ONE WOMEN AND TWO MEN IN ONE ROOM AFTER SOME DAYS POLICE ARREST ONE MAN WHAT HAPPENS NGS
live in Relationship: ఒకే ఇంట్లో ఒక రాధ ఇద్దరు కృష్ణులు.. ఇది సినిమా కాదు.. చివరికి ఏం జరిగిదంటే?
ఒకే గదిలో ఇద్దరితో ఒక మహిళ సహజీవనం
live in Relationship: ఒక అమ్మాయిని ఇద్దరు ప్రేమించడం ఈ రోజుల్లా చాలా కామన్ గా మారింది. ఆమె కూడా ఇద్దర్నీ ప్రేమించిన ఘటనలు కూడా చాలానే ఉన్నాయి. అయితే ఒకే అమ్మాయిని ఇద్దరు ఇష్టపడడం.. ముగ్గురు కలిసి సహజీవనం చేయడం గురించి వింటే మాత్రం షాక్ తింటారు.. ఇదేదో సినిమా కథ కాదు.. రియల్ స్టోరీ.
live in Relationship: ఒక రాధ ఇద్దరు కృష్ణులు.. చెప్పడానికి బాగానే ఉన్నా.. రియల్ లైఫ్ లో అంత ఈజీ కాదు. ఒక మహిళ తనతోనే ఉండాలని ఏ పురుషుడైనా కోరుకుంటాడు.. మరో పురుషుడితో ఆమెను పంచుకోడానికి ఇష్టపడడు.. ఒక మహిళ, ఇద్దరు భర్తలు కలిసి జీవించడం అనేది కేవలం సినిమాల్లో మాత్రమే సాధ్యం.. కానీ ఇలాంటి ఘటన నిజ జీవతంలో కూడా జరిగింది. అసలు ప్రస్తుతం ఇలాంటి పోకడులు ఎన్నో అనర్థాలకు దారి తీస్తున్నాయి. కుటుంబ వ్యవస్ధను చిన్నాభిన్న చేస్తూ ఆధునిక పోకడలతో పలువురు సహజీవనం (live in relation) చేస్తున్న ఘటనలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. క్షణికమైన ఆనందాల కోసం బంధం పెంచుకోకుండా టైమ్ పాస్ చేస్తున్నారు స్త్రీలు పురుషులు. ఎలాంటి విబేధాలు.. అనుమానాలు రానంత వరకు ఆ సంబంధాలు సంతోషాన్ని ఇస్తున్నాయి. కానీ కాస్త మనస్పర్థలు వస్తే చాలు అంతా తలకిందులు అయిపోతోంది.. జీవితాలే నాశనం అయిపోతున్నాయి. ఇదంతా తెలిసినా చాలామంది మారడం లేదు.. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు.
తాజాగా గుంటూరు జిల్లా (Gunturu District) తెనాలికి చెందిన గుత్తి విజయ్, ఉష అనే మహిళతో చాలా రోజులుగా సహజీవనం చేస్తున్నారు. వీరి జీవితం సాఫీగానే సాగేది.. ఇదే క్రమంలో కొంతకాలం క్రితం ఉషకు వరి అప్పాజీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కూడా ప్రేమ (Love)గా మారింది. దీంతో ఉష గుత్తి విజయ్ ను ఒప్పించి.. అతడిని కూడా తాము ఉండే గదిలోనే ఉండేలా ఏర్పాటు చేసింది. చాలాకాలంగా వీరు ముగ్గురు కలిసి ఒకే గదిలో జీవిస్తున్నారు. కొంతకాలం పాటు వీరి జీవితం సాఫీగానే సాగిపోతూ వచ్చింది. ముగ్గురూ ఒకే గదిలో ఉన్న వారి మధ్య మనస్పర్దలు ఎప్పుడూ బయట పడలేదు..
అయితే మూడు రోజుల క్రితం కృష్ణాజిల్లా నందిగామలో ఓ హోటల్ లో పని చేసేందుకు ముగ్గురూ కలిసి వచ్చారు. అంత వరకు బాగానే ఉంది. అయితే అప్పాజి రాక ముందు.. ఉష.. గుత్తి విజయ్ తో చాలా చనువుగా.. ప్రాణానికి ప్రాణంగా చూసుకునేది.. అయితే అప్పాజీ వచ్చిన తరువాత ఉష అతడితో ఎక్కువ చనువుగా ఉంటోందని. తనను పెద్దగా పట్టించుకోవడం లేదని గుత్తి విజయ్ ఆవేదనతో రగిలిపోయాడు. అయితే ఈ విషయం బయట పెట్టకుండా మనసులోనే పగను పెంచుకున్నాడు. ఆ పగ రోజు రోజుకూ పెరుగుతు.. అతడిని హత్య చేయాలని నిశ్చయించకున్నాడు. దీంతో వారి వ్యవహారం నచ్చిన విజయ్.. రాత్రి అప్పాజీ నిద్ర పోతున్న సమయంలో త్తితో పీక కోసి హతమార్చాడు. ఆ సమయంలో అడ్డు వచ్చిన ఉషకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.