Home /News /andhra-pradesh /

ONE PREGNANT LADY WALKING MORE THEN 65 KILOMETERS TIRUPATI FROM NELLORE THEN ON DELIVERED NGS

Pregnant Lady: భర్త మాటలు.. చేష్టలతో విసిగిపోయింది.. 65కీ.మీ.. కాలి నడకన బయలుదేరిన నిండు గర్భిణీ. ఏం జరిగిందంటే?

Ambulance

Ambulance

Pregnant Lady: నిండు గర్భిణి.. ఆ సమయంలో భార్యలను భర్తలు ఎంతో అపూరూపంగా చూసుకుంటారు.. కానీ ఆ భర్త తీరుతో ఆ గర్భిణి పూర్తిగా విసిగిపోయింది. ఇక భర్తతో కాదని.. తన దారి తానే వెతుక్కుంటూ నడుచుకుంటూ అలా బయలుదేరింది నిండు గర్భిణి.. అలా 65 కిలోమీటర్లు కాలి నడకన బయలుదేరింది. చివరకు ఏమైంది అంటే..?

ఇంకా చదవండి ...
  Pregnant Lady: భార్య, భర్తలు (Wife and Husband) అన్యోన్యగంగా ఉంటేనే ఆ సంసారం సాఫీగా సాగిపోతుంది. కనీసం ఇద్దరిలో ఎవరో ఒకరికి సర్దుకుపోయే తత్వం ఉన్నా.. సంసార బండి నడుస్తుంది. అందులో ముఖ్యంగా భార్య గర్భవతి (Pregnant WIfe) అయితే.. భర్తల బాధ్యత ఇంకా పెరుగుతుంది. బిడ్డ పుట్టేంత వరకు.. బాధ్యతగా చూసుకుంటారు భర్తలు.. అయితే ఇక్కడ మాత్రం.. ఆమె నిండి గర్భిణి అని తెలిసినా.. భర్త తీరు మారలేదు. ఆయన తీరు మార్చుకోమని చెప్పినా వినలేదు. దీంతో విసిగిపోయి, తన దారి తానే వెతుక్కుంటూ వెళ్లిన ఒక నిండు గర్భిణీ, సుమారు 65 కిలో మీటర్లు కాలినడకన అలా వెళ్లింది. చివరకు రోడ్డుపైనే ప్రసవించింది. ఈ అమానుష ఘటన.. నెల్లూరు జిల్లా (Nellore District) నాయుడుపేట పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వర్షిణి (Varshini) అనే మహిళ భర్తతో కలిసి తిరుపతి (Tirupati)లో నివసిస్తుంటుంది.9 భర్త ప్రతిరోజు గొడవ పెట్టుకుంటున్నాడని, అతని తీరుతో విసిగిపోయి తిరుపతి నుంచి ఒంటరిగా బయలుదేరింది.. సుమారు మే 12న.. నిండు గర్భిణీ అయిన వర్షిణి, ఎక్కడికి వెళ్లాలో తెలియక కాలినడకన ఒంటరిగా నడుచుకుంటూనే..వెళ్ళిపోసాగింది. అలా అక్కడక్కడా మార్గమధ్యలో ఆగి ఆగి 65 కిలోమీటర్లు నడుచుకుంటూ చివరకు నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చేరుకుంది వర్షిణి. చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. అంతే కాదు ఇక్క అయినవారు ఎవరూ కూడా లేరని తెలిసింది..

  శుక్రవారం సాయంత్రానికి నాయుడుపేట ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరకు చేరుకున్న వర్షిణికి పురిటి నొప్పులు ప్రారంభం అయ్యాయి. దారిన పోతున్నవారిని సాయం అడిగినా ఎవరూ.. ఆమె బాధ పట్టించుకోలేదంట..? చివరకు ఒక యువకుడు వర్షిణి దగ్గరకు వచ్చి.. పూర్తి వివరాలు తెలుసుకుని.. 108 వాహనానికి సమాచారం ఇచ్చాడు. సమయానికి స్పందించిన 108 సిబ్బంది.. హుటాహుటిన వర్షిణి దగ్గరకు చేరుకుని ఆమెకు వైద్య సహాయం అందించారు. అప్పటికే పురిటిలో బిడ్డ బయటకు వస్తున్నట్లు వర్షిణి చెప్పడంతో..అప్రమత్తమైన 108 సిబ్బంది కిరణ్ కుమార్, చిరంజీవి..ఆమెకు అంబులెన్సులోనే ప్రసవం చేశారు.

  ఇదీ చదవండి : నాన్ వెజ్ ప్రియులకు సండే షాక్.. ఆల్ టైం రికార్డుతో భయపెడుతున్న కిలో ధర? ఎంతంటే?  అయితే అంతకు రెండు రోజులుగా ఆమె ఏమీ తినలేదని తెలుస్తోంది. కనీసం ఒక ముద్ద కూడా ముట్టని వర్షిణి పరిస్థితి చూసి చలించిపోయిన 108 సిబ్బంది, వెంటనే ఆమెకు పాలు, బ్రెడ్ అందించారు. కట్టుబట్టలతో ఇంటి నుంచి వచ్చిన వర్షిణికి తమ ఇంటిలో నుంచి దుస్తులు తెప్పించి ఇచ్చారు. పుట్టిన ఆడబిడ్డ బరువు తక్కువగా ఉండడంతో.. ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. రెండు రోజులుగా ఆహారం లేక వర్షిణి కూడా బాగా నీరసంగా ఉంది. దీంతో తల్లిబిడ్డను నెల్లూరు ఆసుపత్రికి తరలించారు 108 సిబ్బంది.

  ఇదీ చదవండి : : అక్కడ జంబలకడి పండ.. ఇది సినిమా కాదు నిజం.. కావాలంటే చూడండి ఏం జరుగుతోందో..?

  ఆసుపత్రిలో వివరాల నమోదు సమయంలో తన పేరు కొత్తూరు వర్షిణి అని, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి కూలి పని కోసం భర్తతో కలిసి తిరుపతి వచ్చినట్లు ఆమె వివరించింది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది దిశ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వర్షిణి నుంచి పూర్తి వివరాలు సేకరించి, భర్తకు కౌన్సెలింగ్ నిర్వహించి అతని దగ్గరకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆ శాడిస్ట్ భర్త మనసు పోలీసుల కౌన్సిలింగ్ తరువాత అయినా మారుతుందో లేదో చూడాలి.. భార్య విషయంలో ఆయన కఠినంగా ఉన్నా.. బిడ్డ మోహం చూసైనా మారాలి అని అంతా కోరుకుంటున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Nellore Dist

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు