Home /News /andhra-pradesh /

Heavy Rains: ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

Heavy Rains: ముంచుకొస్తున్న మరో ముప్పు.. ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్ మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Orange alert: వరుణుడు చేసిన డ్యామేజ్ నుంచి రాయలసీమఇంకా పూర్తిగా తేరుకోలేదు. ఇప్పుడు మరో జిల్లాతో కలిపి మొత్తం నాలుగుంటికి హెచ్చరికలు చేస్తోంది వాతావరణ శాఖ. ఆ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.

  Danger bells to Andhra pradesh:  ఆంధ్రప్రదేశ్ పై వరుణుడు పగ బట్టాడా అని అంతా భయపడుతున్నారు. ముఖ్యంగా కరవు సీమగా గుర్తింపు పొందిన రాయలసీమ (Rayalaseema) పై  ప్రకృతి ప్రకోపానికి కారణం ఏంటో అర్థం కాలేదు అంటున్నారు. ఇప్పటికే వరదలో సీమ జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇప్పుడు మరో నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం కలవరపెడుతోంది. ఈ వానలు ఇలాగే కొనసాగితే నదీ పరీవాహక ప్రాంతాల్లో ఉండే నిర్మాణాలు దెబ్బతినడం ఖాయం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని రాయలసీమ జిల్లాలకు వచ్చిన వరదలు (AP Floods) పెద్ద విలయాన్నే సృష్టించాయి. చిన్నచిన్న ఇళ్లతో పాటు భారీ వంతెనలు కూడా నీటిలో కొట్టుకుపోయాయి.

  చిన్న చిన్న రోడ్ల నుంచి హైవేల వరకు తుడిచిపెట్టుకుపోయాయి. ఇళ్లు కొట్టుకుపోవడంతో వేలాది మంది రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. అలాగే రోడ్లు, వంతెనలను నదీ ప్రవాహం తీసుకెళ్లిపోయింది. దీంతో రోజువారీ పనులు, ఉద్యోగాలకు వెళ్లాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. కొందరు ప్రమాదకర పరిస్థితుల్లో స్కూళ్లకు, కూలిపనులు, ఇతర పనుల నిమిత్తం నదులు, ప్రమాదకరమైన ప్రవాహాలు దాటాల్సి వస్తోంది.

  ఇదీ చదవండి : మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం.. వరదల్లో వైఫల్యంపై న్యాయ విచారణ చేయాలని చంద్రబాబు డిమాండ్

  తాజాగా మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది.  ఆంధ్రప్రదేశ్ కు మరో ముప్పు తప్పదు అంటోంది. మళ్లీ ఈసారి కూడా ఆ 4 జిల్లాలే టార్గెట్‌ అవుతున్నాయని హెచ్చరికలు అందుతున్నాయి. ఈ వార్త ఇప్పుడు ఆ ప్రాంతాల ప్రజలను కలవరపెడుతోంది. ఇంకా వరుణుడు సృష్టించిన జల విలయం నుంచి పూర్తిగా కోలుకోలేదు ఆ 4 జిల్లాలు. కానీ ఇంతలోనే మరో ప్రమాద హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఆ జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం లోతట్టు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  ఇదీ చదవండి : మనిషి కాదు దేవుడు.. జీవితంపై ఆశలు వదులుకున్న నలుగురి ప్రాణాలు కాపాడాడు..

  కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే కాదు.. తెలంగాణ (Telangana)తో పాటు మరో పొరుగు రాష్ట్రం తమిళనాడు (Tamilnadu) కూడా ప్రమాదం అంచున ఉంది. ఇటీవల చెన్నైను వానలు వణికించాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాలు వరదల నుంచి తేరుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఈ నెల 30న దక్షిణ అండమాన్ వద్ద అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో కుండపోతగా భారీ వర్షం పడుతుందని హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ రాత్రి వరకు తమిళనాడులోని పలు జిల్లాల్లో వానలు ముంచెత్తుతాయని వెల్లడించింది. చెన్నై సహా, కడలూరు, మైలాడు దురై, రామనదాపురం, తూత్తుకుడి , నాగపట్నం జిల్లాల్లో అతి భారీవర్షాలు పడతాయని తెలిపింది. ఇక రేపు కన్యాకుమారి, తిరునెల్వేలిలో అతి భారీవర్షాలు కురుస్తాయని ప్రకటించింది.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP Floods, AP News, Chitoor, Kadapa, Nellore

  తదుపరి వార్తలు