ఘాటెక్కిన ఉల్లి.. సెంచరీ దిశగా పరుగులు..

మహారాష్ట్రతో పాటు ఉల్లిని ఎక్కువగా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణా అంతరాయం ఏర్పడింది.

news18-telugu
Updated: September 23, 2019, 4:30 PM IST
ఘాటెక్కిన ఉల్లి.. సెంచరీ దిశగా పరుగులు..
ఉల్లి రైతు
  • Share this:
ఉల్లి ఘాటెక్కింది. కోస్తే కాదు.. ధర వింటేనే కళ్ల నుంచి నీళ్లొస్తున్నాయి. ఉల్లి ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఢిల్లీలో ఉల్లి ధర రూ.70-80కి చేరి సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. ఇంతకు ముందు ఐదారు కిలోలు ఒకేసారి కొనే వినియోగదారులు.. ప్రస్తుతం కిలో కొనాలన్న ఆలోచిస్తున్నారు. ఇక హైదరాబాద్ మార్కెట్‌లో ఉల్లి ధర రూ.50కి చేరాయి. కొన్ని చోట్ల రూ.60కి కూడా పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముంది. పెరుగుతున్న ఉల్లి ధరలు చూసి సామాన్య ప్రజలు భయపడుతున్నారు.

ఉల్లి ధరలు పెరగడానికి వర్షాలే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు ఉల్లిని ఎక్కువగా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేకపోతున్నారని.. అందుకే ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఉల్లి ఘాటెక్కడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఉల్లి నిల్వ చేసిన ప్రాంతాల నుంచి ప్రాంతాలకు రవాణా చేయాలని కేంద్రం ఆయా రాష్ట్రాలను కోరింది. మరోవైపు పెరిగిన ఉల్లి ధరలతో తెలుగు రాష్ట్రాల్లోని ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా నష్టపోయాయని ఈసారైన మద్దతు ధర లభించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>