news18-telugu
Updated: January 1, 2020, 12:07 PM IST
(ప్రతీకాత్మక చిత్రం)
తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కొత్త సంవత్సరం పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఉదయం నుంచే వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్టుమెంట్లూ నిండిపోయాయి. స్వామి వారి దర్శనానికి 16 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు కోరారు. అలాగే దివ్య దర్శనం, ప్రత్యేక దర్శనం, టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన వారి దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న మంగళవారం నాడు స్వామిని 88,262 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,706 మంది తలనీలాలను సమర్పించారు. హుండీ ద్వారా రూ. 3.50 కోట్ల ఆదాయం లభించింది. ఇదిలా ఉంటే నూతన సంవత్సరం వేడుకను పురస్కరించుకొని ప్రతీ భక్తుడికి ఒక లడ్డూను ఉచితంగా ఇవ్వనున్నారు.
Published by:
Krishna Adithya
First published:
January 1, 2020, 12:07 PM IST