Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
AP Politics: ఆంధ్రప్రదేశ్ (Andha Pradesh) లో కొందరి రాజకీయ నేతలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వారికి ఫైర్ బ్రాండ్స్ అనే బ్రాండ్ ఉంది.. వైసీపీ (YCP) లో చాలామందే ఉన్నారు అలాంటి వారు.. ఆయా నేతలు నోరుతెరిచారంటే ప్రతిపక్షాలు బెంబేలెత్తిపోయేవి. వారంతా..? తమ మాటల తూటాలతో ప్రత్యర్ధులను చీల్చి చెండాడేవారు. అది అసెంబ్లీ అయినా మీడియా సమావేశమైనా పార్టీ వేదికైనా, పబ్లిక్ మీటింగ్ అయినా మైకు కనపడితే చాలు వారు ప్రతిపక్షాలపై పవర్ పంచ్ లతో విరుచుకు పడేవారు. తమ నాయకుడు.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) ని విమర్శిస్తే చాలు.. నోటికి పని చెబుతారు. తీవ్రమైన పదజాలంతో ముప్పేట దాడి చేసి ముప్పతిప్పలు పెట్టడం వారి క్వాలిపికేషన్..
ప్రస్తుత మంత్రులు ఆర్కే రోజా (RK Roja), అంబటి రాంబాబు (Ambati Rambabu).. మాజీ మంత్రులు కొడాలి నాని (Kodali Nani), పేర్ని నాని (Perni Nani), అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav).. వీరందరికీ ఫైర్ బ్రాండ్ అనే ముద్ర ఉంది. గతంలో తమ ప్రసంగాలతోనే ప్రతిపక్ష నేతలకు భయపెట్టేలా వార్నింగ్ ఇచ్చేవారు. ఇక వెక్కిరింపులు, హేళనలు, అక్కడక్కడా రెండు తిట్లతో మాంచి మసాలా దట్టించి మరీ వడ్డించే వారు.
అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం ఇద్దరు నానీలు సహా అనిల్ కుమార్ యాదవ్ మంత్రులుగా ఉన్నప్పుడు ఉన్నంత ఊపు ఇప్పుడు లేదంటున్నారు. ఇక అంబటి రాంబాబు, ఆర్కే రోజ వంటి వారు మంత్రులు అయ్యాక స్పీడు తగ్గించారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒకప్పుడు వీరలెవల్లో చెలరేగిన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ లాంటి వారు.. మంత్రి పదవులు పోయిన తరువాత కొంతమేర అలక వహించారని పార్టీ వర్గాల సమాచారం.
ఇదీ చదవండి : నోరుజారారా.. కావాలనే అన్నారా.. మహానటిపై మంత్రి అనుచిత వ్యాఖ్యలు.. ఫైరవుతున్న నెటిజన్లు
రోజా, అంబటి లాంటి నేతలు మంత్రి పదవులు వచ్చాక హుందాతనం కోసం మౌనాన్ని ఆశ్రయిస్తున్నారని పార్టీ శ్రేణులవాదన. ఇక బొత్స, బుగ్గన వంటి వారు అడపా దడపా మెరిసినా వారి ప్రసంగాలలో పదును ఉండడం లేదని.. అక్కడక్కడ టంగ్ స్లిప్ తో పార్టీకి కొత్త తలనొప్పులు తీసుకు వస్తున్నారనే భావన కూడా ఉంది.
ఇదీ చదవండి : 2024 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేస్తారా..? అసలు తారక్ మనసులో ఏముంది..?
అయితే వీరంతా అసలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. పార్టీ పై అసంతృప్తితో వీళ్ళే మాట్లాడటం లేదా లేక వీరి దూకుడు వల్ల నష్టపోతున్నామని పార్టీ అధిష్టానమే వీరిని కంట్రోల్ ల్లో ఉండమని ఆదేశాలు జారిచేసిందా అనేదనిపై భిన్న వాధనల ఉన్నాయి. జగన్ కి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ వీరంతా కూడా తమతమ నియోజకవర్గాలలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పుండు మీద కారం చల్లినట్లు పార్టీలోని తమ ప్రత్యర్ధులను సైతం జగన్ ప్రోత్సహించడం తో వారు మరింతగా రగిలిపోతున్నారని ప్రచారం ఉంది.
ఇదీ చదవండి : టీడీపీకి సిగ్నల్స్ తో పాటు.. వార్నింగ్ ఇచ్చారా? పవన్ వ్యాఖ్యలకు అర్థం అదేనా?
అందుకనే మనకెందుకొచ్చిన గొడవ అని వీరంతా సైలెట్ ఐపోయారని.. ఒకవేళ అధికారం మారితే తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో ఉన్నారంట. ఇప్పటికే ఆయా నియోజకవర్గాలలో వీరిని ఓడించడానికి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధపెట్టి పని చేస్తున్నారు. కష్టాలను కొనితెచ్చుకోవడం ఎందుకు అసలే ప్రతిపక్షాలు తమపై కోపంతో ఉన్నాయి. ఎగిరెగిరి దంచినా అదేకూలి,. ఎగరకుండా దంచినా అదే కూలి అన్నట్లు జగన్ తమకు ప్రత్యేకంగా ఒరగబెట్టేదేంలేదని వీరి ఆలోచన కావచ్చు అంటున్నారు రాజకీయ మేధావులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Kodali Nani