Viral Video: బాబోయ్ అత్తపై ఇంత ప్రేమా.? 60 ఏళ్ల అత్తకు కోడలు పంపిన గిఫ్ట్ కు నెటిజన్లు ఫిదా

అత్తపై కోడలి ప్రేమ

అత్త అంటే అంతెత్తున లేస్తుంది కోడలు.. ఇక కోడలి మాట వినిపిస్తే అత్త కేకలు పెట్టడం కామన్.. ఇది చాలా చోట్ల కనిపించేదే.. కానీ ఓ కోడలు మాత్రం తాను అందుకు భిన్న అంటూ.. తన అత్తగారిపై ప్రమేను చూపించింది. ఆమె చూపించిన ప్రేమకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.. ఇంతకీ ఏం చేసిందో తెలుసా..?

  • Share this:
    అత్తలేని కోడలు ఉత్తమురాలు అని సామెత ఉంది.. అసలు అత్తాకోడళ్లు అంటేనే జగడాలకు మారుపేరుగా చెబుతారు.. ఎక్కడో కాని అత్తా కోడళ్లు అంటే పోట్లాడుకునే వారే ఎక్కువ.. ఇక టివీ సీరియల్స్ లో ఒకటి రెండు మినహా అన్ని సీరియల్స్ లో అత్తా కోడళ్ల వార్ తోనే హైలైట్ అవుతూ ఉంటాయి. చాలా కుటుంబాల్లో ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుంటూ నిత్యం ఘర్షణ వాతావరణాన్ని సృష్టించే స్థాయికి చేరింది. అత్తాకోడళ్ల మధ్య ప్రేమ అనురాగాలు ఉన్నాయనే మాట చాలా తక్కువగా వింటుంటాం. అత్తాకోడళ్లు అనుబంధం బాగుంటే ఆ ఇల్లు ఆనందంగా కళకళలాడుతుంది. కోడలిని కూతురిగా, అత్తను కూడా తల్లిగా భావించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. కానీ అలాంటి వారు ఈ రోజుల్లో ఎందరు అంటే సమాధానం లేని ప్రశ్నే అని చెప్పాలి.. పెళ్లైన కొన్ని రోజులకే అత్తల నుంచి కొడుకులను దూరం చేసే కోడళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. కానీ తాము మాత్రం అందుకు భిన్నం అంటున్నారు ఓ అత్తా కోడలు.. ముఖ్యంగా ఓ కోడలు చేసిన పని ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

    అత్తగారిపై కోడలు చూపించిన ప్రేమను చూసి అంతా షాక్ అవుతున్నారు.. అత్తగారంటే ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇంత పని చేస్తారా అంటూ నోరు వెళ్లబెడుతున్నారు. ఇది ఎక్కడో జరిగిన ఘటన కూడా కాదు.. ఆంధ్రప్రదేశ్ లోనూ జరిగిన ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ కుటుంబంలో అత్తగారి పుట్టిన రోజుకు కోడలు ప్రత్యేక వంటకాలను తయారు చేసింది. వంటకాలను ప్లాస్టిటిక్ డబ్బాల్లో నింపి వాటిపై పేర్లు రాసి పెట్టింది.

    వంటలు చేయడం కూడా స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా.. అత్తకు 60 ఏళ్లు కావడంతో ఆ కోడలు.. 60 రకాల వెరైటీ వంటలను చేసి అత్తగారికి కానుకుగా ఇచ్చింది. 60 రకాల వెరైటీల అని షాక్ అవ్వకండి అది నిజమే.. పులిహోర మొదలు, కొబ్బరి రైస్, మ్యాగీ నూడిల్స్, పెరుగు ఇడ్లీ, వంకాయ బజ్జీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. తనపై ఉన్న కోడలి ప్రేమను ఇలా రకరకాల వంటకాలు చేసి చూపించడంతో అత్త ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. ఇక కోడలి వంటకాల వీడియోకు ప్రస్తుతం నెటిజన్లు ఫిదా అవుతున్నారు. http://




    ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఓ అల్లుడికి మామ పెట్టిన ఆషాడం సారె వైరల్ అవ్వగా.. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్తాకోడళ్ళ బంధం వైరల్ అవుతోంది. ఇక అత్తలైతే మాకూ అలాంటి వంటకాలుచేసే కోడలు ఉంటే బాగుండేదని, చూస్తుంటేనే నోరూరిపోతుందని కామెంట్‌ చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: