GVMC Expenses: గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తోంది. అధికార పార్టీ తీరుపై పలు సందర్భాల్లో విమర్శలు వెల్లువెత్తాయి.. ఇంకా విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాటా మరో ఘటన అందికీ షాక్ ఇస్తోంది. సాధారణంగా 100 మంది సభ్యులు ఉంటే కార్యాలయంలో ఒక్కరోజు కాఫీ, టీ లేదా.. భోజనాల ఖర్చు ఏదైనా.. మహా అయితే లక్ష అయినా ఎక్కువే అనిపిస్తుంది. కానీ అలాంటింది. ఒక్క రోజు టీ, కాఫీ లాంటి ఫలహారాల కోసం నాలుగు లక్షల రూపాయల బిల్లు అయ్యింది.. వినడానికి నమ్మ సంఖ్యంగా లేదా.. కానీ ఇది నిజం.. జీవీఎంసీస్ లో బిల్లు పెట్టడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
మహా విశాఖ నగర పాలక సంస్థ పాలకవర్గ సమావేశానికి హాజరైన సభ్యులు, అధికారులు, మీడియా ఇతర ప్రతినిధులకు టీ, టిఫిన్, భోజనం కోసమే 4,12,000 వెచ్చించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మొన్న కౌన్సిల్ సమావేశానికి టీ, టిఫిన్, భోజనం సరఫరా చేసేందుకు టెండర్లు ఆహ్వానించగా, జీవీఎంసీ కార్యాలయానికి సమీపంలో గల ఓ ప్రముఖ హోటల్ ఆ అవకాశం దక్కించుకుంది.
ఇదీ చదవండి: బాబోయ్ ఇదేం బుద్ధి.. భార్య స్థానంలో వచ్చిన భర్త.. విషయం తెలిసి షాక్ తిన్న అధికారులు
ముందు అనుకున్న షెడ్యూల్ ప్రకారం.. జీవీఎంసీ లో ఉదయం అల్పాహారంతోపాటు మధ్యలో రెండుసార్లు టీ/కాఫీ, రెండు బిస్కెట్లు అందించారు. మధ్యాహ్నం భోజనం (శాకాహారం, మాంసాహారం) పెట్టారు. సమావేశానికి కార్పొరేటర్లు, వారి సహాయకులు, అధికారులు, మీడియా ప్రతినిధులు కలిపి సుమారు 400 మంది వరకూ హాజరై ఉంటారుని లెక్కలేస్తున్నారు.
ఇదీ చదవండి: ఇకపై తల్లుల అకౌంట్ లో ఆ నగదు పడదు.. సర్కార్ కు మరో ఎదురుదెబ్బ
ఈ లెక్కన కౌన్సిల్ రోజున టీ, స్నాక్స్, భోజనానికి కలిపి.. ఒక్కో వ్యక్తిపైనా వేయి రూపాయలకు పైగానే ఖర్చు అయ్యింది. ఇంత భారీ మొత్తంలో వెచ్చించడం పట్ల ప్రతిపక్ష కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అసలు జీవీఎంసీ ఆర్థిక పరిస్థితి ఏమాతం బాగుండ లేదని, ఇటువంటి సమయంలో డబ్బులు దుబారా చేయడం సరికాదని అంటున్నారు
ఇదీ చదవండి: వైసీపీ పాలనపై RRR మూవీ సాంగ్ తో పేరడీ.. వైరల్ గా మారిన ట్వీట్
అసలే జీవీఎంసీ దగ్గర నిధులు లేక ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి సమమంలో దుబారాను తగ్గించుకోవాల్సి ఉంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది అని.. ఇలా ప్రతిదానికి దుబారా చేసుకుని వెళ్తే ఎలా అని టీడీపీ కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. జీవీఎంసీ కొత్ పాలక వర్గం కొవులు తీరిన దగ్గర నుంచి ఇలానే ప్రతి విషయంలో అనవసర ఖర్చులు పెంచేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి..
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam