-జీ కొండూరు - ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు. విశాఖపట్నం-చెన్నై మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్-అవనిగడ్డ-రేపల్లె-బాపట్ల-చీరాల మీదుగా మళ్లిస్తారు. గుంటూరు -విశాఖపట్నం మధ్య వాహనాలు బుడంపాడు నుంచి పొన్నూరు-రేపల్లె-అవనిగడ్డ-హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు.

విజయవాడ - హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సులు రాకపోకలను పండిట్ నెహ్రూ బస్ స్టాండ్-చల్లపల్లి బంగ్లా-బుడమేరు వంతెన - పైపుల రోడ్-సితార- గొల్లపూడి వై జంక్షన్ ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లించనున్నట్టు సీపీ ప్రకటించారు. విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్య సిటీ బస్సులను ప్రకాశం స్టాట్యూ -లో బ్రిడ్జ్- గద్ద బొమ్మ - కాళేశ్వరరావు మార్కెట్-పంజా సెంటర్-నెహ్రూ చౌక్ చిట్టినగర్- టన్నెల్- సితార- గొల్లపూడి- ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు. ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడి- సితార- సి.వి. ఆర్ ఫ్లై ఓవర్- చిట్టినగర్- నెహ్రూ చాక్- పంజా సెంటర్ - కాళేశ్వరరావు మార్కెట్ లో బ్రిడ్జి-ప్రకాశం స్టాట్యూ - ఏసీఆర్ - సిటీ బస్ స్టాప్ కు అనుమతి ఉంటుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు 20 వతేదీ రాత్రి నుంచి ఉదయం వరకు ప్రకాశం బ్యారేజ్ మీదకు వాహనాలకు అనుమతి ఉండదు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 16, 2020, 9:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading