రూ.60 కిలో ఉల్లి రూ.25కే.. ఏపీ ప్రభుత్వం బంపరాఫర్

మహారాష్ట్ర నుండి 300ల టన్నుల ఉల్లిని కిలో రూ.30 చొప్పున కొనుగోలుచేశామని, రైతు బజార్లలో 25 రూపాయలకే అందిస్తామని తెలిపారు.

news18-telugu
Updated: September 24, 2019, 10:00 PM IST
రూ.60 కిలో ఉల్లి రూ.25కే.. ఏపీ ప్రభుత్వం బంపరాఫర్
లక్ష రూపాయల ఉల్లిపాయలు చోరీ... (File)
news18-telugu
Updated: September 24, 2019, 10:00 PM IST
మార్కెట్లో ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ జనాలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర సుమారు రూ.50 పలుకుతోంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశముుంది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మండుతున్న ఉల్లి ధరల నుంచి కాస్త ఉపశమనం కలిగించారు. ఏపీ ప్రజలకు రూ.25కే కిలో ఉల్లిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తెలిపారు. మహారాష్ట్ర నుండి 300ల టన్నుల ఉల్లిని కిలో రూ.30 చొప్పున కొనుగోలుచేశామని, రైతు బజార్లలో 25 రూపాయలకే అందిస్తామని తెలిపారు.

ఉల్లి ధరలు పెరగడానికి వర్షాలే కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్రతో పాటు ఉల్లిని ఎక్కువగా సాగుచేసే రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా రవాణా అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వినియోగదారుల డిమాండ్‌కు సరిపడా సరఫరా చేయలేకపోతున్నారని.. అందుకే ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పెరిగిన ఉల్లి ధరలతో తెలుగు రాష్ట్రాల్లోని ఉల్లి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గత రెండేళ్లుగా నష్టపోయాయని ఈసారైన మద్దతు ధర లభించడం సంతోషంగా ఉందని చెబుతున్నారు.
First published: September 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...