Frustration: సాధరణంగా ఎన్నికలు అన్న తరువాత గెలుపు ఓటములు ఖాయం.. ఓడినా గెలిచినా అభ్యర్థులు చాలా హుందాగా ఉండాలి.. ఓడితే మరో అవకాశం కోసం ఎదురు చూస్తూ ప్రజా సేవలోనే ఉండాలి. గెలిచిన వారు చేసిన తప్పులను ఎత్తి చూపాలి.. ఓడిపోయిన చోటే వెత్తుకొని.. సానుభూతితో మరోసారి గెలిచే ప్రయత్నం చేయాలి.. కానీ ఓ సర్పంచ్ అభ్యర్థి మాత్రం తనను ఓడించిన గ్రామస్థులపై కక్ష తీర్చుకోవడానికి ఏం చేశాడో తెలుసా..?
President Candidate Frustration: ఎన్నిక ఏదైనా గెలుపు, ఓటమి అన్నది సహజం.. గెలిచిన అభ్యర్థి సంబరాలు చేసుకుంటాడు.. ఓడిన అభ్యర్థి రాజకీయలకు దూరం కావాలి.. లేదా మళ్లీ గెలవాలి అనుకుంటే.. ప్రజల్లోనే ఉంటే.. గెలిచిన వారి తప్పులను నిలదీయాలి.. ప్రజల కోసం పని చేస్తున్న అభ్యర్థి ఓడాడు అనే సానుభూతి పొందాలి. సాధారణంగా ఎక్కడైనా జరిగేది ఇదే.. రాజకీయాల్లోకి ఎవరు వచ్చినా పోయిన చోటే వెత్తుకునే పని చేస్తారు.. లేదా అక్కడ గెలిచే అవకాశం లేదని స్పష్టత వస్తే.. ప్రత్యామ్నాయాలపై ఫోకస్ చేస్తారు.. కానీ ఓ సర్పంచ్ అభ్యర్థి (Sarpanch Candidate) మాత్రం అందుకు భిన్నం.. సాధరణంగా ఎన్నికలు అంటే.. అభ్యర్థులు పలు హామీలు ఇస్తుంటారు. అందులో రోడ్డు వేయిస్తామని.. బస్సు సౌకర్యం కల్పిస్తామని.. ప్రజలకు పలు మంచి పనులు చేస్తామని.. ఇలా హామీలు ఇస్తారు.. గెలిచిన అభ్యర్థుల్లో కొందరు మాత్రమే వారు ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటారు.. అయితే ఓడిన అభ్యర్థులు ఈ సారి మిస్ అయ్యింది.. మరోసారి గెలిపిస్తే అది చేసి చూపిస్తాను అంటూ నమ్మకం కల్పిస్తారు. కానీ ఓ సర్పంచ్ అభ్యర్థి మాత్రం ఎవరూ ఊహించని పని చేశాడు..
తనను పంచాయతీ ఎన్నికల్లో ఓడించారని ఆ గ్రామస్థులపై అప్పటి నుంచి పగ పట్టాడు.. ఆ పగ చల్లార్చుకునే పనిలో ప్రజలపై కక్ష తీర్చుకున్నాడు. ఓడించారన్న కోపంతో గ్రామానికి చెందిన రహదారి లేకుండా చేశాడు.. అసలే పలు గ్రామాలకు సరైన రోడ్లు లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. ఈ సర్పంచ్ అభ్యర్థి మాత్రం.. సవ్యంగా ఉన్న రహదారిపై గోతులు తవ్వాడు... తనను ఓడించిన గ్రామ ప్రజలకు రవాణ సదుపాయం లేకుండా చేశాడు.. అక్కడితోనే ఆగలేదు.. మళ్లీ ఆ గోతులు ఎవ్వరూ పూడ్చకూడదనే కోపంతో.. అక్కడ అడ్డుగా పెద్ద పెద్ద బండరాళ్లను ఉంచి ఇబ్బందులకు గురి చేశాడు.
ఈ దారుణ ఘటన ఎక్కడ జరిగింది అంటే..? ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (Andhra-Odisha Boarder)ప్రాంతమైన గజపతి జిల్లాలోని గంగాబడొ పంచాయతీకి చెందిన బరిక్ సొబరొ బిజూ జనతా దళ్ పార్టీ మద్దతుతో సర్పంచి పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన అదే గ్రామానికి చెందిన హరిబందు గెలిచారు. బరిక్ సొబరొ ఆగ్రహంతో గంగాబడొ రహదారి తవ్వేసి, బండరాళ్లు అడ్డగా ఉంచాడు. దీంతో సమీపంలోని ఐదు గ్రామాల ప్రజలకు రాకపోకలు స్తంభించాయి. ఈ విషయమై హరిబందు గారబంద పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐఐసీ సర్వేశ్వర సామంత్రాయ్, తహసీల్దారు లీలావతి ఆచార్య ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.