హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Extramarital Affair: మొబైల్ ఫోన్ అంత పని చేసిందా..? భర్త చనిపోయిన ఐదు నెలల తరువాత షాకింగ్ ట్విస్ట్

Extramarital Affair: మొబైల్ ఫోన్ అంత పని చేసిందా..? భర్త చనిపోయిన ఐదు నెలల తరువాత షాకింగ్ ట్విస్ట్

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Extramarital Affair: ఓ భర్త పై భార్య మిస్సింగ్ కేసు నమోదు చేసింది. అదే కోణంలో విచారణ చేపట్టిన పోలీసులకు ఐదు నెలల తరువాత భర్త వాడిని ఫోన్ దొరికింది.. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.. దీంతో పోలీసులతో సహా బాధితుడు బంధువులు సైతం షాక్ కు గురయ్యారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vizianagaram, India

  Extramarital Affair: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న హత్యల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇటీవల జరుగుతున్న హత్యల్లో ఎక్కువశాతం.. అక్రమ సంబంధాలే అని తేలుతోంది. అది కూడా కొంతకాలం పాటు భర్తతో హ్యాపీగా సంసారం చేసి.. పిల్లలు ఉన్న మహిళలు సైతం ఇలాంటి దారుణాలు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది. పరాయి వ్యక్తి మోజులో పడి.. పచ్చని కాపురాలను కూల్చుకుంటున్నారు.. నిండు నూరేళ్ల జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అయితే ఇటీవల చాలామంది వివాహితలు.. ప్రియుడు మోజులో (Extramarital Affair) పడి.. భర్తలను హత్య చేస్తున్నఘటనలు కలకలం రేపుతున్నారు. అయితే తరువాత ఏం తెలియనట్టు డ్రామాలు ఆడుతున్నా.. నిజం ఎక్కువ కాలం దాగదు కాబట్టి పోలీసులకు చిక్కుతున్నారు. వారి కారణంగా పిల్లలు అనాథలు అవుతున్నారు. తాజాగా అలాంటి ఘటన విజయనగరం జిల్లా (Vizianagaram District) లో చోటు చేసుకుంది. కానీ ఐదు నెలల వరుతవాత భర్త ముబైల్ ఫోన్ కారణంగా సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.

  స్థానికులు.. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం. విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం గ్రామానికి చెందిన కుంబిర రాజుకు హిరమండలం మేజర్‌ పంచాయతీకి చెందిన సుజాతతో 17 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. ఆ తరువాత చాలాకాలం వీరు సంతోషంగానే ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలున్నారు. వివాహం జరిగినప్పటి నుంచి చిన్నకొల్లివలస గ్రామంలో ఉండేవారు. కానీ ఐదేళ్ల క్రితం పిల్లల చదువుల కోసం బంధువుల దగ్గర విడిచిపెట్టి ఉపాధి కోసం దంపతులిద్దరూ హైదరాబాద్‌ వెళ్లారు.

  కానీ అసలు విషయం ఏంటంటే..? చిన్నకొల్లివలస గ్రామంలో ఉన్నప్పటి నుంచి సుజాతకు.. పాడలి గ్రామానికి చెందిన గురల్లా రాముతో వివాహేతర సంబంధం ఉండేది. తరువాత హైదరాబాద్‌లో ఉన్నప్పటికీ రాముతో తరచూ ఫోన్లో మాట్లాడుతుండేది. ఈ విషయం తెలిసిన భర్త రాజు.. భార్య సుజాతతో తరచూ గొడవ పడుతుండేవాడు. ఇంట్లో నిత్యం జరిగే గొడవలను ప్రియుడుతో ఆమె చెప్పేంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త రాజును ఎలాగైనా అంతమోందించాలని.. వారిద్దరు కలసి ప్లాన్ వేశారు.

  ఇదీ చదవండి : సీఎం జగన్ సంచలన నిర్ణయం.. శాశ్వత అధ్యక్ష పదవిపై సజ్జల క్లారిటీ

  ఆ మధ్య సుజాతను హైదరాబాద్‌లో విడిచిపెట్టి ఏడాది ఏప్రిల్‌ నాలుగో తేదీన రాజు స్వగ్రామానికి వచ్చాడు. వెంటనే ఆ విషయాన్ని తన ప్రియుడు రాముకి చెప్పింది.. రాజును హతమార్చడానికి ఇదే సరైన సమయం అంటూ.. భర్త హత్యకే ప్రియుడ్ని ప్రోత్సహించింది. ఆమె చెప్పినట్టుగానే.. రాజు హత్యకు ప్లాన్ చేశాడు. ఎల్‌ఎన్‌పేట మండలం దనుకువాడ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్‌ కె.నూకరాజు సహాయం తీసుకున్నాడు. ముందు నుంచే రాజు, రాము, నూకరాజు మధ్య పరిచయం ఉంది. దీంతో పార్టీ చేసుకుందామని ఏప్రిల్‌ ఆరో తేదీన రాజుని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఉన్న వంశధార నది గట్టువైపు ఆటోలో తీసుకువెళ్లారు.

  ఇదీ చదవండి : ఆయన ఈయనేనా..? ఈ మార్పుకు కారణం అదేనా..? వైరల్ అవుతున్న ఫోటోలు

  ఆ సమయంలో అతడికి మత్తుగా మద్యం తాగించారు. అలా మత్తులోకి జారుకున్న తరువాత ఆటోను స్టార్ట్‌ చేసేందుకు ఉపయోగించే తాడును మెడకు బిగించి హత్య చేశారు. అయితే మృతదేహాన్ని సమీపంలో ఉన్న తుప్పల్లో పడేశారు. ఈ విషయాన్ని రాము ప్రియురాలు సుజాతకు ఫోన్‌లో చెబితే.. మృతదేహాన్ని అలా వదిలేస్తే దొరికిపోతామని.. కాల్చివేయాలని సుజాత రాముకు సలహా ఇచ్చింది. దీంతో వీరు ఏప్రిల్‌ ఏడో తేదీ రాత్రి మృతదేహాన్ని ఎల్‌ఎన్‌పేట మండలం పెద్దకొల్లివలస పాత గ్రామం వద్దకు తీసుకొని వచ్చి పెట్రోల్‌ పోసి కాల్చేశారు. కొద్దిరోజుల తరువాత అటుగా వెళ్లిన గొర్రెల కాపరులు కాలిపోయి ఉన్న ఎముకలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చా రు. దీంతో సరుబుజ్జిలి పోలీస్‌స్టేషన్‌లో గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు.

  ఇదీ చదవండి : చంద్రబాబు నాయుడుకు లైన్ క్లియర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. రివర్స్ గేమ్ మొదలెడతరా..?

  రాజు కనిపించడం లేదని స్థానికులు.. సుజాతకు చెప్పారు. దీంతో తనపై అనుమానం రాకుండా ఉండేందుకు హుటాహుటిన హైదరాబాద్ నుంచి వచ్చి.. ఏప్రిల్‌ 22 తేదీన తన భర్త కనిపించడం లేదని హిరమండలం పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. అయితే ఆమె తన భర్త వాడిన సెల్‌ఫోన్‌లో సిమ్‌ తీసి ఫోన్‌ను మాత్రం సుజాత ఉపయోగిస్తోంది. సెల్‌ఫోన్లో సిమ్‌ తీసినప్పటికీ ఈఎంఐ నంబర్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా సుజాతనే ఫోన్‌ ఉపయోగిస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.

  ఇదీ చదవండి : ఫ్యాన్సీ నెంబర్ కావాలనుకుంటున్నారా..? 5 వేలు నుంచి మొదలు.. ఆ నెంబర్ మాత్రం 2 లక్షలు

  కాల్‌డేటా ఆధారంగా నిందితులను గుర్తించారు. దీంతో తాము కూడా దొరికిపోతామని భావించిన నిందితులు వీఆర్వో శేషగిరిరావు దగ్గర లొంగిపోగా.. ఆతను స్థానిక పోలీసుస్టేషన్‌లో ముగ్గురినీ అప్పగించారు. ఏ–1గా నూకరాజు, ఏ–2గా రాము, ఏ–3గా సుజాతలపై కేసు నమోదు చేసి.. అరెస్టు చేసి ఆమదాలవలస కోర్టు తరలించినట్టు సీఐ వేణుగోపాల్‌ తెలిపారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Vizianagaram

  ఉత్తమ కథలు