Home /News /andhra-pradesh /

ONE BANNER VIRAL ON DAMEGED ROAD IN WEST GODAVARI DISTRICT BE AWARE OF JAGAN NGS

YS Jagan: సీఎం పై సెటైర్.. జగనన్న ఉన్నాడు జాగ్రత్త.. పరుగులు పెట్టించిన బ్యానర్

జగనన్న ఉన్నాడు జాగ్రత్త

జగనన్న ఉన్నాడు జాగ్రత్త

YS Jagan:ఒక్క ఛాన్స్ అంటూ ప్రచారం నిర్వహించిన వైసీపీ అధినేత జగన్ కు జనం బ్రహ్మరథం పట్టారు. ఏపీ రాజకీయ చరిత్రలో ఎవరూ ఊహించని విధంగా 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. కానీ జగన్ సీఎం అయిన తరువాత కాస్త వ్యతిరేకత మెళ్ల మెళ్లిగా పెరుగుతోంతి. ఒక్క ఛాన్స్ ఇస్తే అవకాశం ఇస్తే.. ఇప్పుడు ఏడిపిస్తున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీలో వెలిసిన ఓ బ్యానర్ వైరల్ అయ్యింది.

ఇంకా చదవండి ...
  YS Jagan Banner:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వంపై రోజు రోజుకూ వ్యతిరేకత పెరుగుతోంది. ముఖ్యంగా సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  (CM YS Jagan Mohan Reddy ) పై అభిమానంతో ఓటేసిన వాళ్లే తరువాత నిరసనలు తెలిపిన ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం.. ఓటు వేసి తప్పు చేశాం.. మా చెప్పుతో కొట్టుకుంటున్నామని పలు వీడియోలు ఆ మధ్య వైరల్ గా మారాయి. పాద యాత్ర సందర్సంలో నేను ఉన్నాను.. నేను విన్నాను అపన్నారు.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ ప్రజలను ఓట్లు అడిగారు. జగన్ ఇచ్చిన హామీలు.. చెప్పిన మాటలను నమ్మిన ప్రజలు ఊహించని విజయం అందించారు.. ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా 151 సీట్లు ఇచ్చి గెలిపించారు. దీంతో జగన్ పదేళ్ల నిరీక్షణ ఫలించింది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటేసి గెలిపించిన ఓటర్లు కొందరు ఇప్పుడు పశ్చాత్తప పడుతున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చారు మమ్మల్ని ఏడిపిస్తున్నారు అంటూ పలువురు మీడియా ముందుకు వచ్చి ఆవేదిన తెలిపిన సంఘటనలు ఈ మధ్య చాలానే చూశం.. అయితే అవన్నీ ప్రత్యర్థి పార్టీల రాజకీయ ఎత్తుగడ అని అధికార పార్టీ నేతలు అంటున్నారు. టీడీపీ అభిమానులే ఇలా జగన్ ఇమేజ్ న దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఆరోపించారు.

  తాజాగా ఓ బ్యానర్ వైరల్ గా మారింది. ప్రస్తుతం అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రంలో కొంత కాలంగా రోడ్ల దుస్థితి పైన పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత రోడ్ల మరమ్మత్తులు చేపట్టలేదనే విమర్శలు ఉన్నాయి. రెండున్నారేళ్లుగా ఎక్కడా తట్టెడు మట్టి పోసిన దాఖలాలు కూడా లేవని విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. కొందరు సమాజికి కార్యకర్తలు, కమ్యూనిస్టులు సైతం వింత వింత నిరసనలు చేపట్టారు. అయితే ప్రభుత్వలో ఎలాంటి చలనం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన సైతం కొద్ది నెలల క్రితం సేవ్ ఏపీ రోడ్స్ పేరుతో డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది.

  ఇదీ చదవండి : వైసీపీ పాలనపై RRR మూవీ సాంగ్ తో పేరడీ.. వైరల్ గా మారిన ట్వీట్

  ఆ తరువాత పవన్ కళ్యాణ్ రాజమండ్రి.. అనంతపురంలో శ్రమదానం చేసి నిరసన వ్యక్తం చేసారు. ప్రభుత్వం తీరుపై ఇలా అన్ని పార్టీలు నిరసన తెలుపుతున్నాయి. తాజాగా తూర్పు గోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు చాలా వరకు అధ్వానంగా మారాయి. ఎక్కడ రోడ్డుందో.. ఎక్కడ గుంత ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. నిత్యం ఆ రోడ్ల పైన ప్రయాణించే వారిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీంతో.. జిల్లాలోని ఓ రోడ్డుపై పెట్టిన బోర్డు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

  ఇదీ చదవండి :తుపాకులు పట్టుకు తిరగాలా..? 4 రోజుల రాజకీయ నేత పవన్ కు కేంద్రాన్ని నిలదీసే దమ్ముందా..?

  'జగన్ అన్న ఉన్నాడు జాగ్రత్త.. రోడ్డు వేసే వరకు ఎవరైనా ఈ బోర్డును తొలగిస్తే వారి కుటుంబం ఈ రోడ్డుపైనే పోతుంది' అనేలా జగన్ ఫొటోలతో ఫ్లెక్సీ చేయించి బోర్డు పెట్టారు. ఈ ఫొటోలను జనసేన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేసి ఏపీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నారు.

  ఇదీ చదవండి :మా ఊరికి ఎవరూ రావొద్దు.. బోర్డు ఎందుకు పెట్టారో తెలుస్తే షాక్ అవుతారు

  ఇటీవల ముఖ్యమంత్రి నిర్వహించిన ఒక ఉన్నత స్థాయి సమీక్షలో రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులను ప్రారంభించాలని.. ఇందు కోసం రూ 2,200 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు రోడ్ల రిపేర్లు ప్రారంభించినట్లుగా సమాచారం లేదు. ఇక, కొద్ది రోజుల క్రితం వరకు భారీ వర్షాల కారణంగా పనులు ప్రారంభించలేదని అధికారులు చెబతున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోతో పాటుగా రోడ్ల దుస్థితి.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదంటూ..సెటైర్లతో కామెంట్స్ పోస్టు అవుతున్నాయి.  ఈ బ్యానర్ వైరల్ అవ్వడంతో అధికారులు పరుగులు పెట్టారు. వెంటనే అక్కడ నుంచి బ్యానర్ ను తొలగించారు..

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Viral photo, West Godavari

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు