Home /News /andhra-pradesh /

ఒంగోలు కుర్రాడి దీక్షకు.. శిఖరాలు సలాం చేస్తున్నాయ్.

ఒంగోలు కుర్రాడి దీక్షకు.. శిఖరాలు సలాం చేస్తున్నాయ్.

పర్వతారోహణలో షేక్ హిమాంసా

పర్వతారోహణలో షేక్ హిమాంసా

ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ హిమాంసా నాలుగు నెలల్లోనే ఎవరెస్టు, కిలిమంజారో, ఎల్ బ్రూస్, మౌంట్ ఆకొంకాగువా పర్వతాలను కూడా అధిరోహించాడు.

    దీక్ష, పట్టుదల, అకుంఠిత కృషితో ప్రయత్నం చేస్తే పేదరికం కూడా అడ్డుకాదని ప్రకాశం జిల్లా వాసి హిమాంసా నిరూపిస్తున్నాడు. కుటుంబం, ప్రభుత్వం ఇచ్చిన ప్రోత్సాహంతో నాలుగు నెలల్లోనే ఎవరెస్టు, కిలిమంజారో, ఎల్ బ్రూస్, మౌంట్ ఆకొంకాగువా పర్వతాలను కూడా అధిరోహించి ముందుకు సాగుతున్నాడు. ఏడు ఖండాలలో ఏడు పర్వత శిఖరాలను అధిరోహించి గిన్నిస్ బుక్ సాధనే తనలక్ష్యమని హిమాంసా న్యూస్ 18కి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శివప్రసాద్ నగర్ కి చెందిన షేక్ హిమాంసా.. చిన్ననాటి నుంచి కరాటే, కిక్ బాక్సింగ్, ఉషూలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ కూడా సాధించాడు. అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొంటూ.. ఆర్మీలో చేరాలని లక్ష్యంగా సాగుతున్న అతనికి పేపర్ లో ఏపీ ప్రభుత్వ యువజన సర్వీసుల శాఖ ఔత్సాహికులకు ఎవరెస్టు అధిరోహించడానికి శిక్షణ ఇస్తుందని తెలిసి దానికి అప్లై చేశాడు. అతనిలోని ప్రతిభను గుర్తించిన శిక్షకులు హింమాసాకు శిక్షణ ఇచ్చారు. ఆరునెలల ఆర్మీ, పర్వతారోహణలో నిపుణలైన శిక్షకుల మార్గదర్శకంలో జమ్మూ- కశ్మీర్, లడక్ లో శిక్షణ పొందారు.

    ఆకొంకాగువా పర్వతంపై హిమాంసా


    తన మొదటి ప్రయత్నంలోనే 25 రోజులు ప్రయాణించి ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నాడు. మరో 15 రోజులలో ఎవరెస్టు శిఖరం నుంచి కిందకి వచ్చారు. ఎవరెస్టు అధిరోహించడం తన జీవితంలో అత్యంత గొప్పవిషయం అని తెలిపాడు. త్వరలోనే ఆస్ట్రేలియాలో మరో పర్వతాన్ని అధిరోహించే ఆలోచనలో హిమాంసా ఉన్నాడు.

    చిన్ననాటి నుంచి ఆర్మీలో చేరాలనే ఆలోచనతో ఎంతో కష్టపడ్డాను. కరాటే, ఉషూలో బ్లాక్ బెల్ట్ సాధించాను. ప్రభుత్వం, గురువు రాజశేఖర్, కుటుంబం, స్నేహితులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే నేను ఇది అంతా సాధించగలిగాను. ఏనాటికైనా ఏడు ఖండాలలో ఏడు అత్యుత్తమ పర్వత శిఖరాలను అధిరోహించి.. గిన్నిస్ బుక్ లే ఎక్కడమే నా లక్ష్యం. ఆ తర్వాత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేస్తా.
    షేక్ హిమాంసా, పర్వతారోహకుడు, ఒంగోలు, ప్రకాశం జిల్లా


    హిమాంసా తల్లిదండ్రులు షేక్ మస్తాన్, షేక్ మస్తాన్ బీ మధ్యతరగతి కుటుంబం. హిమాంసా తల్లి తొమ్మిదేళ్ల క్రితం చనిపోయారు. తండ్రి తాపీ మేస్త్రీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కుటుంబం, స్నేహితులు, స్పాన్సర్స్ అండతోనే తాను ఈ పర్వతారోహణ చేయగలగుతున్నాని హిమాంసా తెలిపారు. ఏ రోజుకైనా... ఏడు ఖండాలలో ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించి గిన్నిస్ బుక్ లోకి ఎక్కడమే తన లక్ష్యమని తెలిపాడు. ఆతని ఆశయం నెరవేరాలని, దేశ కీర్తిని ప్రవంచానికి చాటి చెప్పాలని హిమాంసా తండ్రి మస్తాన్ కోరుకుంటున్నారు.

    నా కుమారుడు పర్వతారోహణ చేస్తానన్నప్పుడు నీకు నచ్చింది చేయమని చెప్పాను. ఏపీ ప్రభుత్వం, ఎంతో మంది తనకి సహాయం చేయడం వల్లనే తాను ఎవరెస్టు అధిరోహించాడు. ఏ నాటికైనా తను అనుకున్నది సాధించాలనే నేను కోరుకుంటా.
    షేక్ మస్తాన్, తండ్రి, ఒంగోలు, ప్రకాశం జిల్లా


    హిమాంసా అధిరోహించిన పర్వతాలు..!
    2018మే 16న ఎవరెస్ట్
    2018 సెప్టెంబర్ 13న మౌంట్ ఎల్ బ్రాస్
    2018 అక్టోబర్ 4న కిలిమంజారో
    2019 జనవరి 24న ఆకొంకాగువా

    (డి.లక్ష్మీనారాయణ, ప్రకాశం జిల్లా కరస్పాండెంట్, న్యూస్‌18)

    First published:

    Tags: Andhra Pradesh, Ongole, Prakasham dist

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు