Home /News /andhra-pradesh /

ONE YOUNG MAN ARRESTED OF POSTING SOCIAL MEDIA POST WARNING TO CM JAGAN JANASENA CLARITY ON THAT POST NGS

Janasena: మానవబాంబుగా మారి సీఎంను చంపుతానంటూ హల్ చల్.. యువకుడి అరెస్ట్ పై జనసేన క్లారిటీ ఇదే

సీఎంను చంపేస్తానంటూ సోషల్ మీడియా పోస్ట్

సీఎంను చంపేస్తానంటూ సోషల్ మీడియా పోస్ట్

Janasena Clarity: చేతిలో స్మార్ట్ ఫోన్.. సోషల్ మీడియా అకౌంట్ ఉండడంతో కొందరు ఇష్టమొచ్చిన ప్రవర్తిస్తున్నారు. చివరికి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఓ యువకుడు.. ముఖ్యమంత్రిని చంపుతానంటూ సమాజాకి మాధ్యమాల్లో పోస్టు పెట్టి హల్ చల్ చేశాడు. అయితే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ పోస్టుపై జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది.

ఇంకా చదవండి ...
    Janasena Clarity on Social Media Post: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)ని చంపుతానంటూ ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. అది కూడా మానవబాంబుగా మారి సీఎంను హతమారుస్తాను అంటూ సోషల్ మీడియా (Social Media) లో పోస్టులు పెట్టాడు. వైసీపీ (YCP) ఫిర్యాదు మేరకు ఆ పోస్టు పెట్టిన యువకుడిని సీఐడీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా (East Godavari district)లలోని రాజమహేంద్రవరానికి చెందిన రాజాపాలెం ఫణిగా ఆ యువకుడ్ని గుర్తించారు. హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఈనెల 16న ట్విటర్‌ (Twitter) లో పెట్టిన పోస్టుపై పోలీసులకు ఫిర్యాదు అందడంతో చర్యలు చేపట్టారు. కన్నా భాయ్‌ అనే అకౌంట్‌ పేరుతో ‘మానవబాంబుగా మారి ముఖ్యమంత్రిని చంపుతానని’ ట్విటర్‌లో పోస్టు చేశాడు.  ఆ వెంటనే ఆ పోస్టు డిలీట్‌ చేయడంతో పాటు ట్విటర్‌ అకౌంట్‌ మూసేశాడు. ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేశాడు. అయినప్పటికీ సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఫణిని అరెస్టు చేశారు పోలీసులు.

    నిందితుడు జనసేన మద్దతు దారుడని చెప్పినట్టు ఎస్పీ రాధిక తెలిపారు. ఇలాంటి పోస్టులు పెట్టే వారిపై చట్టపరంగా చర్యలు ఉంటాయని చెప్పారు. ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెట్టే ముందు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.  పోలీసులు అరెస్ట్ చేసిన ఫణి.. తాను జనసేన సానుభూతి పరుడినని, పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని పోలీసుల విచారణలో అతడు చెప్పడం జనసేన వర్గాల్లో కలకలం రేపింది.



    తాజా వివాదంపై  జనసేన పార్టీ స్పందించింది. సీఎం జగన్‌ను చంపుతానని బెదిరింపులకు పాల్పడిన వ్యక్తితో జనసేనకు ఎలాంటి సంబంధం లేదని పార్టీ తేల్చి చెప్పింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. అలాగే, పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేసింది. సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టే వారిని జనసేన పార్టీ ఎప్పుడూ ప్రోత్సహించదని జనసేన పార్టీ మీడియా విభాగం స్పష్టం చేసింది.



    తాజాగా ముఖ్యమంత్రిని చంపుతానంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసిన వ్యక్తికి, జనసేన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. హింసను ప్రోత్సహించే, అశాంతిని కలిగించే, అసభ్యకర వ్యాఖ్యానాలు ఉండే పోస్టులను పార్టీ ఎప్పుడూ ఖండిస్తుందని జనసేన మరోసారి క్లారిటీ ఇచ్చింది. పార్టీ సానుభూతిపరుడు, పార్టీ అధ్యక్షుల వారి అభిమాని అనే ముసుగులో కొందరు బయటి వ్యక్తులు తప్పుడు పోస్టులు చేస్తున్నారని.. అలాంటి వారి పట్ల జనసేన నేతలు, జనసైనికులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ మీడియా విభాగం సూచించింది.

    ఇదీ చదవండి : బిగ్ బాస్ బ్యూటీలతో శ్రీరామ్ ఎంజాయ్ మెంట్.. తగ్గేదే లే అంటున్న సింగర్

    నిజంగానే జనసేన అభిమానులైనా సోషల్ మీడియాలో హుందాగా వ్యవహరించాలని, వాస్తవిక విశ్లేషణా దృక్పథంతో, ఆలోచనాత్మకంగా, చైతన్యపరిచే విధంగా పోస్టులు ఉండాలని జనసేన పార్టీ కోరుకుంటుందని తేల్చి చెప్పింది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Janasena

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు