Home /News /andhra-pradesh /

ONE WOMEN IN KURNOOL SUFFER FORM KOREAN DISEASE WHAT THE KOREAN DISEASE SYMPTOMS NGS

Korean Disease: ప్రమేయం లేకుండానే కదులుతున్న కాళ్లూ చేతులు.. ఆహారాన్ని బయటకు నెడుతున్న నాలుక.. కారణం అదే..?

చాలా అరుదైన వ్యాధి

చాలా అరుదైన వ్యాధి

Korean Disease: ఎప్పుడు వినని.. చూడని వింత వింత జబ్బులు తెరపైకి వస్తున్నాయి. అసలే కరోనా మహమ్మారి ప్రజలు పట్టి పీడుస్తుంటే.. ఈ వింత జబ్బులు మధ్య మధ్యలో కొందరని భయపెడుతున్నాయి. తాజాగా ఓ మహిళ.. తన ప్రమేయం లేకుండా కాళ్లు చేతులు కదుపుతోంది.. అలాగే నోట్లో ఏ ఆహారం పెట్టుకున్నా నాలుకే బలవంతంగా బయటకు తోసేస్తోంది. దీంతో ఆమెకు ఉండేది కొరియన్ వ్యాధి గా వైద్యులు తేల్చారు.. ఇంతకీ ఈ కొరియన్ వ్యాధి ఏంటో తెలుసా..?

ఇంకా చదవండి ...
  Woman Has Contracted Korean Disease:  ఆమె పేరు వీరేషమ్మ.. వయసు 32 ఏళ్లు.. కానీ 50 ఏళ్లు పైబడిన మహిళగా కనిపిస్తుంది. అయితె ఆమెకు ఇటీవల వింత వ్యాధి (Rare Disease)  సోకింది.. అది ఏంటంటే.. తన నుంచి ఎలాంటి ప్రమేయం లేకుండానే కాళ్లు, చేతులు కదులుతున్నాయి. నోట్లో అన్నం ముద్దను..లేదా ఇతర ఆహారం పెడితే.. వెంటనే నాలుక దానిని బయటకు తోసేస్తుంది. ఎన్ని సార్లు ప్రయత్నించినా అదే జరుగుతోంది. మొదటిలో ఆమె ఇదంతా చేస్తోంది అని.. కుటుంబ సభ్యులు ఆమెను తిట్టేవారు.. ఆమె కాదని చెప్పినా పెద్దగా వినేవారు కాదు.. కానీ నిత్యం అలాగే జరుగుతుండడంతో ఆమెకు ఏమి జరుగుతుందో ఆమెకే అర్థం కాలేదు. ఆమె చెప్పిన విషయాన్ని నమ్మి.. కుటుంసభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఏమి చేయాలో వారికి తోచలేదు. మొదట దయ్యం పట్టిందేమోనని మంత్రాలు చేయించారు..తాయెత్తులు కట్టించారు. అయినా ఫలితం కనబడలేదు. భూతవైద్యులను సైతం ఆశ్రయించారు. తెలియకుండా కాళ్లు, చేతులు కదులుతుండడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.  సుమారు మూడు లక్షలు ఖర్చు పెట్టారు.. ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఈ ఘటన కర్నూలు జిల్లా (Kurnool District)లో చోటు చేసుకుంది.

  కర్నూలు జిల్లాలో ఓ ప్రాంతంలో వీరేషమ్మ నివాసం ఉంటోంది. విషయం చుట్టు పక్కల వాళ్లకు అందరికీ తెలియడంతో కొందరు వైద్యులను సంప్రదించాలని సూచనలు చేశారు. దీంతో సన్నిహితుల సూచన మేరకు.. కర్నూలుకు చెందిన న్యూరోఫిజీషియన్‌ (Neuro Physician ) డాక్టర్‌ హేమంత్‌కుమార్‌ ను వారు కలిశారు. ఆదోని క్యాంపునకు వెళ్లినప్పుడు ఆమె కుటుంబ సభ్యులు వైద్యుడ్ని కలిసి ఆమె పరిస్థితిని వివరించారు. దీంతో ఆయన ఆమెకు గల పరిస్థితిని అర్థం చేసుకుని వైద్య పరీక్షల కోసం హోల్‌ ఎక్సీమ్‌ సీక్వెన్సింగ్‌ జెనటిక్‌ టెస్ట్‌ను అహ్మదాబాద్‌ (Ahmadabad)కు పంపించారు. నెలరోజుల స్టడీ చేసిన తరువాత.. వైద్యపరీక్షల నివేదిక రెండురోజుల క్రితం డాక్టర్‌కు అందింది. ఆమెకు కొరియా అకాంటో సైటోసిస్‌ అనే అరుదైన ఆరోగ్య సమస్య ఉన్నట్లు గుర్తించారు. యూపీఎస్‌ 13ఎ అనే జీన్‌ మ్యూటేషన్‌ చెందడంతో ఈ వ్యాధి వస్తుందని డాక్టర్‌ నిర్ధారించారు.

  ఇదీ చదవండి వివాదంలో ఉపాసన కొణిదెల .. ఆమె పోస్టు పై నెటిజన్లు ఆగ్రహం.. ఏం జరిగిందంటే

  కొరియన్ అకాంటో సైటోసిస్ అంటే ఏంటి..?
  గతంలో ఎప్పుడూ వినని ఈ వ్యాధి లక్షణాలు నిజంగా చాలా విచిత్రంగా ఉంటాయి.. నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారైతే ఏదో దెయ్యం పట్టిందనే ఫీలయ్యేలా ప్రవర్తన ఉంటుంది. ఇది నరాలపై ప్రభావం చూపడం వల్ల రోగికి తెలియకుండానే కాళ్లూ, చేతులు కదులుతూ ఉంటాయని వైద్యులు అంటున్నారు. ఆహారాన్ని నాలుక తోసేయడం వల్ల సరిగ్గా ఆహారం అందక పోషకాహార లోపం ఏర్పడిందన్నారు. వైద్య పరీక్షల నివేదిక అందిన తర్వాత లక్షణాలను బట్టి ఆమెకు చికిత్స ఇవ్వడం వల్ల సాధారణ స్థితికి వచ్చిందన్నారు. ప్రపంచం మొత్తంగా ఇప్పటి వరకు ఇలాంటి సమస్యతో కేవలం వెయ్యి మంది మాత్రమే ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Kurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు