ఏపీ రేషన్ కార్డుతో తెలంగాణలోనూ సరుకులు...నేటి నుంచే ప్రారంభం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రారంభమై వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం త్వరలనే అన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలు కానుంది.

 • Share this:
  తెలుగు రాష్ట్రాల్లోని సామాన్య ప్రజలకు శుభవార్త. ఏపీ, తెలంగాణలోని రేషన్ కార్డు వినియోగదారులు రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్ సరులుకు తీసుకోవచ్చు. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు కార్యక్రమం తెలంగాణలో ఇవాళ్టి నుంచే ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. రాష్ట్రంలో ఈ విధానాన్ని కేంద్రం కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ ఢిల్లీలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. హైదరాబాద్‌లో ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పౌరసరఫరాలశాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు.

  రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ‘వన్‌ నేషన్‌ - వన్‌ రేషన్‌’ కార్డు విధానం ఇవాళ్టి నుంచే అమలు చేస్తున్నాం. నేషనల్‌ పోర్టబులిటీ తెలంగాణ - ఏపీ క్లస్టర్‌ ద్వారా ఇరురాష్ట్రాల్లో ఈ సేవలు అందుతాయి. ఇకపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకోవచ్చు.
  అకున్ సబర్వాల్
  వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రప్రదేశ్ వాసులకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుంది. బతుకు దెరువు కోసం నగరానికి వచ్చిన మధ్యతరగతి ప్రజలు సొంత రాష్ట్రం ఏపీలో రేషన్ సరుకులకు దూరమవుతున్నారు. ఇక్కడే పనులు చేసుకొని బతకడంతో అక్కడ రేషన్ తీసుకోలేని పరిస్థితి. ఇకపై వారంతా ఏపీ రేషన్ కార్డుతో హైదరాబాద్‌లోనే సరుకులు తీసుకోవచ్చు. తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రారంభమై వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం త్వరలనే అన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలు కానుంది.
  First published: