news18-telugu
Updated: November 17, 2019, 10:56 AM IST
ప్రతీకాత్మక చిత్రం
ఉల్లి ధర రోజురోజుకు పైపైకి ఎగబాకుతోంది. వినియోగదారుల కంట కన్నీరు పెట్టిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దాదాపుగా ఇలాగే ఉంది. ప్రభుత్వం ఉల్లి ధరలు అదుపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా... ధరలు మాత్రం అదుపులోకి రావడం లేదు. కర్నూలు బహిరంగ మార్కెట్లో కిలో ఉల్లి ధర ఉల్లిపాయలు రూ.60 నుంచి రూ.70లకు అమ్ముడవుతుండడంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయల సరఫరా పూర్తిగా తగ్గిపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సాధారణంగా కార్తీక మాసంలో వ్రతాల కారణంగా కూరగాయల వినియోగం భారీగా పెరిగినా, ఉల్లి వినియోగం తక్కువగా ఉంటుంది. కానీ... ఈ సారి ఉల్లి ధరలు కూడా పెరగడం వినియోగదారులకు మరింత భారంగా మారింది.
ఏపీలో పండే ఉల్లి పంటలో 95 శాతం కర్నూలు జిల్లా నుంచే వస్తుంది. ఈ జిల్లాలో దాదాపు 88 వేల ఎకరాల్లో ఉల్లి పంట పండిస్తారు. మిగిలిన ఐదు శాతం ఇతర జిల్లాల్లో అక్కడక్కడా పండిస్తారు. అలాగే మహారాష్ట్రలోని నాసిక్ లోను భారీగా ఉల్లి పండిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లకు ఎక్కువగా సరఫరా అయ్యేది ఈ రెండు రకాల ఉల్లిపాయలే కావడం గమనార్హం.
Published by:
Kishore Akkaladevi
First published:
November 17, 2019, 10:56 AM IST