ONE DOCTOR ABUSING A MINOR GIRL WHO COMING TO TREATMENT FOR THEY GIRL COMPLAINT TO POLICE NGS VSP
Doctor: ఛీఛీ ఇయనేం డాక్టర్.. కూతురులాంటి మైనర్ తో ఈ వయసులో ఇవేం చేష్టలు..
ఛీ ఛీ వీడేం డాక్టర్
Doctor: వైద్యుడిని ప్రత్యక్ష దేవుడిగా భావిస్తారు కొందరు. ప్రాణాపాయ స్థితిలో ప్రాణాలు పోసేది అతడే.. ఆరోగ్య సమస్యలతో సతమతం అవుతున్న వారిని ఆదుకునేది డాక్టరే.. అందుకే మీరు దేవుడు బాబు అని డాక్టర్లకు రోగి బంధువులు గౌరవం ఇస్తూ ఉంటారు. అలాంటి గౌరవప్రథమైన వైద్యం చేస్తూ.. కూతురు వయసు ఉన్న మైనర్ పై వెకిలి వేషాలు వేశాడు ఆ వైద్యుడు... ఈ వయసులో ఇదేం పాడు బుద్ధి..
Doctor: ఈ రోజుల్లో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతోంది.. ఆఖరికి మైనర్లను కూడా వదలి పెట్టడం లేదు కామాంధులు. గుడిలో బడిలో.. ఆఖరికి ఆస్పత్రుల్లోనూ (Hospitals) వదలడం లేదు. చిన్నారి అని కరుణ చూపించడం లేదు.. వక్ర బుద్ధితో వెకిలి వేషాలు వేసే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇటీవల ఆస్ప్రత్రుల్లోనూ దారుణాలు పెరుగుతున్నాయి. ప్రాణాలు కాపాడుకోడానికో.. లేదా రోగాలను తగ్గించుకోడానికే.. జ్వరం నయో అవుతుందో అనే ఆశతో ఆస్పత్రులకు వస్తే.. అక్కడ మహిళ.. వారు మైనర్ అయినా.. మేజరైనా వారికి రక్షణ లేకుండా పోతోంది. దేవుడు లాంటి వారే వెకిలి చేష్టలతో చిన్నారులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా విశాఖపట్నం (Visakhapatnam)లో ఓ దారుణం వెలుగులుకో వచ్చింది. ఆ వైద్యుడి వేషాలు చూస్తే ఇదేం బుద్ధిరా అని తింట్ల దండకం అందుకోవాల్సి ఉంటుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ వైద్యుడు.. మైనర్ బాలిక.. అందులోనూ అనారోగ్యంతో ఇబ్బంది పడుతోంది అని తెలిసి కూడా కీచకుడిగా మారాడు..
ఈ అమానుష ఘటన విశాఖలో వెలుగు చూసింది. ఉక్కు ఉద్యోగుల జనరల్ ఆసుపత్రిలో వైద్యుడు బాధ్యతలు నిర్వహిస్తున్న కామాంధుడు అంత్యంత నీచంగా ప్రవర్తించాడు. తన వంకరబుద్ధిని బయటపెట్టాడు. ఆస్పత్రికి వైద్యం కోసం వచ్చిన ఓ మైనర్ బాలికపై చీఫ్ డాక్టర్ కపాడియా (Chief doctor Kapdia) అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో భయంతో సదరు బాలిక ఆస్పత్రి బయటకు వచ్చి 100 నంబర్‌కు కాల్ చేసింది. తనపై వెకిలి చేష్టలకు పాల్పడ్డ డాక్టర్‌పై తల్లిదండ్రుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.
ఇదే సమయంలో తాజాగా విశాఖ కేజీహెచ్ గైనిక్ వార్డులో సిబ్బంది నిలువు దోపిడీకి పాల్పడుతున్నా పాప పుడితే రెండు వేల రూపాయలు, బాబు పుడితే మూడు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక్కో బెడ్‌పై ఇద్దరు చొప్పున పెషేంట్లను ఉంచుతున్నారని.. అదే సింగిల్ బెడ్ కావాలంటే వెయ్యి నుంచి మూడు వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇక డబ్బులిస్తేనే బిడ్డను ఇస్తామంటున్నారని తల్లులు వాపోతున్నారు. కొందరు చేసేదేం లేక తప్పని పరిస్థితుల్లో డబ్బులు సమర్పించుకుంటున్నారని.. డబ్బు లేని వాళ్లు మాత్రం అవస్థలకు గురవుతున్నారని ప్రజలు కన్నీటి పర్యంతం అవుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.