ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సును (RTC Bus Accident) ఓ లారీ ఢీకొట్టింది. అదుపుతప్పిన బస్సు ముందున్న ఓ ఆటోను ఢీకొట్టి.. పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. అనకాపల్లి జిల్లా ఎత్రాయిపల్లి మండలం ధర్మవరం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. అనకాపల్లికి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. పాయకరావుపేటకు వెళ్తుండగా... ధర్మవరం వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందుకు ఆగింది.
వెనకాలే వస్తున్న లారీ డ్రైవర్.. దానిని గమనించకుండా.. నేరుగా ముందుకు తీసుకెళ్లి.. ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొట్టింది. అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు... . ముందు ఉన్న మరో ఆటోను ఢీకొట్టి.. అనంతరం పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి.. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆటోల్లో నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
విశాఖలోని ఇసుకతోటకు చెందిన పరసయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో.. మెరుగైన వైద్య చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Road accident, Visakhapatnam