మళ్లీ రూ.100 చేరిన ఉల్లి ధర... ఆందోళనలో జనం

మళ్లీ రూ.100 చేరిన ఉల్లి ధర... ఆందోళనలో జనం

ప్రతీకాత్మక చిత్రం

రెండు నెలల క్రితం కిలో ఉల్లి ధర రూ.80కి చేరిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో కిలో ఉల్లి ధర రూ.70 నుంచి 80 మధ్య ఉంది.

  • Share this:
    ఉల్లి ధరలు మళ్లీ మండిపోతున్నాయి. కొనకుండానే జనం కళ్ల వెంట కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. దీంతో ఉల్లిని కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నిన్నమొన్నటివరకు కిలో అరవై వరకు ఉన్న ధరలు కాస్త వందకు చేరడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని పలు చోట్ల కిలో ఉల్లి ధర రూ.100గా ఉంది. ఉల్లి ధరలు అమాంతం పెరగడంతో ఢిల్లీలో ఉల్లిపాయలను ప్రభుత్వ ఆధ్వర్యంలో విక్రయిస్తున్నారు.

    ఇక హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.50 -70 మధ్య అమ్ముతున్నారు. గల్లిల్లో కూడా బండిపై వచ్చిన ఉల్లి వందకు రెండు నుంచి రెండున్నర కిలోల అంటూ అమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో కిలో ఉల్లి ధర రూ.70 నుంచి 80 మధ్య ఉంది.  రెండు నెలల క్రితం కిలో ఉల్లి ధర రూ.80కి చేరిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉల్లి సాగు తగ్గిపోయింది. పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడికి కంటతడి పెట్టిస్తున్నాయి.
    First published: