Home /News /andhra-pradesh /

ONE STRONG COMMUNITY WILL AVOID TO YCP BECAUSE OF RECENT ISSUES LIKE EX CENTRAL MINSTER ASHOK GAJAPATHI RAJU NGS VZM

AP Politics: ఆ వర్గం వైసీపీకి దూరమైందా..? వైసీపీ నేతలే దూరం చేసుకుంటున్నారా..? ఇతర వర్గాలపైనా ప్రభావం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఏపీలో సమాజిక సమీకరణాలు మారుతున్నాయా..? గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన కొన్ని సమాజిక వర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి దూరం అవుతున్నాయా..? ముఖ్యంగా వైసీపీ నేతలే ఆ వర్గాలను దూరం చేసుకుంటున్నాయా..?

  P. Bhanu Prasad, Correspondent, Visakhapatnam, news18    ఆంధ్రప్రదేశ్ లో రెండేళ్ల క్రితం  వైసీపీ విజయం ఒక ప్రభంజనమైంది. ఫ్యాన్ సునామీ ధాటికి ప్రతిపక్షాలు కొట్టుకుపోయాయి. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 23 సీట్లకే పరిమితమైంది. జన సేనకు ఒక సీటు మినహా.. మిగిలిన పార్టీల అడ్రస్ గల్లంతైంది. దాదాపు అన్ని సామాజిక వర్గాలు వైసీపీకి మద్దతుగా నిలవడంతోనే ఈ ఘన విజయం సొంతమైంది. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిస్థితి పూర్తిగా మారినట్టు కనిపిస్తోంది. కొన్ని సామాజిక వర్గాలు నెమ్మదిగా అధికార పార్టీకి దూరమవుతున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ నేతల తీరు కారణంగా ఆయా వర్గాలు మండిపడుతున్నాయి. స్వతహాగా టీడీపీకి ఒక సామాజిక వర్గం బలంగా ఉంటుంది అన్నది అందరికీ తెలిసిందే. వైసీపీకి మరో పార్టీ ముద్ర ఉంది. అయితే గత ఎన్నికల సమయంలో తటస్థంగా ఉండే చాలా కులాలు వైసీపీకి మద్దతుగా నిలిచాయి. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో మిగిలిన కులాలలో కొన్ని ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేలా ఉన్నాయని అంటున్నారు. బ్రాహ్మణులు మొదటి నుంచి ఎందుకో వైసీపీ మీద పెద్దగా మొగ్గు చూపరు అంటారు. వారి బాటలో ఇపుడు క్షత్రియ సామాజిక వర్గం కూడా చేరినట్టే పరిణామాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అశోక్ గజపతి రాజు ఇష్యూ.. తటస్థ వర్గాల పైనా ప్రభావం చూపించే అవకాశం ఉందని పొలిటికల్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

  అసలే రఘురామ రాజు ఎపిసోడ్ ఒకటి ఏపీలో కాక రేపుతోంది. ఈ రెబెల్ ఎంపీకి క్షత్రియులలో ప్రముఖుడిగా పేరు ఉంది. అయితే అతని అతి వైఖరి, వైసీపీ మీద ఆయన వాడిన భాష బాగులేదంటూ కొందరు క్షత్రియ నేతలే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఊహించిన రీతిలో రఘురామ రాజుకు మద్దతు లభించలేదు. అయితే రఘరామపై థర్డ్ డిగ్రీ ఆరోపణల తరువాత మాత్రం కొంతమంది క్షత్రియులు వైసీపీ తీరుపై కాస్త అసహనంతోనే ఉననారు. ఆ వేడి చల్లారకముందే ఇప్పుడు మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ముఖ్యంగా ఈ వ్యవాహారాన్ని వైసీపీ కోరి కెలిక్కుంటోదని క్షత్రియ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. కావాలని అధికార పార్టీ రాజులను దూరం చేసుకుంటోందనే భావన రోజు రోజుకూ పెరుగుతోంది. పూసపాటి రాజుల మీద చేసిన ఘాటు విమర్శలతో క్షత్రియుల మనోభావాలు దెబ్బ తిన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న క్షత్రియులు జగన్ కి విన్నపం పేరిట తమదైన స్టైల్ లో స్ట్రాంగ్ మెసేజ్ నే పంపించారు అంటున్నారు.

  ఇదీ చదవండి: చంద్రబాబు ప్రస్తావన లేకుండానే కొత్త ఫ్రంట్.. కారణం ఎంటో తెలుసా..?

  ఎన్నో దానాలు చేస్తూ సమాజంలో ఉన్నతంగా ఉన్న పూసపాటి కుటుంబం మీద దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన అసభ్య వ్యాఖ్యలను క్షత్రియ పరిషత్ జగన్ దృష్టిలో పెడుతోంది. ముఖ్యంగా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అశోక్ గజపతిని దొంగ అనడం.. కేవలం అక్కడితోనే ఆగకుండా ఆయన కుటుంబాన్ని.. ముఖ్యంగా విజయనగరం రాజులనే అవమానిస్తూ మాట్లాడడం పెను దుమారం రేపుతోంది. విజయసాయి రెడ్డి తాజాగా పూసపాటి రాజుల వంశ చరిత్రపైనే అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాండ్ర పాపారాయుడన్నా, బొబ్బిలి వెలమ రాజులన్నా పౌరుషానికి ప్రతీక అని.. ఫ్రెంచ్, బ్రిటీష్ సేనలను, పొరుగు రాజ్యం కుట్రలను ఎదుర్కొని, వీరోచితంగా పోరాడి ప్రాణాలు అర్పించారని పేర్కొన్నారు. విజయరామ గజపతిలా వారు విదేశీయుల ఎంగిలి మెతుకుల కోసం ఎగబడలేదంటూ అశోక్‌ గజపతి రాజు ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  ఇదీ చదవండి: ఆ కీలక నేతను లోకేష్ పక్కన పెట్టారా? పార్టీ పదవుల్లో త్వరలోనే మార్పులు తప్పవా?

  తాజాగా విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను క్షత్రియ వర్గం సీరీయస్ గా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. అశోక్ మద్దతుగా అందరూ ముందుకు రావాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీలో తమ సామాజిక వర్గం మీద ఈ దాడులేంటి అని వారు నిలదీస్తున్నారు. తాము ఎవరి జోలికీ అసలు పోమని అలాంటిది తమని టార్గెట్ చేయడమేంటని కూడా వారు మండిపడుతున్నారు. కేవలం క్షత్రియులే కాదు.. తాజాగా కాపు సామాజిక వర్గానికి నాయకుడిగా ఉన్న ముద్రగడ పద్మనాభం సైతం రాజులకు కేంద్ర పెద్దలు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో తెలుపుతూ ఓ ఫోటోను జగన్ కు పంపారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు.

  ఇదీ చదవండి: వంశ చరిత్రను తిరగతోడిన ఎంపీ.. అశోక్ గజపతి రాజుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు

  ప్రస్తుతం వైసీపీకి విజయనగరం కంచుకోటగా ఉంది. టీడీపీ అడ్రస్ గల్లంతైంది. కానీ ప్రస్తుతం విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే విజయనగరం వాసులు ఎంపీ విజయసాయి వ్యాఖ్యలపై బహిరంగంగానే మండిపడుతున్నారు. ఒకచోటు నలుగురు ఐదుగురు గుమిగూడితే అదే విషయం మాట్లాడుకుంటున్నారు. క్లీన్ చిట్ తో ఉండే వ్యక్తిపై ఇలాంటి వ్యాఖ్యలు మంచివి కాదని హితవు పలుకుతున్నారు. అంతెందుకు విజయనగరానికి చెందిన వైసీపీ నేతలే అశోక్ గురించి మాట్లాడడం లేదు. వారు కూడా ఎంపీ విజయసాయి వ్యాఖ్యలపై లోలోన మదనపడుతున్నట్టు తెలుస్తోంది.

  ఇదీ చదవండి: పయ్యావుల సైలెన్స్ కు కారణం ఏంటి? ఆ నిర్ణయం తీసేసుకున్నారా? ముహూర్తం ఫిక్స్ అయ్యిందా..?

  ఏది ఏమైనా రఘురామతో మొదలైన వివాదం కాస్తా అశోక్ దాకా వెళ్ళింది. అశోక్ మీద కూడా రఘురామ మీద వాడిన భాషనే వైసీపీ పెద్దలు వాడడమే ఇక్కడ చిక్కులు తెచ్చిపెడుతోంది. పెద్ద మనిషిగా ఉన్న అశోక్ విషయంలో నోరు జారితే జాగ్రత్త అన్నట్లుగానే ఇపుడు క్షత్రియ పరిషత్ నుంచి గట్టి సందేశం వచ్చింది అంటున్నారు. గోదావరి జిల్లాలలో ప్రభావం చూపగలిగిన బలమైన సామాజిక వర్గం ఇలా బాహాటంగా వైసీపీ మీద కత్తులు దూస్తోంది అంటే ఆ పార్టీ ఓటు బ్యాంక్ కి చిల్లు పడినట్లే అంటున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Raghu Rama Krishnam Raju, Vijayasai reddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు