Daughter Temple: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఇటీవల తమ మధ్య లేని వారిని విగ్రహాలు పెట్టించడం.. గుడి కట్టించడం లాంటివి ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే చాలా చోట్ల భర్త విగ్రహం (Husband Statue) తయారు చేయించిన భార్య.. అమ్మ లేదా నాన్నలకు గుడి కట్టించిన పిల్లలను చాలా మందిని చూసే ఉంటాం.. తాజాగా ఓ తండ్రి కూమార్తెకు గుడి (Fatehr Build a temple for Daughter) కట్టాడు.. సాధారణంగా ఏ తండ్రికి అయితే కూతురు అంటే చెప్పలేని ప్రేమ ఉంటుంది. కేవలం కూతురు అనే కాదు.. కన్న బిడ్డలపై ఏ తల్లిదండ్రులకు అయినా చెప్పలేనంత మమకారం ఉంటుంది. కొందరు తమ ప్రేమను బయటకు చాటుకుంటారు.. కొందరు అయితే తమ ప్రేమను మనసులోనే దాచిపెట్టుకుంటారు. అయితే చాలామందికి ప్రేమ ఉన్నా రూపాంలో తెలియచేయాలో తెలియదు.. అయితే తమ ముందు ఉన్నప్పుడు ప్రేమను చూపించలేని వారు.. తరువాత వారు దూరమైతే.. గుళ్లు కట్టించడం.. లేదా విగ్రహాలు పెట్టించడం లాంటివి చేసి.. ఆ ప్రేమను పదిలంగా ఉంచుకుంటారు. తాజాగా ఓ తండ్రి చేసిన పని వైరల్ అవుతోంది..
ఓ తండ్రి మాత్రం తన ప్రేమను ఎవరికీ సాధ్యం కాని రీతిలో చాటుకున్నాడు. నెల్లూరు జిల్లాలోని కాకుటూరు గ్రామంలో ఉన్న తండ్రి.. తన కూమార్తెపై ప్రేమను మరిచిపోలేకపోతున్నాడు. కూతురు తన కళ్లు ముందు లేకుంటే తట్టుకోలేకపోయాడు. ఆమె గుర్తులను కళ్లముందే ఉంచుకోవాలని భావించారు. దీంతో తన కుమార్తె జ్ఞాపకంగా ఆలయం కట్టించాడు. కేవలం గుడి కట్టించి ఊరుకోవడం మాత్రమే కాదు.. నిత్యం అందులో పూజలు చేస్తూ కనిపిస్తున్నాడు.
గుడి ఎందుకు కట్టించాడు అంటే..?
నెల్లూరు జిల్లాలోని కాకుటూరు గ్రామానికి చెందిన చెంచయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు సంతానం ఉన్నారు. నాలుగో కుమార్తె సుబ్బలక్ష్మమ్మ డిగ్రీ పూర్తి చేసింది. చదువు అయ్యాక ఫారెస్ట్ డిపార్టుమెంట్లో ఉద్యోగంలో చేరింది. దీంతో తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు. కానీ ఈ సంతోషం కొన్నాళ్లకే విషాదంగా మారింది. 2011లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుబ్బలక్ష్మమ్మ ప్రాణాలు కోల్పోయింది.
అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ.. అందులోనూ ఆమెకు కూడా తల్లిదండ్రులు అంటే ప్రాణం.. వారి మాట జవదాటుదు.. తల్లిదండ్రులు అనుమతి లేనిది ఏమీ చేయదు.. అంతటి అనుబంధం ఉన్న.. తన కుమార్తె మరణాన్ని తండ్రి జీర్ణించుకోలేకపోయాడు. దీంతో గ్రామంలో ఆమె జ్ఞాపకార్థం గుడి కట్టించాడు. ఆలయం కట్టించడంతో వాళ్ల ఇంటికి చాలా మంది వస్తుంటారు. చెంచయ్య ఇల్లు ఓ పుణ్యక్షేత్రంగా కనిపిస్తూ ఉంటుంది. గ్రామంలోని ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాసులు కూడా చెంచయ్య కుమార్తె ఆలయాన్ని సందర్శిస్తారు. ఆమె వర్ధంతి సందర్భంగా ప్రార్థనలు కూడా చేస్తారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Hindu Temples, Nellore Dist