Different Names: పిల్లలకు పేర్లు (Children's names) పెట్టాలి అంటే తల్లి దండ్రులు (Parents) తీవ్ర కసరత్తు చేస్తారు.. బిడ్డ కడుపులో పడింది అని తెలిసినప్పటి నుంచే దాని గురించి ఆలోచిస్తారు. తమ ప్రేమకు కానుకగా.. కలకలం గుర్తిండిపోయేలా మంచి పేరు పెట్టాలి అనుకుంటారు.. కొందారు జాతకాలు (Astrology) చూసి మరి పేర్లు పెడతారు. ఇంకొందరు వారు పుట్టిన తేదీ (Birth date), నక్షత్రం (Birth star) బట్టి నక్షత్ర నామాలు పెడతారు. మరికొందరు న్యూమరాలజీ (numerology)ని ఆశ్రయిస్తారు. మరోవైపు ట్రెండింగ్ లో ఏ పేర్లు ఉన్నాయో చూసుకుంటారు.. అలాగే సినిమా హీరోలు, హీరోయిన్ల పేర్లను పెట్టుకుంటున్నారు. ఇంకొందరైతే రాజకీయ నేతల పేర్లు పెట్టుకుంటారు. ఇలా పిల్లల పేర్లు విషయంలో ఒక్కొక్కక్కరూ ఓక్కో పద్ధతిని ఫాలో అవుతారు. గతంలో అయితే మగపిల్లలకు విష్ణు సహస్ర నామాల నుంచి ఆడపిల్లలకు అయితే లలితా సహస్ర నామాలనుంచి పేర్లను పెట్టేవారు. అయితే కాలం మారింది కాలంతో పాటు మనిషి ఆలోచనలు మారాయి. దీంతో ట్రేండింగ్ లో ఏ పేర్లు ఉంటె అవే ఫిక్స్ చేస్తున్నారు. మహేష్ (Mahesh) అనో.. పవన్ (Pawan) అనో లేక ట్రెండింగ్ లో ఉన్న పేర్లు పెడతారు..
కానీ ఈ తండ్రి మాత్రం డిఫరెంట్ గా ఆలోచించాడు. తన పిల్లల పేర్లను చైనా రెడ్డి (China Reddy), జపాన్ రెడ్డి (Japan Reddy), ఇటలీ రెడ్డి (Italy Reddy), రష్యా రెడ్డి (Russia Reddy)అంటూ వింత పేర్లు పెట్టాడు. ఇంతకీ ఇలాంటి పేర్లు ఎందుకు పెట్టాడో తెలుసా..? ప్రస్తుతం ఆ పిల్ల పరిస్థితి ఏంటి..? అందరూ అలాగే పిలుస్తున్నారా..? పిల్లలు ఇబ్బంది పడుతున్నారా..? ఈ పేర్లన్నీ ఆంధ్రప్రదేశ్ , చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వారివి. ప్రపంచంలో అత్యంత అసాధారణమైన ఈ పేర్లు వెనుకున్న అసలు కథేంటో తెలుసుకుందాం.
చిత్తూరు జిల్లా, జీడీ నెల్లూరు మండలం, మాంబేడు గ్రామానికి చెందిన ఓ రైతు తన ఐదు మంది పిల్లలకు అభివృద్ధి చెందిన దేశాల పేర్లు పెట్టి మురిసిపోతున్నాడు. గంగాధర నెల్లూరు మండలం, మాంబేడు గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఇంటర్ వరకు చదువుకున్నాడు. అదే గ్రామానికి చెందిన ధనలక్ష్మిని వివాహం చేసుకున్నిడు. హిస్టరీ సబ్జెక్ట్ ను అమితంగా ప్రేమించేవాడు చంద్రశేఖర్ రెడ్డి.. తనకున్న కాస్తంత భూమిలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చంద్రశేఖర్ రెడ్డి, ధనలక్ష్మి దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు సంతానం. తన పిల్లల పేర్లు విభిన్నంగా ఉండాలని మొదటి అమ్మాయి పేరు చైనా రెడ్డిగా నామకరణం చేశాడు. తర్వాత మగ పిల్లవాడికి రైనా రెడ్డి గా, మూడవ అమ్మాయికి ఇటలీ రెడ్డి, నాలుగోవ కుమారైకు రష్యా రెడ్డి, చివరి కుమారుడుకు జపాన్ రెడ్డి అని పేర్లు పెట్టాడు. ఈ వింత పేర్లు ద్వారా నలుగురిలో గుర్తింపుతో పాటు ఆ దేశాల చరిత్ర తెలుసుకోవాలనే తపన ఉంటుందని అంటున్నాడు చంద్రశేఖర్ రెడ్డి. అతడు ఆశించినట్టే ఇప్పుడు ఆ పిల్లల పేర్లే వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి.. అయితే కొంతమంది మాత్రం వారి పేర్లతో సెటైర్లు వేసి ఆటపట్టిస్తున్నారు కూడా..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chitoor, Father, Logic names