Lord Shiva: మహిళ కలలోకి వచ్చిన శివుడు.. ఆమె చెప్పిన పని చేసి షాక్ తిన్న గ్రామస్తులు.. ఏం జరిగిదంటే..?

భూమిలో వెలిసిన శివుడు

Lord Shiva Idol Discovered: ఒక్కసారి జరిగే ఘటనలు నమ్మశక్యం కావు.. అలాంటి ఘటన ఒకటి ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఓ మహిళ తన కలలోకి దేవుడు వచ్చాడని చెప్పింది. వెంటనే ఆమె చెప్పిన మాటలతో భూమి తవ్వి చూసిన గ్రామస్తులంతా ఆశ్చర్యానికి గురయ్యారు.

 • Share this:
  Andhra Pradesh: ఒక్కసారి కొన్ని ఘటనలు నిజంగానే షాకిస్తాయి.. అసలు ఇది నిజమా అనే ప్రశ్నలు తలెత్తాలా చేస్తాయి. కొంతమంది దేవుడి మహిమ అంటే.. మరికొందరు అలాంటిదేమీ లేదని వాధిస్తుంటారు.. ఏదీ నిజమో.. ఏది అబద్ధమో తెలియక కొంతమంది అయోమయానికి గురవుతారు. అలాంటి ఆశ్చర్య కలిగించే సంఘటన కృష్ణా జిల్లా (Krishna District)లో చోటు చేసుకుంది. ఓ మహిళ చెప్పిన మాట నమ్మి ఆ పని చేసిన గ్రామస్తులు షాక్ కు గురయ్యారు. తమ కళ్లను తామే నమ్మలేకపోతున్నామంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తన్నారు. కలిదిండి మండలం మూలలంక గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఇటీవల ఓ మహిళకు కలలో కలో దేవుడు కనిపించిన చెప్పిన విషయం.. నిజమైంది. దీంతో ఆమెతో పాటు ఆ గ్రామస్తుల ఆనందానికి హద్దులేకుండాపోయింది. సాక్షాత్తు శివయ్య (Lord Shiva) తమపై) కరుణ చూపించాండని.. తమకు ఇక అంతా మంచే జరుగుతుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవరూపం దాల్చింది. నమ్మశక్యం కాని ఆ వింత ఘటన చుట్టు పక్కల గ్రామాలకు వ్యాపించింది. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు.. ఆ వింత ఘటనను చూసేందుకు మూలలంక గ్రామానికి తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ వింత ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

  మూల లంక గ్రామంలో శివాలయం నిర్మాణం కోసం 30 సంవత్సరాల కిందటే కొంత భూమిని కేటాయించారు. అయితే, అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. అప్పటి నుంచి ఆ భూమి ఖాళీగానే ఉంది. ఇటీవల ఖాళీగా ఉన్న ఆ భూమిలో గ్రామ సచివాలయాన్ని నిర్మించాలని గ్రామస్తులు, అధికారులు తీర్మానం చేశారు. అంతేకాదు.. సచివాలయ నిర్మాణ పనులను త్వరితగతిన పనులు ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆ స్థలం దగ్గరికి వెళ్లి కొలతలు వేసి, ప్లానింగ్, మార్కింగ్ ఇచ్చారు. కానీ, ఇంతలోనే అనుకోని ట్విస్ట్ చోటు చేసుకుంది.

  ఇదీ చదవండి: ఈ మహిళా ఎంపీలను గుర్తు పట్టారా..? సరదాగా ఏం చేశారో చూడండి..

  అదే గ్రామానికి చెందిన మహిళ కొక్కిలిగడ్డ లక్ష్మి( మంగమ్మ).. సదరు భూమికి వద్దకు వచ్చి సచివాలయ నిర్మాణ పనులు ఆపాల్సిందిగా కోరింది. ఎందుకని ప్రశ్నించగా.. షాకింగ్ విషయం చెప్పింది. తనకు కలలో భగవంతుడు కనిపించాడని, ఆ భూమిలో శివలింగం విగ్రహం ఉన్నట్లు చెప్పాడని తెలిపింది. నమ్మకం లేకపోతే.. ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే విషయం మీకే తెలుస్తుందంటూ సదరు మహిళ చెప్పింది.

  ఇదీ చదవండి: ఎగ్ దోశకు తినడానికి డబ్బులు అడిగితే అమ్మ నో అంది.. బీటెక్ విద్యార్థి ఏం చేశాడంటే..?

  మొదట ఆమె మాటలు ఎవరూ నమ్మలేదు. అయితే ఆమె చాలా నమ్మకంగా చెప్పింది. కచ్చితంగా అక్కడ శివలింగం ఉందని.. తవ్వితే మీకతెలుస్తుందని.. లేదంటే సచివాలయ నిర్మాణం చేపట్టొచ్చంటూ ఆమె చెప్పింది. వెంటనే లక్ష్మి చెప్పినట్లుగా అధికారులు, గ్రామ పెద్దల సమక్షంలో సదరు స్థలంలో తవ్వకాలు చేపట్టారు. రెండు అడుగుల లోతు తవ్వగా శివలింగం బయటపడింది. అది చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. వెంటనే విగ్రహానికి పూజలు చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కన గ్రామాల ప్రజలు.. భూమి నుంచి బయటపడిన శివలింగాన్ని దర్శించుకునేందుకు తండోపతండాలుగా తరలిస్తున్నారు. శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published: