Home /News /andhra-pradesh /

ONE WEEK LOCK DOWN IN SRIKAKULAM DISTRICT IF YOU KNOW REASON WILL SHOCK NGS VZM

Lock Down: ఆ జిల్లాలో వారం రోజులు లాక్ డౌన్.. ఎందుకో తెలుస్తే.. షాక్ అవుతారు..?

ఆ జిల్లాలో వారం రోజులు లాక్ డౌన్

ఆ జిల్లాలో వారం రోజులు లాక్ డౌన్

Lock Down: మొన్నటి వరకు కరోనా కారణంగా కర్ఫ్యూలు, లాక్ డౌన్ లతో పరిస్థితి భయపెట్టింది. ఇప్పుడు కరోనా జీరో అయ్యింది. అన్ని జిల్లాలు కరోనా ఫ్రీ అయ్యాయి. అయినా ఇలాంటి టైంలో ఆ జిల్లాలో వారం రోజుల పాటు లాక్ డౌన్ విధించారు..? ఎందుకో తెలుసా..?

ఇంకా చదవండి ...
    Lock Down:  కరోనా మహమ్మారి (Corona Virus) కారణంగా మొన్నటి వరకు లాక్ డౌన్ లు.. కర్ఫ్యూలతో జనం తీవ్ర ఇబ్బంది పడ్డారు. లాక్ డౌన్ అంటేనే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు ఫ్రీ అయ్యాయి.. జీరో కేసులు ఉన్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా ఓ జిల్లాలో వారం రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించారు..? ఎందుకో? ఎక్కడో తెలుసా..?  శ్రీకాకుళం జిల్లా (Srikulam District) లోని ఓ గిరిజన పల్లెలో వారం రోజుల లాక్‌డౌన్ (Lock Down)  తో ఆ గ్రామానికి  వచ్చే దారులన్నీ మూసేసి ముళ్లకంచెలు, బోర్డులతో క్లోజ్ చేశారు.  ఆ గ్రామంలో ఉన్నవారు బయటకు వెళ్లకుండా, బయటి నుండి ఎవరూ రాకుండా దిగ్భధించారు. ఇంతకీ ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు..

    మా ఊరికి ఎవరూ రాకండి.. మేము ఎక్కడా బయటకు వెళ్లం అని గ్రామ సరిహద్దుల్లో బోర్డులు ఏర్పాటు చేశారు.  ఆ గిరిజన గ్రామంలో అక్కడి ప్రజలే స్వీయ లాక్ డౌన్ ప్రకటించుకుంది. దుష్టశక్తులు ఊరిని చుట్టు ముట్టాయని, నలుగురు ప్రాణాలు ఇప్పటికే పోయాయని, క్షుద్రపూజలు చేయాలని ఒడిషా (Odisha) కు చెందిన భూతవైద్యులు సెలవిచ్చారు..  దీంతో గత నాలుగు రోజులుగా సెల్ఫ్ లాక్ డౌన్ మధ్య క్షుద్రపూజలు జరుగుతున్నాయి. వారం రోజులు ఊళ్లో వాళ్లు బయటకు వెళ్లకుండా, బయటివారు ఊళ్లోకి రాకుండా ముళ్లకంచెలు, బోర్డులు పెట్టి.. చందాలు వసూలు చేసుకొని మరీ పూజలు చేయిస్తున్నారు.  

    దీంతో  ఆ గిరిజన గ్రామంలో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. అధికారులు గ్రామంలోకి వెళ్లి క్షుద్ర పూజలు గురించి ఆరా తీస్తే.. మామూలు పూజలేనని, క్షుద్ర పూజలు కాదని చెప్పడం కొసమెరుపు. అయితే చుట్టు పక్కల గ్రామాల వారు చెప్పిన సమాచారం ప్రకారం.. తమ గ్రామానికి దెయ్యం పట్టిందనే కారణంతో దుష్ట పూజలు చేస్తున్నట్టు చెపుతున్నారు.  

     శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం వెన్నెలవలస ఓ గిరిజన గ్రామం. గత కొన్నిరోజులుగా గ్రామంలో కొందరు వ్యక్తులు  జ్వరంతో బాధపడ్డారు. వారిలో పరిస్థితి విషమించి ఒకరిద్దరు చనిపోయారు. దీన్ని కీడుగా భావించారు గ్రామ ప్రజలు. రోగాల బారిన పడ్డవారికి వైద్యం చేయించడం మానేసిగ్రామానికి దుష్టశక్తులు ఇబ్బంది పెడుతున్నాయని ప్రచారం మొదలు పెట్టారు. ఇలా ఊరుకుంటే అసలు తమ ఉనికికే ప్రమాదం వస్తుందని భావించారు. గ్రామ పెద్దలంతా కలిసి సమావేశం పెట్టుకొని.. పూజలు చేయాలని నిర్ణయానికి వచ్చారు.  దుష్ట శక్తులు తరిమేందుకు మంత్రగాళ్ల కోసం డబ్బులు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంటింటికీ వెళ్లీ చందాలు వసూలు చేశారు. గ్రామస్తుల నుండి చందాలుగా వసూలు చేసిన డబ్బుతో తాంత్రిక పూజల కోసం ఏర్పాట్లు చేసారు. పక్కనే ఉన్న ఒడిసాకు చెందిన మంత్రగాళ్లను సంప్రదించారు. వీరు పడుతున్న టెన్షన్ గుర్తించిన మాంత్రికులు గ్రామంలో భయంకరమైన శక్తులు బస చేశాయని నమ్మబలికారు.  ఊరు బాగుండాలంటే తక్షణమే చెప్పినట్లుగా చేయాలని ఓ భయం మాట పడేశారు. మాంత్రికుల మాటలు విన్న ఊరంతా ఒక్కటై గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తున్నారు.  ఈనెల 17 నుంచి 25వ తేదీ వరకూ గ్రామంలో లాక్ డౌన్ ప్రకటించుకున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Lock down, Srikakulam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు