ONE YOUNG BOY ADDICTED TO SMART PHONE AFTER THREE MONTHE HE MENTALLY UPSET IN ANANTAPURM DISTRICT NGS
Mobile Phone Games: యువకుడికి స్మార్ట్ ఫోన్ దెయ్యం.. చేతులెత్తేసిన భూత వైద్యులు.. చివరికి ఏమైందంటే
ప్రతీకాత్మక చిత్రం
Mobile Phone Games: పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అంతా స్మార్ట్ ఫోన్ లకు బానిసలుగా మారుతున్నారు. పగలు రాత్రి అని సమయం.. సందర్భంలో చూడకుండా 24 గంటలూ ఫోన్ తోనే సహజీవనం చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు యువత మొబైల్ గేమ్ ల మోజులు పడి లోకాన్ని మరిచిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాల్లో ఓ యువకుడికి వింత అనుభవం ఎదురైంది.
Mobile Phone Games: చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉంటే చాలు ప్రపంచంతో తమకు పని లేదు అన్నట్టు ఉంటున్నారు చాలా మంది. అసలు ఫోన్ లేని జీవితం లేదని ఫీలవుతున్నారు. ఇప్పటికే మొబైల్ ఫోన్ అందరి జీవితంలో ఓ భాగమైపోయింది. చిన్న, పెద్ద.. ధనిక, పేద, ఆడ మగ అని తేడా లేదు. అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు కామన్ అయ్యాయి. ఇప్పుడు చాలా వరకు పనులన్నీ ఫోన్ లోనే జరిగిపోతున్నాయి. స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చిన తరువాత చాలామంది అత్యవసరమైతే తప్ప కాలు తీసి ఇంటి బయట పెట్టడం లేదు. ప్రతి పనికీ మొబైల్ పైనే ఆధారపడుతున్నారు. ఇక కరోనా వైరస్ (Corona Virus) పుణ్యమా అని.. స్మార్ట్ ఫోన్ లు మరింత చేరువ అయ్యాయి. ఆన్ లైన్ క్లాసులు(Online Classes) వచ్చాక పిల్లల్లోనూ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే స్మార్ట్ ఫోన్ ను ఓ లిమిట్ లో వాడితే ఎలాంటి సమస్య లేదు.. పెద్దల పర్యవేక్షణ లేకుండా.. అదే పనిగా పిల్లలు, యువత చేతిలో మొబైల్ ఉంటే.. చాలా నష్టాలు తప్పవు.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా యువతలో అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా అంతా మొబైల్ కు బానిసలు అవుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేదు. తిండి కూడా మాని నిత్యం ఫోన్ తోనే గడుపుతున్నారు. నిద్ర అయినా మానేస్తున్నారు కానీ.. చేతి నుంచి మొబైల్ ను వదలడం లేదు. స్మార్ట్ ఫోన్ కు బానిసలు అయిన వారు.. దాని కోసం తిండి, నిద్ర కూడా మానేస్తున్నారు. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ లలో గేమ్స్ కు అలవాటు పడ్డవారు.. అదే పనిగా పెట్టుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అలా ఆటలకు బానిసలై మతిస్థిమితం కోల్పోయిన వారు.. ప్రాణాలు కోల్పోయిన వారు.. ఆత్మహత్యలు చేసుకున్నవారిని చూస్తూనే ఉన్నాం.. తాజాగా అనంతపురం జిల్లాల్లో ఓ యువకుడికి వింత అనుభవం ఎదురైంది.
పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం బెణకల్లుకు చెందిన 19 ఏళ్ల మహేశ్.. ఇంటర్ మధ్యలో ఆపేశాడు. కూలి పనులకు వెళ్తు ఎంతోకొంత సంపాదించుకుంటూ ఆనందాగానే ఉండేవాడు. సొంతగా డబ్బులు సంపాదిస్తుండంతో అలా వచ్చిన సొమ్ము కొంత దాచి మంచి స్మార్ట్ ఫోన్ ఒకి కొనుక్కున్నాడు. ఆ తరువాత గేమ్స్ ఆడడం మొదలుపెట్టాడు. అయితే ఇటీవ అతడి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. పూర్తిగా మతిస్థిమితం కోల్పోయాడు.. దెయ్యం పట్టిందనే అనుమానంతో చుట్టుపక్కల పేరున్న భూత వైద్యులు అందరికీ చూపించారు కానీ అతి పరిస్థితిలో మార్పు రాలేదు.. ఇక చేసేది లేక ఆస్పత్రికి తీసుకెళ్తే అక్కడ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించిన తరువాత.. అతడు మొబైల్ కు బానిస అవ్వడంలో వల్ల మతిస్థిమితం కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు..
మొబైల్ రాకముందు వరకు మహేష్ బాగనే ఉండేవాడు.. కానీ ఒక్కాసరి ఆ గేమ్స్ కు అలవాటు పడిన తరువాత.. క్రమంగా దానికి బానిసగా మారాడు. అతడు దానికి ఎంతగా అడిక్ట్ అయిపోయాడంటే.. చివరికి సరైన ఆహారం తినలేదు. కంటి నిండా నిద్రపోలేదు. ఇలా మూడు నెలులు గేమ్స్ ఆడుతూనే ఉన్నాడు. ఇది అతడి ఆరోగ్య పరిస్థితిపై తీవ్రమైన ప్రభావమే చూపింది. మహేష్ మతిస్థిమితం కోల్పోయాడు. ఇప్పుడు అతడి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నాడో అతడికే తెలీదు. ఎదుటి వారు ఏం చెబుతున్నారో కూడా తెలుసుకోలేని స్థితికి చేరాడు. కొడుకు దుస్థితి చూసి తల్లిదండ్రులు తల్లిడిల్లుతున్నారు. వెంటనే అతడికి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. మొబైల్ ఫోన్ కి బానిసగా మారడం వల్లే మహేష్ ఇలా అయ్యాడని డాక్టర్ తెలిపారు.
పిల్లలు అడగ్గానే తల్లిదండ్రులు వారికి స్మార్ట్ ఫోన్ కొనివ్వడం గొప్ప సంగతి కాదు. ఫోన్ లో వారు ఏం చేస్తున్నారు? దేనికి వాడుతున్నారు? దాంతో ఎంత సేపు గడుపుతున్నారు? ఇలాంటి వాటిపై కచ్చితంగా తల్లిదండ్రులు నిఘా పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏ మాత్రం అనుమానం వచ్చినా వెంటనే పిల్లలను సరిదిద్దాలన్నారు. పరిస్థితి చేయి దాటకపోక ముందే తల్లిదండ్రులు అలర్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఆ తర్వాత ఎంత చింతించినా ప్రయోజనం లేదన్నారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.